Latest Updates
-
కొవిడ్ ఇచ్చిన కిక్.. డిగ్రీ పట్టా లేదు, వ్యాపారం కాదు.. కానీ 20 ఏళ్లకే నెలకు రూ. లక్షల్లో ఆదాయం.! -
పచ్చిమిర్చి ఊరగాయ ఇలా చేస్తే..ఒక్క ముద్ద తినేవాళ్లు నాలుగు ముద్దలు లాగించేస్తారు! -
కౌమార దశలో బాలికలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏంటో తెలుసా.? -
చికెన్ బిర్యానీ తిన్నా షుగర్, బరువు పెరగకుండా ఉండాలంటే ఇలా చేయండి! -
డా. మంతెన ఆరోగ్య చిట్కాలు.. అన్ని విటమిన్లనూ ఒకే కప్పులో అందించే ప్రకృతి రహస్యం ఇదే.! -
రాత్రి అన్నం మిగిలితే ఇలా ఊతప్పం చేయండి.. పిల్లలు, పెద్దలు లొట్టలేసుకుని తింటారు! -
చీర ఎత్తితే చీరేస్తారు: పంక్షన్లలోనే కాదు.. రైళ్లలోనూ హిజ్రాల బీభత్సం! -
ఉదయాన్నే ఒక కప్పు చాలు.. ఒంటి నొప్పులను తగ్గించి, పుష్టిగా బలాన్ని ఇచ్చే హెల్తీ బ్రేక్ఫాస్ట్.! -
బెంగాలీ స్పెషల్ రాధాభల్లవి పూరీ..ప్లేట్ లోనే స్వర్గం కనిపించేస్తది! -
మరో పది రోజుల్లో మంగళ గోచారం.. వీరికి దీనికి మించిన మంచి సమయం ఉండదు.!
షాకింగ్..!! టీవీ చూస్తే.. లావైపోతారా ?
టీవీ చూస్తే లావైపోతారా ? ఇదెక్కడి విడ్డూరం అనుకుంటున్నారా ? నిజమే టీవీ చూడటం వల్ల మీ బరువు పెరగడం మాత్రమే కాదు.. మీ ప్రాణాలకు కూడా ముప్పేనట. టీవీ మిమ్మల్ని ఎక్కువగా తినడానికి, తక్కువగా పనిచేయడానికి ప్రోత్సహిస్తుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. టీవీ మనల్ని అలానే కూర్చుండిపోయేలా, అనర్థం కలిగించే విధంగా ఆహారం తీసుకునేలా చేసి.. శరీరంపై దుష్ర్పభావం కలిగేలా చేస్తుందట.
90 శాతం మంది పిల్లలు బయటకు వెళ్లి ఆడుకోకుండా.. టీవీల ముందు కూర్చుని టైం పాస్ చేస్తున్నారు. పిల్లలు టీవీలకు అతుక్కుపోతున్నారు. అలాగే పెద్దవాళ్లు కూడా.. రోజూ వ్యాయామం చేయకుండా.. కేవలం టీవీలు ఎక్కువగా చూడటానికే పరిమితమవుతున్నారు. దీనివల్ల ఎక్కువగా తినడానికి కారణమవుతోంది. ఇది ఆరోగ్యానికి ఏ మాత్రం ప్రయోజనం చేకూర్చడం లేదు.
గంటల కొద్దీ కూర్చోవడం వల్ల శరీరంలో మెటబాలిజం రేట్ తగ్గిపోతుంది. ఫ్యాట్ కరిగించడానికి కారణమయ్యే ఎంజైమ్స్ పనితీరు పూర్తీగా పడిపోతుంది. దీనివల్ల ఒబేసిటీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బరువు పెరగడం వల్ల గుండె సంబంధిత సమస్యలకు, మధుమేహానికి అవకాశముంది. కాబట్టి.. టీవీలతో ఎంత ప్రమాదం ముంచి ఉందో ఇప్పుడు చూద్దాం..

ఏకాగ్రత
టీవీకి అడిక్ట్ అవడం వల్ల.. పూర్తీ ఏకాగ్రత టీవీపైనే ఉంటుంది. దీనివల్ల మీకు తెలియకుండానే.. మీరు ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటారు. ఫుడ్ తీసుకోవడంలో కంట్రోల్ మిస్ అవుతారు. కాబట్టి మీరు ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు అనేది చాలా ముఖ్యం. ఇలా పరిమితి లేకుండా తీసుకోవడం వల్ల బరువు ఈజీగా పెరిగిపోతారు.

మెటబాలిజం
మెటబాలిజం బ్రెయిన్ కి లింక్ అయి ఉంటుంది. ఎప్పుడైతే.. బ్రెయిన్ కాన్సంట్రేషన్ మొత్తం టీవీపై ఉంటుందో.. అప్పుడు ఆహార అలవాట్లు డిస్ర్టబ్ అవుతాయి. దీనివల్ల బరువు పెరగడానికి కారణమవుతుంది.

బెల్లీ ఫ్యాట్
చాలామంది గంటల కొద్దీ టీవీల ముందు కూర్చునిపోతారు. ఇలా ఎక్కువసేపు కూర్చుకోవడం, టీవీ చూస్తూ.. చిరుతిండ్లు తినడం వల్ల.. పొట్టలో కొవ్వు పేరుకుంటుంది. దీనివల్ల బెల్లీ ఫ్యాట్ రావడానికి కారణమవుతుంది.

ఎనర్జీ
టీవీ చూడటం వల్ల బరువు పెరగడం మాత్రమే కాదు.. ఎనర్జీని కూడా కరిగించేస్తుంది. బరువు పెరిగేలా చేయడంతోపాటు.. నీరసించిపోయేలా చేస్తుంది. దీనివల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలకు అవకాశముంది.

అనారోగ్యకరమైన స్నాక్స్
టీవీ చూస్తూ కూర్చున్నప్పుడు తినే చిరుతిండిపై ఎవరూ కాన్సంట్రేట్ చేయరు. ఏది పడితే అది లాగించేస్తారు. దీనివల్ల హై క్యాలరీ, ఫ్యాటీ ఫుడ్ తీసుకుంటారు. దీనివల్ల ఈజీగా బరువు పెరగడానికి కారణమవుతుంది.

నిద్రలేమి
ఎక్కువసేపు టీవీ చూడటం వల్ల ఫ్యాట్ పెరగడానికి, నిద్రలేమికి కూడా కారణమవుతుంది. ఎక్కువ సమయం టీవీ చూడటం వల్ల రాత్రి పడుకున్నప్పుడు కూడా.. మీ కళ్లలో టీవీ ప్రోగ్రామ్స్ మెదులుతూ ఉంటాయి. 8గంటల నిద్రకు భంగం కలుగుతుంది. దీనివల్ల బరువు పెరగడంతో పాటు.. అనేక రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.

చేతులకు పని లేకుండా
టీవీ చూసేటప్పుడు చేతులు ఖాళీగా ఉంటాయి. ఇది అందరికి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. దీనివల్ల బర్గర్, పాప్ కార్న్ ఏదో ఒకటి లాగించడానికి వీలు దొరుకుతుంది. టీవీ మిమ్మల్ని బరువు పెంచడానికి కారణమవుతుంది అనడానికి ఇది ఒక కారణం.



Click it and Unblock the Notifications
