For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్ట్ : ‘‘టీ’’ ఖచ్చితంగా తాగకూడదనడానికి 10 కారణాలు.!!

|

వావ్ నాలుగు గంటలైంది..! ''టీ''టైమ్ స్టార్ట్ అయింది. ''టీ'' అంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి. ఆఫీసుల్లో పనిచేసే వారికి మాత్రమే కాదు, ఇంట్లో ఉండే కాలేజి పిల్లల నుండి పెద్దలు, వయస్సైన వారి వరకూ టీని అమితంగా ఇష్టపడుతారు. ఈ ప్రపంచం మొత్తంలో నీళ్ళు తర్వాత బాగా పాపులరైన డ్రింక్ టీ. ఎందుకంటే నీళ్ళ తర్వాత ఎక్కువగా ఇష్టపడేది టీ. కొంత మందికి ఉదయం, సాయంత్రం గొంతులోకి టీ పడితే తప్ప ఇక ఆరోజు పూర్తవ్వదు . అలాంటి టీని తాగడం వల్ల బెనిఫిట్స్ ఏంటి? సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని మీరెప్పుడైనా తెలుసుకున్నారా...? కనీసం తెలుసుకునే ప్రయత్నం చేశారా? లేదా..? అయితే ఇప్పుడు తెలుసుకోండి..

'టీ' ప్రియులకు ఈ విషయం కొంచెం కష్టం అనిపించినా సరే, టీలోని సైడ్ ఎఫెక్ట్ గురించి తెలుసుకోవడం చాలా అవసరం. మితంగా తీసుకునే వరకూ ఏ ఆహార పానియాలైనా అమృతంతో సమానమే. అమితంగా తీసుకుంటే మాత్రం విషమే..అటువంటి ఆహారపానియాల్లో 'టీ' కూడా ఒకటి. టీ తాగాలనుకున్నప్పుడు జస్ట్ తాగేసేయాలి అంతే. అది మూడ్ ను బట్టి, లేదా అవసరాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే టీని ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు కన్నా హానే ఎక్కువ జరుగుతుంది.

'టీ' ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యానికి కొన్ని అసాధరణమైన సైడ్ ఎఫెక్ట్స్ కలిగిస్తుంది. టీ ఎక్కువ సార్లు తాగడం వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి, మీరు టీ ఎక్కువ సార్లు తాగుతుంటే వెంటనే పరిమితం చేసుకోండి. అలాగే టీ క్వాంటిటీ కూడా తగ్గించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఊహూ...మేము టీ త్రాగనే తాగాలి అనుకునే వారికి టీ గురించి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి..

రెస్ట్ లెస్ నెస్:

రెస్ట్ లెస్ నెస్:

ఎక్కువగా టీ తాగితే, అందులోనే ఉండే కెఫిన్ కంటెంట్ కొంత వరకూ శరీరానికి మేలు చేసినా, కొంత మందిలో మాత్రం చాలా డిఫికల్ట్ గా పనిచేస్తుంది. ఎక్కువ టీ, లేదా ఎక్కువ సార్లు టీ తాగడం వల్ల రెస్ట్ లెస్ నెస్ గా ఫీలవుతారు. ఆందోళన, హార్ట్ రేట్ పెరుగుతుంది, నిద్రలేమి సమస్యలతో బాధపడుతారు.

మరికొన్ని లక్షణాలు:

మరికొన్ని లక్షణాలు:

టీ ఎక్కువగా..ఎక్కువ సార్లు తాగడం వల్ల, ఈ అలవాటు కొన్ని సంత్సరాల నుండి ఉండే వారిలో మానసిక సమస్యలు ఎదుర్కుంటారు. అందులో ముఖ్యంగా టీ తాగకపోవడం తలనొప్పి, అలసట, నీరసం, ఏకాగ్రత లోపించడం వంటి లక్షణాలు కనబడుతాయి.

స్కెలిటల్ ఫ్లోరోసిస్:

స్కెలిటల్ ఫ్లోరోసిస్:

ఎక్కువగా టీ తాగడం వల్ల అత్యంత ప్రమాధకరమైన ఆరోగ్య సమస్య స్కెలిటల్ ఫ్లోరోసిస్. టీలో ఫ్లోరైడ్ అధికంగా ఉండటం వల్ల, టీని ఎక్కువ సార్లు తాగడం వల్ల శరీరంలో ఫ్లోరైడ్ టాక్సిసిటి ఎక్కువ అవుతుంది. టీ(ఫ్లోరైడ్ )ని ఎక్కువ సార్లు తాగడం వల్ల స్కెలిటల్ ఫ్లోరోసిస్ అని బాధాకరమైన బోన్ డిసీజ్ కు కారణమవుతుంది.

ప్రొస్టేట్ క్యాన్సర్:

ప్రొస్టేట్ క్యాన్సర్:

ఎక్కువగా టీ తాగడం వల్ల మరో వరెస్ట్ సైడ్ ఎఫెక్ట్ ఇది. ఒక రోజులో 4నుండి 5,6 కప్పుల టీ తాగే వారిలో 50శాతం ప్రొస్టేట్ క్యాన్సర్ పెరుగుతున్నట్లు రీసెంట్ గా జరిపిన పరిశోధనల్లో వెల్లడైనది. అదే విధంగా, డైట్, ఏజ్ ఫ్యామిలీ హిస్టర్ మొదలగునవి కారణాలు కూడా ప్రొస్టేట్ క్యాన్సర్ కు కారణమవుతాయి.

 కిడ్నీ ఫెయిల్యూర్:

కిడ్నీ ఫెయిల్యూర్:

టీ ఎక్కువగా తీసుకోవడ వల్ల చాలా అరుదైన కేసుల్లో కిడ్నీ సమస్యలు తలెత్తుతాయి. సాధరణ టీ అయినా, ఐస్ టీ అయినా ఏదైనా సరే కిడ్నీఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. రీసెంట్ గా అమెరికాలో 56ఏళ్ళ వయస్సున్న వారి మీద జరిపిన పరిశోధనల్లో ఈ విషయం నిర్ధారణ అయినది.

 మలబద్దకం:

మలబద్దకం:

ఉదయం టీ తాగడం వల్ల మలబద్దక సమస్యలుండవు అనుకునే వారు చాలా మందే ఉంటారు, అయితే ఎక్కువగా టీ తాగడం వల్ల వ్యతిరేఖ ప్రభావం కలిగిస్తుంది. టీలో థియోఫిలిన్ అనే కెమికల్ స్టూల్ మీద డీహైడ్రేషన్ ఎఫెక్ట్ ను కలిగిస్తుంది, దాంతో మలబద్దకంకు దారితీస్తుంది.

పొట్టలో అసౌకర్యం:

పొట్టలో అసౌకర్యం:

బ్లాక్ టీలో ఉండే కెఫిన్ వల్ల పొట్టలో అసిడిక్ ఉత్పత్తి మీద ప్రభావం చూపుతుంది. వీటిని శరీరం సరిగా గ్రహించకపోవడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. పొట్ట సమస్యలు, అల్సర్ తో బాధపడే వారు బ్లాక్ టీ తాగకపోవడం మంచిది.

 కార్డియో వ్యాస్కులర్ సమస్యలు:

కార్డియో వ్యాస్కులర్ సమస్యలు:

హార్ట్ సమస్యలున్నవారు , కార్డియోవాస్కులర్ డిజార్డర్ ను చికిత్స తీసుకుంటున్న వారు బ్లాక్ టీని తీసుకోకపోవడమే మంచిది. టీలో ఉండే కెఫిన్ కార్డియో వ్యాస్కులర్ సిస్టమ్ కు సెట్ కాకపోవడం వల్ల సమస్యలు మరింత తీవ్రం అవుతాయి.

గర్భ స్రావం జరగవచ్చు:

గర్భ స్రావం జరగవచ్చు:

గర్భిణీలు బ్లాక్ టీని తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు, టీలో ఉండే కెఫిన్ కంటెంట్ పొట్టలో పెరిగే ఫీటస్ మీద ప్రభావం చూపుతుంది. గర్భస్రావం జరిగే అవకాశం ఉంది. గర్భం కోసం ప్లాన్ చేసుకునే వారు కాఫీ, టీలను పూర్తిగా మానేయడం మంచిది.

డ్యూరియాటిక్ ఎఫెక్ట్ మరియు నిద్రలేమి సమస్యలు:

డ్యూరియాటిక్ ఎఫెక్ట్ మరియు నిద్రలేమి సమస్యలు:

టీలో ఉండే కెఫిన్ డ్యూరియాటిక్ ఎఫెక్ట్స్(యూరిన్ ఉత్పత్తిలో సమస్యలు) కలిగి ఉంటుంది. మూత్రవిసర్జన కోసం రాత్రుల్లో ఎక్కువ సార్లు నిద్రలేవాల్సి వస్తుంది. దాంతో నిద్రలేమి, అలసట సమస్యలకు దారితీస్తుంది. టీ తాగడం వల్ల డ్యూరియాటిక్ ఎఫెక్ట్ కలగదు, కానీ క్వాంటిటీ ఎక్కువగా (300మిల్లీగ్రాముల కంటే ఎక్కువ 6 కప్పులకు సమానంగా)తీసుకోవడం వల్ల డ్యూరియాటిక్ సమస్యలు ఎక్కువ అవుతాయి.

కాబట్టి, సాధ్యమైనంత వరకూ టీ పరిమితం చేసుకోవడం మంచిది. లేదా పూర్తిగా మానేయడం మంచిది. టీని చాలా వేడిగా తాగడం కూడా ఆరోగ్యానికి ప్రమాధకరమనే చెప్పాలి. టీలో ఉండే కెమికల్స్, కెఫిన్స్ మీరు మెడికేషన్ తీసుకుంటున్నట్లైతే వీటిని మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. అందువల్ల టీని పరిమితంగా మాత్రమే తీసుకుని, అనేక ప్రయోజనాలు పొందండి.

English summary

Drinking Too Much Of Tea? 10 Reasons That Tell Why You Shouldn’t

We all love tea, isn't it? It is the most popular drink across the globe after water and there is hardly any routine to follow when it comes to drinking tea. However, do you know the health problems of drinking too much tea?
Desktop Bottom Promotion