For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్జీలతో బాధపడుతున్నారా ? అయితే.. వీటిని డైట్ లో చేర్చుకోండి...

By Swathi
|

చాలా మందికి రకరకాల అలర్జీలుంటాయి. కొంతమందికి స్కిన్ ఎలర్జీ, తుమ్ములు, ముక్కులో నుంచి నీళ్లు కారడం, శ్వాస సమస్యలు వంటివన్నీ అలర్జీల కిందకు వస్తాయి. ఇవి.. చాలా అసౌకర్యంగా చేస్తాయి. చిరాకు తెప్పిస్తాయి. ఇలా తరచుగా అలర్జీలతో బాధపడేవాళ్లకు.. మూడ్ కూడా.. ఉన్నట్టుండి మారిపోతూ ఉంటారు. చాలా చిరాకుకు గురవుతూ ఉంటారు.

అలర్జీలు నివారించడానికి చాలా మందులు ఉన్నాయి. కానీ.. మెడిసిన్స్ ఒక్కసారి వేసుకోవడం అలవాటు చేసుకుంటే.. అవి మిమ్మల్ని డిపెండెంట్స్ గా మార్చేస్తాయి. కాబట్టి న్యాచురల్ రెమిడీస్ ఫాలో అవడం మంచిది. అవి కూడా.. మీ డైట్ లో కొన్ని ఆహారాలను చేర్చుకుంటే చాలు.. అలర్జీలకు దూరంగా ఉండవచ్చు.

వెల్లుల్లి

వెల్లుల్లి

వెల్లుల్లి ఇమ్యునిటీని పెంచుతుంది. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. కాబట్టి.. ట్యాబ్లెట్ లా ఒక వెల్లుల్లి రెబ్బని తినడం వల్ల.. కొన్ని రకాల ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది.

పసుపు

పసుపు

పసుపులో కూడా.. అలర్జీలు నివారించే గుణాలుంటాయి. అలాగే ఇందులో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలుంటాయి. ఆహారాల్లో కొద్దిగా పసుపుని కలిపి తీసుకుంటే చాలు.. అలర్జీలకు దూరంగా ఉండవచ్చు.

పెరుగు

పెరుగు

పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది.. అలర్జీలను తగ్గిస్తుంది. పెరుగును రెగ్యులర్ గా ఎవరైతే తీసుకుంటారో.. వాళ్లలో ఇన్ల్పమేషన్ తగ్గడమే కాకుండా, అలర్జీలు రావని అధ్యయనాలు చెబుతున్నాయి.

చేపలు

చేపలు

చేపల్లో ఉండే ఫ్యాట్ ఇన్ల్ఫమేషన్ ని తగ్గిస్తుంది. చేపల ద్వారా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అందుతాయి. దీనివల్ల అలర్జీలను అరికట్టవచ్చు. కాబట్టి వారానికి ఒకసారి చేపలు తీసుకోవాలి.

విటమిన్ సి

విటమిన్ సి

విటమిన్ సి.. రెండుపద్ధతుల్లో సహాయపడుతుంది. ఇది ఇమ్యునిటీని పెంచడంతో పాటు.. ఎలర్జీలను నివారిస్తుంది. కాబట్టి.. రెగ్యులర్ గా ఆరంజ్ లేదా నిమ్మరసం తీసుకుంటూ ఉండాలి.

ఉల్లిపాయ

ఉల్లిపాయ

ఉల్లిపాయలో క్వెసీటిన్ ఉంటుంది. ఇది.. అలర్జీలను ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది. అలాగే ఇన్ల్ఫమేషన్ ని అడ్డుకుంటుంది. అలాగే ఉల్లిపాయలు.. ఇమ్యునిటీని పెంచుతాయి.

విటమిన్ ఈ

విటమిన్ ఈ

విటమిన్ ఈ ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల.. కొన్ని రకాల అలర్జీలను నివారించవచ్చు. అవకాడాలో విటమిన్ ఈ పుష్కలంగా లభిస్తుంది. అలాగే గ్రీన్ వెజిటబుల్స్, నట్స్, అవకాడోలలోనూ .. విటమిన్ ఈ పొందవచ్చు.

English summary

Eat These Foods To Reduce Allergies

Eat These Foods To Reduce Allergies. Allergies make you uncomfortable. Imagine the symptoms. Runny nose, itchy skin, breathing problems or irritability; how can one feel comfortable and healthy when such allergies spoil your moods?
Story first published:Friday, August 12, 2016, 14:33 [IST]
Desktop Bottom Promotion