For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చికెన్ పాక్స్ (ఆటలమ్మ ) నివారణకు10 ఎఫెక్టివ్ హోం రెమెడీస్

By Super
|

చికెన్ పాక్స్(వారిసెల్ల) అనే వ్యాధి వారిసెల్లా జోస్టర్ వైరస్ ద్వారా వ్యాపిస్తుంది. జ్వరం, దురద, బొబ్బల వంటి రాష్ లు ఈ వ్యాధి యొక్క లక్షణాలు. చర్మం పై సూక్ష్మ క్రిముల ద్వారా అంటువ్యాధి, న్యుమోనియా, మెదడు వాపు వంటి ప్రమాదకరమైన సమస్యలకి ఈ వ్యాధి కారణమయ్యే అవకాశం ఉంది.

ఆటలమ్మ(Chicken pox) లేదా అమ్మవారు అని సాధారణంగా పిలవబడే ఈ వైరల్ వ్యాధిని వైద్య పరిభాషలో వారిసెల్లా జోస్టర్ (Varicella zoster) అని వ్యవహరిస్తారు. ఈ వ్యాధి చిన్నతనంలో ప్రతి పిల్లవాడికి సోకి నయమవడం సర్వసాధారణం. ఆటలమ్మ వారిసెల్లా జోస్టర్ వైరస్ ద్వారా సంక్రమిస్తుంది, ఈ వైరస్‌ను హ్యూమన్ హెర్పిస్ వైరస్ 3 అని కూడా వ్యవహరిస్తారు. ఆ రోజుల్లో మశూచి (Smallpox) అంటే చాలా భయపడేవారు, ఎందువలనంటే ఈ జబ్బు బారిన పడిన ప్రతి ముగ్గురిలో ఒకరు చనిపోయేవారు, లేక వారు రూపురేఖలు చూడటానికి భయంకరంగా వుంటుంది.

ఇది వైరస్ వల్ల వ్యాప్తి చెందుతుంది.ఈ వ్యాధి సోకిన వారికి చర్మం దురదగా ఉండటమే కాకుండా ఎర్రగా కందిపోతుంది. తొలుత ముఖంపై ప్రారంభమైన ఈ దురద మెల్లగా వీపు, నడుము భాగాలకు కూడా వ్యాపించి చర్మం మొత్తం చిన్న చిన్న ఎర్ర కురుపులుగా మారతాయి. నోటి పూత, కురుపులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధి ఇంట్లో ఒకరికి వస్తే అందరికీ సోకే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

పెద్దల్లో వ్యాధినిరోధకత లోపించిన ఇన్ఫెక్షన్ డిసీజ్ కు గురైన వారు కోలుకోవడానికి ఈ వైరస్, వేరిసెల్లా కు వ్యతిరేకంగా వ్యాసినేట్ చేసుకోవాలి. లేదా కొన్ని హోం రెమడీస్ ఉపయోగించి నేచురల్ గా చికెన్ పాక్స్ ను తగ్గించుకోవచ్చు. వ్యాధి తీవ్రత పెరిగిన వెంటనే వైద్యుని సంప్రదించడం మంచిది. క్రమం తప్పకుండా మందులు తీసుకుంటే ఈ వ్యాధిని నివారించవచ్చు. అలాగే కొన్ని హోం రెమెడీస్ కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

తేనె:

తేనె:

తేనె ఒక నేచురల్ హోం రెమెడీ, చికెన్ పాక్స్ వల్ల చర్మం దురదను నివారించుకోవచ్చు . తేనెను నేరుగా ఎఫెక్టెడ్ ప్రదేశాల్లో అప్లై చేయాలి. ఇది దురద అసౌకర్యాన్ని తొలగించడం మాత్రమే కాదు ఇది మచ్చలను కూడా మాయం చేస్తుంది

కూల్ షవర్ బాత్:

కూల్ షవర్ బాత్:

సాధ్యమైనంత పళ్ళు మరియు కూరగాయలు తీసుకోండి. సాధారణం గా శరీరం వేడిగా ఉన్నప్పుడు ఈ వ్యాధి సోకే అవకాశాలు ఉన్నాయి. మాంసాన్ని దూరం గా ఉంచండి.

బేకింగ్ సోడా :

బేకింగ్ సోడా :

చర్మం మీద ఏర్పడ్డ ఎర్రని మచ్చలను బేకింగ్ సోడా అప్లై చేయడం వల్ల రెడ్ బంప్స్ తొలగిపోతాయి . వీటిని తొలగించి మరియు డ్రై చేయాలి . ఇది గాయాలను మాన్పడం మాత్రమే కాదు దురదను కూడా తగ్గిస్తుంది.

వేప:

వేప:

ఆటలమ్మకు వేప చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. వేపఆకులో యాంటీ వైరన్, మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . స్నానం చేసే నీటిలో వేపాకు వేసి ఆ నీటితో స్నానం చేయాలి. లేదా వేపాకును పేస్ట్ చేసి శరీరం మొత్తం అప్లై చేసి ఆరిన తర్వాత స్నానం చేయడం వల్ల తక్షణ ఉపశమనం కలుగుతుంది . దద్దుర్లను డ్రైగా మార్చుతుంది మరియు హీలింగ్ ప్రొసెస్ పెంచుతుంది.

వెనిగర్ :

వెనిగర్ :

శరీరానికి సంబంధించిన జాగ్రత్తలు : ఒక టబ్ లో గోరువెచ్చని లేదా వెచ్చని నీటిలో 2 టేబుల్ స్పూన్ సి సాల్ట్ మరియు 1/4 కప్ ఆపిల్ సైడేర్ వినిగర్ కలిపి దానిలో 20 నిముషాలు కూర్చోవటం చెయ్యటం మంచిది . దీని వలన దురదలు తగ్గటం మరియు పుల్లు శుభ్రపడటం జరుగుతుంది . బబుల్ బాత్ లు , సాధారణ సబ్బు తో స్నానం చెయ్యక పోవటం మంచిది .

సి విటమిన్ :

సి విటమిన్ :

పెద్దవారిలో చికెన్ పాక్స్ ను నివారించుకోవడానికి అతను/ఆమె శరీరం స్ట్రాంగ్ గా ఉంచుకోవాలి, ముఖ్యంగా వ్యాధినిరోధకతను పెంచుకోవాలి . ఇలా ఇమ్యునిటి పెంచుకోవాలంటే మీరు తీసుకొనే ఆహారంలో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ను మరియు తాజా పండ్లు , విటమిన్ సి ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి .

కివి ఫ్రూట్:

కివి ఫ్రూట్:

రెండు కివి పండ్లను ప్రతి భోజనం తో తీసుకోవటం వాల్ల విటమిన్ సి ,మరియు అతి ముఖ్య పోషకాలు లభించి ఉపిరి తిత్తులకు మేలు చేస్తాయి . దానివలన చర్మము మరియు రక్తము ఆరోగ్యం గా ఉంటాయి . అంతేకాక కివి లో ఉన్న ఎంజైము లు జీర్ణ వ్యవస్థకు కూడా మంచి చేస్తుంది . జీర్ణము అవ్వటం వలన శరీరానికి కావాల్సిన ఆరోగ్య కారకాలు అందుబాటులోకి వొచ్చి వ్యాధి నివారణను వేగవంతం చేస్తాయి .

సాల్ట్ బాత్ :

సాల్ట్ బాత్ :

స్నానం చేసే నీటిలో ఒక చెంచా సీసాల్ట్ వేసి అందులో వోడ్కా మరియు ల్యావెండర్ ఆయిల్ వేసి కొన్ని నిముషాలు అలాగే ఉంచాలి. ఈసాల్ట్ లో మైక్రోబయల్ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల చర్మాన్ని స్మూత్ గా మార్చుతుంది .

సాండిల్ వుడ్ ఆయిల్:

సాండిల్ వుడ్ ఆయిల్:

స్నానం తరువాత పుళ్ళకు అణిచి వేసే మందులను రాయండి . వస్త్రాన్ని వేడి నీటిలో ముంచి పిండి దానికి 10 నుండి 15 చుక్కలు సాండిల్ వుడ్ ఆయిల్ ను వేసి పుళ్ళ పైన వేడి తగ్గేవరకు రాయండి.

English summary

Effective Home Remedies To Cure chickenpox

Chicken pox, a rather contagious infection, can spread like fire, and the patient may need to be quarantined until the infection abates. While the worst symptoms of chicken pox subside in about a fortnight’s time, you can try a few effective home remedies to alleviate the symptoms such as itching and burnin
Story first published: Thursday, February 25, 2016, 14:03 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more