For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గ్యాస్ట్రిక్ ట్ర‌బుల్ నివారించే ఎఫెక్టివ్ హోం రెమిడీస్..

By Swathi
|

ఫుడ్ కాస్త అటు ఇటుగా మారినా.. ఎప్పుడూ అల‌వాటు లేని ఫుడ్ తిన్నా.. తిన్న ఆహారం స‌రిగా జీర్ణమ‌వ‌క‌పోయినా.. పొట్ట‌లో ఉబ్బ‌ర‌మే. గ్యాస్, అజీర్తి ఇలా ఎన్ని ర‌కాలుగా చెప్పుకున్నా ఆ స‌మ‌స్య మాత్రం చాలా ఇబ్బందికి గురిచేస్తుంది. ప్ర‌స్తుత లైఫ్ స్టైల్ లో చాలా మంది బాధ‌ప‌డుతున్న స‌మ‌స్య గ్యాస్ర్టిక్ ట్ర‌బుల్.

gastric trouble

అందరికీ స్పైసీ, డిలీషియస్ ఫుడ్ అంటే ఇష్టం. కొన్ని సందర్భాల్లో ఎక్కువగా తింటుంటాం. దీనివల్ల పొట్టలో నొప్పి, ఉబ్బరం, గ్యాస్ర్టిక్ వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అలా అని తినడం మానేయలేం కదా ? కాబట్టి చాలా మందిని వేధించే గ్యాస్ర్టిక్ ప్రాబ్లమ్స్ చెక్ పెట్టడానికి అనేక రకాల హోం రెమిడీస్ ఉన్నాయి. కేవలం పొట్టలో సమస్యలో కాదు కొన్ని రకాల ఆహారాలు హార్ట్ బర్న్, ఎసిడిటీకి కూడా కారణమవుతాయి.

ginger

గ్యాస్ర్టిక్ ట్ర‌బుల్ ఉన్న‌ప్పుడు చిన్న చిన్న కిచెన్ రెమిడీస్ ఫాలో అయితే చాలు.. స‌మ‌స్య‌ను సింపుల్‌గా డీల్ చేయ‌వ‌చ్చు. గ్యాస్ స‌మ‌స్య త‌ర‌చుగా ఇబ్బందిప‌డితే.. భోజ‌నానికి ముందు అల్లం ముక్క తింటే పొట్ట స‌మ‌స్య మీ ద‌రిచేర‌దు. అలాగే వెల్లుల్లిని ఆహారంలో ఎక్కువ‌గా ఉండేలా జాగ్ర‌త్తప‌డినా.. గ్యాస్ర్టిక్ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

జీరా కూడా గ్యాస్ స‌మ‌స్య‌కు చ‌క్క‌టి ప‌రిష్కారం. ఒక టేబుల్ స్పూన్ జీల‌క‌ర్ర పొడిని ఆహారంలో చేర్చుకుంటే.. గ్యాస్ స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు. లేదా సువాస‌న‌బ‌రిత‌మైన పుదీనా ఆకుల‌తో టీ తాగినా.. మంచి ఫ‌లితం ఉంటుంది. అది న‌చ్చ‌ని వాళ్లు.. ప‌ర‌గ‌డ‌పునే తుల‌సి ఆకుల ర‌సాన్ని మంచినీళ్ల‌తో క‌లిపి తీసుకుంటే.. జీర్ణ‌శ‌క్తి మెరుగై.. గ్యాస్ స‌మ‌స్య నుంచి త్వ‌ర‌గా ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు.

elachi

యాలకులు డైజెషన్ ప్రక్రియను ఇంప్రూవ్ చేస్తాయి. అలాగే గ్యాస్ ని అరికడతాయి. యాలకును మరుగుతున్న నీటిలో వేసి 5 నుంచి 7 నిమిషాలు ఉంచాలి. తర్వాత నిదానంగా తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

మిరియాలలో ఉండే హైడ్రోక్లోరిడ్ యాసిడ్ జీర్ణక్రియ సజావుగా సాగడానికి సహాయపడుతుంది. అరస్పూన్ బెల్లం, చిటికెడు మిరియాల పొడి కలిపి తీసుకోవాలి. దీనివల్ల గ్యాస్ర్టిక్ ట్రబుల్ మాత్రమే కాదు ఎసిడిటీ, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

English summary

Effective Home Remedies for Gastric problems

Home Remedies for Gastric problems. Although the production of gas is a natural part of the digestive process, many people dread the possibility of passing gas in front of others.
Story first published: Tuesday, July 26, 2016, 20:53 [IST]
Desktop Bottom Promotion