Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
మహిళల మెనూలో మిస్సవకూడని పోషకాలివే.. !
ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు రకరకాల పనులతో బిజీ బిజీగా గడుపుతారు మహిళలు. వీళ్లకు రెస్ట్ కాస్త తక్కువే. ఎప్పుడూ ఏదో ఒక పనిలో పడి ఆరోగ్యం గురించి కాస్త నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అయితే మహిళలు తమ రెగ్యులర్ డైట్ లో కొన్ని పోషకాలను కంపల్సరీ చేర్చుకోవాలని అధ్యయనాలు చెబుతున్నాయి. రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా ప్రాధాన్యమివ్వాల్సిన ఆహారాలేంటో ఇప్పుడు చూద్దాం..

క్యాల్షియం
మహిళలు వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనమయ్యే అవకాశాలున్నాయి. అందుకే మహిళల డైట్ లో క్యాల్షియం తప్పనిసరి అయింది. ఇండియాలో 30 మిలియన్ మహిళలు.. ఎముకల బలహీనతతో బాధపడుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి పాల ఉత్పత్తులు, డైరీ ప్రొడక్ట్స్, పెరుగు, సోయా మిల్క్ వంటి క్యాల్షియం ఫుడ్ ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం.

ఐరన్
ఐరన్ లోపం వల్ల అనీమియా వచ్చే అవకాశాలున్నాయి. ఇది చాలా సాధారణంగా మహిళల్లో కనిపించే వ్యాధి. కాబట్టి ఐరన్ ద్వారా కణాలకు ఆక్సిజన్ అందుతుంది. దీనివల్ల అలసట అనిపించదు. మాంసం, చికెన్, టర్కీ కోడి, బీన్స్ ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఐరన్ పొందవచ్చు.

విటమిన్ డి
శరీరంలో విటమిన్ డి సరైన స్థాయిలో లేకపోతే.. క్యాల్షియం తీసుకున్నా ఉపయోగం ఉండదు. కాబట్టి విటమిన్ డి పుష్కలంగా లభించే ట్యూనా ఫిష్, సాల్మన్ ఫిష్, ఆరంజ్ జ్యూస్ తీసుకుంటూ ఉండాలి.

ఫోలిక్ యాసిడ్
గర్భిణీ మహిళలకు ఫోలిక్ యాసిడ్ ఎంత అవసరమో.. మిగిలిన మహిళలకు కూడా అంతే అవసరం. కాబట్టి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, జ్యూస్, బీన్స్, నట్స్ ద్వారా ఫోలిక్ యాసిడ్ పొందవచ్చు.

ప్రొటీన్
ఆరోగ్యవంతమైన ఎముకలు, కండరాలు నిర్మితమవడానికి ప్రొటీన్స్ చాలా అవసరం. ఇవి క్రిములతో పోరాడి మెటబాలిజం స్థాయి కంట్రోల్ లో ఉండటానికి సహాయపడుతుంది. రెడ్ మీట్, ఫిష్, నట్స ద్వారా ప్రొటీన్స్ ఎక్కువగా పొందవచ్చు. ప్రతి మహిళకి రోజుకి కనీసం 45 గ్రాముల ప్రొటీన్ అవసరమని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఫైబర్
బ్లడ్ షుగర్ లెవెల్స్, కొలెస్ర్టాల్ ని మాత్రమే ఫైబర్ కంట్రోల్ చేయదు.. ఇది జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. ఫైబర్ ని వెజిటబుల్స్, ఫ్రూట్స్, ధాన్యాలు, బ్రెడ్స్, గింజలు, నట్స్, బీన్స్ ద్వారా పొందవచ్చు.

విటమిన్ సి
హెల్తీ బోన్స్, గ్లోయింగ్ స్కిన్ పొందాలంటే రెగ్యులర్ డైట్ లో విటమిన్ సి ఉండేలా జాగ్రత్త పడాలి. రెడ్ పెప్పర్, బ్రొకోలి, సిట్రస్ ఫ్రూట్స్ ద్వారా విటమిన్ సి పొందడం తేలిక. వారానికి మూడు సార్లు ఆరంజ్ జ్యూస్ తాగడం మంచిది.

ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్
ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ లో ఉండే ఫ్యాట్ హార్ట్ డీసీజ్ రిస్క్ నుంచి కాపాడుతుంది. సార్టీన్స్, సాల్మన్, హెర్రింగ్, వాల్ నట్స్, ఫ్లాక్స్ సీడ్స్ ద్వారా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పొందవచ్చు.



Click it and Unblock the Notifications