For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ బ్లడ్ గ్రూప్ ని బట్టి ఫాలో అవ్వాల్సిన హెల్తీ డైట్..!!

|

అన్ హెల్తీ లైఫ్ స్టైల్ అనేది ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తోంది. బిజీ లైఫ్, స్ట్రెస్, క్లైమెట్ కారణంగా లైఫ్ స్టైల్ లో చాలా మార్పులు వచ్చాయి. దీనివల్ల చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. కాబట్టి.. సింపుల్ గా మీ బ్లడ్ గ్రూప్ ని బట్టి.. మీరు తీసుకోవాల్సిన ఆహారాలు ఎంచుకుంటే.. హెల్తీ అండ్ ఫిట్ గా ఉంటారని ఎక్స్ పర్ట్స్ సూచిస్తున్నారు.

బ్లడ్ టైప్ ని బట్టి.. డైట్ ఫాలో అవడాన్ని బ్లడ్ టైప్ డైట్ అని పిలుస్తారు. ఫుడ్ బ్లడ్ టైప్ ని బట్టి తీసుకోవడం వల్ల వాళ్లకు జీర్ణక్రియ సమస్యలు ఉండవని, అలాగే వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. బ్లడ్ టైప్ ఒక వ్యక్తి అంతర్గత వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. కాబట్టి బ్లడ్ టైప్ ని బట్టి మనం తీసుకునే ఆహారం నుంచి పోషకాలను శరీరం తీసుకోగలుగుతుంది.

food according to blood type

ఆహారాన్ని బట్టి మెటబాలిజం స్థాయి పెరుగుతుంది. కాబట్టి తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. అందుకే ఒక వ్యక్తి డైట్ లో చేర్చుకునే ఫుడ్ వాళ్ల బ్లడ్ టైప్ ని ఎంచుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు సలహా ఇస్తున్నారు. అలా తీసుకున్నప్పుడే ఫిట్ అండ్ హెల్తీగా ఉంటారట. మరి మీ బ్లడ్ టైప్ ఏంటి ? ఆ బ్లడ్ టైప్ ని బట్టి ఏ ఆహారం తీసుకోవాలో తెలుసుకోండి..

MOST READ: తీవ్రంగా ఇబ్బంది పెట్టే చిగుళ్ల వాపు తగ్గించే హోం రెమిడీస్..!!MOST READ: తీవ్రంగా ఇబ్బంది పెట్టే చిగుళ్ల వాపు తగ్గించే హోం రెమిడీస్..!!

బ్లడ్ టైప్స్

బ్లడ్ టైప్స్

బ్లడ్ గ్రూప్ ఏ, బి, ఏబి, ఓ.. ఈ గ్రూప్స్ ని బట్టి మీ ఆహారం ఎంచుకోవాలి. ఇందులో పాజిటివ్ గ్రూప్ అయినా, నెగటివ్ గ్రూప్ అయినా.. ఏ గ్రూప్ కి చెందిన వాళ్లంతా ఒకే డైట్ ఫాలో అవ్వాలి.

బ్లడ్ గ్రూప్ A

బ్లడ్ గ్రూప్ A

హెల్తీ మైండ్, బాడీ కావాలంటే.. బ్లడ్ గ్రూప్ ఏ వాళ్లకు కార్బోహైడ్రేట్స్ నుంచి పోషకాలు పొందాలి. కాబట్టి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా అందడం వల్ల జీర్ణక్రియ మరింత మెరుగ్గా సాగుతుంది. దీనివల్ల మెటబాలిజం మెరుగ్గా పనిచేస్తుంది.

డైట్

డైట్

బ్లడ్ ఏ టైప్ కలిగిన వాళ్లు సోయా ప్రొటీన్స్, గ్రెయిన్స్, వెజిటబుల్స్ రోజంతా తరచుగా తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా యాపిల్, డేట్స్, బెర్రీస్, పీచెస్ వంటి ఫ్రూట్స్ ని ఎక్కువగా తీసుకోవాలి.

తీసుకోకూడని ఆహారాలు

తీసుకోకూడని ఆహారాలు

బ్లడ్ ఏ టైప్ వాళ్లు బొప్పాయి, మామిడిపళ్లు, ఆరంజ్ వంటి ఫ్రూట్స్ కి దూరంగా ఉండాలి. ఇవి వాళ్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతాయి.

MOST READ:ఉదయం తొమ్మిది గంటలలోపు ప్రతి ఒక్కరూ చేసే పొరపాట్లు..!MOST READ:ఉదయం తొమ్మిది గంటలలోపు ప్రతి ఒక్కరూ చేసే పొరపాట్లు..!

డైరీ ప్రొడక్ట్స్

డైరీ ప్రొడక్ట్స్

అలాగే ఏ బ్లడ్ గ్రూప్ వాళ్లు డైరీ ప్రొడక్ట్స్ కూడా తక్కువగా తీసుకోవాలి. వీటివల్ల శరీరంలో ఇన్సులిన్ రియాక్షన్స్ జరుగుతాయి. ఇవి క్యాన్సర్, డయాబెటిస్, కార్డియోవాస్కులర్ డిసీజ్ ల రిస్క్ తీసుకొస్తాయి.

బ్లడ్ గ్రూప్ B

బ్లడ్ గ్రూప్ B

బ్లడ్ గ్రూప్ బికి చెందినవాళ్లు గ్రూప్ ఏ, ఓ కంటే చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటారు. బి బ్లడ్ గ్రూప్ వాళ్లు అనిమల్స్ నుంచి వెజిటబుల్స్ నుంచి పోషకాలు పొందవచ్చు. అయితే బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అవడం చాలా అవసరం.

తీసుకోకూడని ఆహారాలు

తీసుకోకూడని ఆహారాలు

బ్లడ్ టైప్ బి వాళ్లు చికెన్, వీట్, కార్న్, లెంటిల్స్, టమోటాలు, వేరుశనగలు, నువ్వులను తీసుకోకూడదు. ఇవి వాళ్ల మెటబాలిక్ ప్రక్రియపై ప్రభావం చూపుతాయి. దీనివల్ల అలసట వంటి సమస్యలు ఎదురవుతాయి.

తీసుకోవాల్సిన డైట్

తీసుకోవాల్సిన డైట్

బి బ్లడ్ గ్రూప్ వాళ్లు ఎక్కువ మొత్తంలో రెడ్ మీట్, గ్రీన్ వెజిటబుల్స్, ఎగ్స్, లో ఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్ ని డైట్ లో కంపల్సరీ చేర్చుకోవాలి.

MOST READ:పరగడుపున టర్మరిక్ హాట్ వాటర్ తాగడం వల్ల పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్MOST READ:పరగడుపున టర్మరిక్ హాట్ వాటర్ తాగడం వల్ల పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

బ్లడ్ గ్రూప్ AB

బ్లడ్ గ్రూప్ AB

ఇది చాలా తక్కువగా ఉండే బ్లడ్ గ్రూప్. ఏబీ బ్లడ్ టైప్ లో ఏ వల్ల లో స్టమక్ యాసిడ్ ఉంటుంది. బి వల్ల మీట్స్ కి అలవాటు పడే తత్వం ఉంటుంది. ఈ రెండింటి వల్ల మీట్ శరీరంలో ఫ్యాట్ గా మారుతుంది. ఇది వీళ్లకు పెద్ద సమస్య.

సమస్యలు

సమస్యలు

ఏబీ బ్లడ్ గ్రూప్ వాళ్లు కెఫైన్, ఆల్కహాల్ కి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. స్మోకింగ్ చేయడం వల్ల స్టమక్ క్యాన్సర్ కి ఛాన్స్ ఉంటుంది. అలాగే వీళ్లకు డైజెస్టివ్ ట్రాక్ చాలా సున్నితంగా ఉంటుంది.

తీసుకోవాల్సిన ఆహారాలు

తీసుకోవాల్సిన ఆహారాలు

ఏబీ బ్లడ్ టైప్ వాళ్లు ప్రొటీన్స్ ఎక్కువగా తీసుకోవాలి. సాల్మన్, సార్డిన్, ట్యూనా చేపలు తీసుకోవాలి. ఎగ్స్, సీ ఫుడ్, వెజిటబుల్స్, పెరుగు వంటి ఆహారాలు ఏబీ బ్లడ్ గ్రూప్ వాళ్లకు హెల్తీ ఫుడ్. వీళ్లు రెడ్ మీట్ కూడా తీసుకోవచ్చు. కానీ చాలా తక్కువగా తీసుకోవాలి.

బ్లడ్ గ్రూప్ O

బ్లడ్ గ్రూప్ O

బ్లడ్ గ్రూప్ ఓ వాళ్లు ఎక్కువ యాసిడ్ తీసుకోగలుగుతారు. దీనివల్ల ప్రొటీన్, ఫ్యాట్ తేలికగా జీర్ణమవుతాయి. మాంసం ద్వారా పొందె కొలెస్ట్రాల్ నుంచి క్యాల్షియంను డైజెస్టివ్ ట్రాక్ గ్రహించే శక్తిని కలిగి ఉంటారు. బ్లడ్ గ్రూప్ ఓ వాళ్లకు వీట్ ప్రొడక్ట్స్, డైరీ ప్రొడక్ట్స్ ద్వారా పొందే గ్లూటెన్ వల్ల అలర్జీ వస్తుంది.

తీసుకోకూడని ఆహారాలు

తీసుకోకూడని ఆహారాలు

బ్లడ్ గ్రూప్ ఓకి చెందిన వాళ్ల ఆల్కహాల్, కెఫెనీ, డైరీ ప్రొడక్ట్స్, వీట్ ప్రొడక్ట్స్ కి దూరంగా ఉండాలి.

తీసుకోవాల్సిన ఫుడ్

తీసుకోవాల్సిన ఫుడ్

బీఫ్ మీట్, లాంబ్, టర్కీ, చికెన్ వీళ్ల డైట్ లో కంపల్సరీ చేర్చుకోవాలి. ఎగ్స్, నట్స్, సీడ్స్ తగిన మోతాదులో తీసుకోవాలి.

English summary

Food guide according to your blood type

Food guide according to your blood type. Experts recommend to eat according to your blood type in order to stay fit and healthy.
Desktop Bottom Promotion