For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్మోకింగ్ వల్ల లంగ్ క్యాన్సర్, ఇన్ఫెక్షన్ కు గురికాకుండా నికోటిన్ ను తొలగించే ఆహారాలు..!

|

సిగరెట్ తాగడం అలవాటు చేసుకోవడం ఎంత సులువో, మానేయడం అంతే కష్టం. సిగరెట్ తాగితే ఎమౌతుందో తాగే వారికి మాత్రమే తెలుసు కానీ తాగకపోతే ఏమౌతుందో మేము చెబుతున్నాము. ఒక వేళ మానేయాలనే స్పూర్తి మీలో ఉంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే..

చాలా మంది చైన్ స్మోకర్స్ కి సిగరెట్ తాగడం మానేయాలని ఉన్నా కూడా..ఇన్నాళ్లు ఉన్న అలవాటును ఇప్పుడు మానేస్తే ఉపయోగం ఏముంటుందని, వాళ్ళకి వాళ్ళు సర్ధి చెప్పుకుంటూ గడిపేస్తుంటారు.

దాదాపు సిగరెట్టు తాగేవాళ్లందరికీ తెలుసు... అది మంచి అలవాటు కాదని! మరి ఎందుకు మానలేకపోతున్నట్టు??-ఎందుకంటే సిగరెట్టు తాగకుండా ఉండలేరు కాబట్టి. మరి ఎందుకు ఉండలేరు?
ఒక్కటే కారణం. నికోటిన్‌! ఇదో పెద్ద వల. నిజానికి నికోటిన్‌ దానికి అదేగా ఏమంత చెడేం చెయ్యదు. అది చేసేదల్లా మాటిమాటికీ సిగరెట్టు తాగాలని అనిపించేలా తహతహలాడించటమే! అయితే అదొక్కటి చాలు.. జరగాల్సిన నష్టం జరిగిపోవటానికి. ఎందుకంటే మనం నికోటిన్‌ కోసం వెంపర్లాడుతూ సిగరెట్టు తాగుతుంటే... దీంతో పాటే సిగరెట్టులో ఉండే బోలెడు హానికర వ్యాధి కారకాలు.. ముఖ్యంగా క్యాన్సర్‌ కారకాలు మన ఒంట్లో చేరిపోతుంటాయి. అవి చెయ్యాల్సిన నష్టం అవి చేసేస్తుంటాయి.

అంటే.. ముందు నికోటిన్‌ వల వేస్తుంటుంది... ఆ తర్వాత క్యాన్సర్‌ కారకాలు ఒళ్లంతా కబళిస్తుంటాయి! దీనర్థమేమిటి? మనం నికోటిన్‌ తహతహ నుంచి బయటపడగలిగితే చాలు.. సిగరెట్టుకు స్వస్తి చెప్పటం తేలిక. నికోటిన్‌ గురించి మరింత సమగ్రంగా తెలుసుకోవటం ద్వారానే ఇది సాధ్యం.నికోటిన్ లంగ్స్ లో చేరితే ప్రాణానికే ప్రమాధం. నికోటిన్ లంగ్స్ లో చేరడం వల్ల లంగ్స్ ఇన్ఫెక్షన్ కు గురౌతాయి. సరైన సమయంలో గుర్తించి జాగ్రత్తలు తీసుకోకపోతే లంగ్ క్యాన్సర్ కు దారితీస్తుంది.

ఇటువంటి పరిస్థితినిక దారి తియ్యకుండా లంగ్స్ లో చేరిన నికోటిన్ ను నివారించుకోవడానికి కొన్ని నేచురల్ పదార్థాలున్నాయి. వీటిని రెగ్యులర్ గా తినడం వల్ల లంగ్ ఇన్ఫెక్షన్స్ మరియు క్యాన్సర్స్ ను నివారించుకోవచ్చు . ఇంకా ముఖ్యంగా నికోటిన్ పూర్తిగా నివారించడానికి స్మోక్ చేయడం పూర్తిగా తగ్గించుకోవాలి. నికోటిన్ నివారించుకోవడానికి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవల్సిన కొన్ని ఆహారాలు ఈ క్రింది విధంగా ...

క్యారెట్ జ్యూస్ :

క్యారెట్ జ్యూస్ :

రెండు, మూడు ఫ్రెష్ క్యారెట్స్ తీసుకుని ముక్కలుగా కట్ చేసి, మిక్సీ జార్ లో వేసి జ్యూస్ తయారుచేయాలి. క్యారెట్ జ్యూస్ లో విటమిన్స్ అధికంగా ఉండటం వల్ల లంగ్స్ నుండి నికోటిన్ ను తొలగిస్తుంది.

 కివి ఫ్రూట్స్ :

కివి ఫ్రూట్స్ :

కివి ఫ్రూట్స్ లో విటమిన్ అధికంగా ఉంటాయి. కివి ఫ్రూట్స్ తినడం వల్ల శరీరంను డిటాక్సిఫై చేస్తుంది.అలాగే లంగ్స్ లో నికోటిన్ తొలగిస్తుంది .

 వాటర్ :

వాటర్ :

నికోటిన్ లంగ్స్ ను డీహైడ్రేట్ చేస్తుంది. అందుకు ఎక్కువగా నీళ్ళు తాగాలి. అదే విధంగా లంగ్స్ కు కూడా హైడ్రేషన్ ను అందిస్తుంది. కాబట్టి, నికోటిన్ ను బయటకు పంపడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

 ఉల్లిపాయలు:

ఉల్లిపాయలు:

ఉల్లిపాయలు వంటగదిలో సూపర్ కిచెన్ ఇన్ గ్రీడియంట్ మాత్రమే కాదు, ఇందులో కొన్ని మెడిసినల్ విలువలు కూడా ఉన్నాయి. ఇవి శరీరంలో టాక్సిన్స్ ను బయటకు నెట్టివేయడానికి సహాయపడుతాయి.

పసుపు:

పసుపు:

పసుపు లో యాంటీఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలో టాక్సిన్స్ , మరియు లంగ్స్ లో నికోటిన్ తొలగించడానికి గ్రేట్ గా సహాయపడుతాయి.

అల్లం :

అల్లం :

అల్లంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఊపిరితిత్తుల్లో నికోటిన్ ను తొలగించడానికి, ఇన్ఫెక్షన్ నివారించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

ఆరెంజెస్ :

ఆరెంజెస్ :

ఆరెంజెస్ లో విటమిన్స్ అధికంగా ఉంటాయి. వీటినే క్రిప్టోక్సాంథిన్ ఎక్కువ ఇవి శరీరంలో టాక్సిన్స్ మరియు నికోటిన్ ను నివారిస్తాయి. దాంతో లంగ్స్ డిసీజ్ ను నివారిస్తాయి .

ఆపిల్స్ :

ఆపిల్స్ :

ఆపిల్స్ ఒక బెస్ట్ ఫ్రూట్ , ఇవి శ్వాస సంబంధిత సమస్యలను నివారిస్తుందిజ టాక్సిన్స్ మరియు నికోటిన్ ను లంగ్స్ నుండి బయటకు నెట్టేస్తుంది .

ఆకు కూరలు:

ఆకు కూరలు:

ఆకు కూరల్లో ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. దీంతో పాటు విటమిన్స్ కూడా ఎక్కువే.ఇది టుబాకో రుచిని మరింత బ్యాడ్ గా మర్చుతుంది. దాంతో నికోటిన్ కు అలవాటు పడకుండా ఉంటారు .

పైన్ నీడిల్ టీ :

పైన్ నీడిల్ టీ :

పైన్ నీడిల్స్ లంగ్స్ లోని నికోటిన్ తో పాటు, టాక్సిన్స్ కూడా నివారిండంలో గ్రేట్ గా సమాయపడతుుంది. దీన్ని టీ రూపంలో తీసుకోవచ్చు.

English summary

Good News For Smokers! These Natural Ingredients Help Remove Nicotine From Lungs Quickly

Good News For Smokers! These Natural Ingredients Help Remove Nicotine From Lungs Quickly
Story first published: Monday, October 10, 2016, 15:06 [IST]
Desktop Bottom Promotion