For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తరచుగా మీకు వచ్చే తలనొప్పి దేనికి సంకేతమో తెలుసా ?

By Swathi
|

చాలామంది తలనొప్పితో బాధపడుతుంటారు. కొంతమందికి రోజూ వస్తుంటుంది. మరికొందరికి వారానికి కనీసం రెండు సార్లైనా బాధపెడుతూ ఉంటుంది. అయితే తలనొప్పి ఒక్కొక్కరికి ఒక్కోలా వస్తుంది. కొంతమందికి మైగ్రేన్, మరికొందరికి టెన్షన్ వల్ల తలనొప్పి వస్తుంది. మరికొందరి సైనస్ హెడ్ ఏక్ ఉంటుంది.

ఇలా రకరకాలుగా వచ్చే తలనొప్పులు రకరకాల అనారోగ్య సమస్యలను సూచిస్తాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. తలనొప్పిని బట్టి వాళ్లకున్న అనారోగ్య సమస్యలు తెలుసుకోవచ్చని అధ్యయనాలు తేల్చాయి. కాబట్టి మీకు వచ్చే తలనొప్పిని బట్టి మీకు ఎదురయ్యే అనారోగ్య సమస్యలు తెలుసుకోండి. అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..

తక్షణ ఉపశమనానికి

తక్షణ ఉపశమనానికి

సాధారణంగా తలనొప్పి వచ్చినప్పుడు అరటిపండ్లు తినడం, ఎక్కువ నీళ్లు తాగడం వల్ల కాస్త రిలీఫ్ గా అనిపిస్తుంది. అయితే ఇది ప్రతి ఒక్కరికీ ఉపశమనం ఇస్తుందని చెప్పలేం. కానీ తగ్గే అవకాశాలున్నాయి.

ఎలాంటి తలనొప్పి ?

ఎలాంటి తలనొప్పి ?

తలనొప్పి తరచుగా వేధిస్తుంటే.. డాక్టర్ ని సంప్రదించి మీకున్న తలనొప్పి ఎలాంటిదో తెలుసుకోవాలి.

తలనొప్పికి కారణాలు

తలనొప్పికి కారణాలు

తలనొప్పికి అలసట, డీహైడ్రేషన్, ఐరన్ లోపం వల్ల వస్తుంది.

జాగ్రత్త

జాగ్రత్త

అయితే మీకు వస్తున్న తలనొప్పి దేనికి సంకేతమో తెలుసుకోవడం చాలా అవసరం. తలనొప్పి రకరకాల అనారోగ్య సమస్యలను సూచిస్తుంది. కాబట్టి తలనొప్పి వచ్చినప్పుడు ట్యాబ్లెట్స్ ఉపయోగించడం పక్కనపెట్టి.. దాన్ని న్యాచురల్ గా ఎలా తగ్గించుకోవాలో తెలుసుకోవాలి.

సైనస్ తలనొప్పి

సైనస్ తలనొప్పి

సైనస్ ఇన్ల్ఫమేషన్ కారణంగా.. సైనస్ తలనొప్పి వస్తుంది. దీనివల్ల బుగ్గలు, కళ్లు, నుదుటిపై ఎక్కువ నొప్పి ఉంటుంది. అలాగే జ్వరం వచ్చిన ఫీలింగ్ ఉంటుంది.

ఉపశమనానికి

ఉపశమనానికి

సైనస్ తలనొప్పి నుంచి ఉపశమనం పొందడానికి ఎంత వీలైతే అన్ని లిక్విడ్స్ తీసుకోవాలి. ముఖ్యంగా గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల ఇన్ల్ఫమేషన్ తగ్గుతుంది. అలాగే విటమిన్ సి ఫుడ్స్, గ్రీన్ టీ, నిమ్మ ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ సి ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లతో పోరాడతాయి.

టెన్షన్ తలనొప్పి

టెన్షన్ తలనొప్పి

టెన్షన్ తలనొప్పి వచ్చినప్పుడు.. తల వెనక భాగంలో విపరీతమైన నొప్పి ఉంటుంది. కంటి చుట్టూ నొప్పి ఉంటుంది. అలాగే వికారం, వాంతులు ఉంటాయి.

కారణం

కారణం

టెన్షన్ తలనొప్పికి ఒత్తిడి కారణమవుతుంది. నెక్ కండరాలు, స్కాల్ప్ కూడా ఈ టెన్షన్ తలనొప్పికి కారణమవుతుంది.

ఉపశమనానికి

ఉపశమనానికి

టెన్షన్ తలనొప్పి నుంచి ఉపశమనం పొందడానికి జుట్టు కుదుళ్లకు పెప్పర్ మింట్ ఆయిల్ అప్లై చేయాలి. ఇది చల్లటి అనుభూతిని ఇచ్చి రిలాక్స్ ఇస్తుంది. తల, మెడ కండరాలు ఉత్తేజమవుతాయి. అలాగే అల్లం టీ తాగినా మంచి ఫలితం ఉంటుంది.

క్లస్టర్ తలనొప్పి

క్లస్టర్ తలనొప్పి

క్లస్టర్ తలనొప్పి అనేది ఎక్కువగా మహిళల్లో కనిపిస్తుంది. అది కూడా ఒక కంటిపైన భాగంలో వస్తుంది. ఇది హఠాత్తుగా వస్తుంది. అలాగే ఉన్నట్టుండి తగ్గిపోతుంది. ఇది తలకు ఒకవైపు చాలా తీవ్ర నొప్పికి దారితీస్తుంది.

కారణం

కారణం

ఈ క్లస్టర్ తలనొప్పితో బాధపడేటప్పుడు నాజల్ కంజెషన్, ముక్కులో నుంచి నీళ్లు కారడం, కళ్లలో నీళ్లు కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఉపశమనానికి

ఉపశమనానికి

ఇలాంటి తలనొప్పితో బాధపడేవాళ్లు.. ఉపశమనం పొందడానికి క్యాప్సియాసిన్ క్రీమ్ పెట్టుకోవడం వల్ల ఉపశమనం పొందవచ్చు.

మైగ్రేన్

మైగ్రేన్

మైగ్రేన్ తలనొప్పి ఇతర తలనొప్పుల కంటే.. చాలా బాధాకరమైనది. దీనివల్ల ఇతర న్యూరలాజికల్ లక్షణాలు కనిపిస్తాయి. ఒకవేళ మీకు మైగ్రేన్ తలనొప్పి ఉంటే.. తలకు ఒకవైపు నొప్పి ఎక్కువగా ఉంటుంది. అలాగే కొంతమందికి రెండు వైపులా నొప్పి ఉంటుంది.

లక్షణాలు

లక్షణాలు

మైగ్రేన్ తలనొప్పితో బాధపడేటప్పుడు వాంతులు, అలసట, వికారం, చూపులో ఇబ్బంది, లైటింగ్ చూడలేకపోవడం, వాసన పడకపోవడం, శబ్ధాలు భరించలేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

ఉపశమనానికి

ఉపశమనానికి

మైగ్రేన్ తలనొప్పి నుంచి బయటపడటానికి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బి12, మెగ్నీషియం ఉన్న ఆహారాలను డైట్ లో చేర్చుకోవాలి. అలాగే ఏరొబిక్ ఎక్సర్ సైజ్ కూడా మైగ్రేన్ తలనొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

English summary

Headaches Revel Health Problems you Have !: Type of Headache reveals your health problems

Headaches Revel Health Problems you Have !: Type of Headache reveals your health problems. There are 4 types of headaches that occur the most and they something about your body.
Story first published:Tuesday, May 17, 2016, 10:30 [IST]
Desktop Bottom Promotion