For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెడ్ వైన్ ప్రమాదమూ.. ప్రయోజనమూ.. !!

By Swathi
|

రెడ్ వైన్.. !! దీనిపై విభిన్న అభిప్రాయాలున్నాయి. ఇది ఆరోగ్యానికి మంచిదని చాలామంది నమ్ముతారు. మరికొందరు ఆరోగ్యకరమే అయినా.. పరిమితికి మించితే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు. రోజుకి 150 ఎమ్ఎల్ కంటే.. మించకూడదని సూచిస్తున్నారు. అయితే ఈ పరిమాణం రోజూ తీసుకుంటే.. ఎలాంటి అనారోగ్య సమస్య దరిచేరదంటున్నారు.

red

రెడ్ వైన్ ను రెడ్‌, పర్పుల్‌ రంగుల్లో ఉండే ద్రాక్ష పళ్ల నుంచి తయారు చేస్తారు. ఇది కొలెస్ర్టాల్‌, రక్తపోటుని తగ్గిస్తుంది. అలాగే ఊబకాయం సమస్యతో పాటు క్యాన్సర్‌ ముప్పు కూడా ఉండదని చెబుతున్నారు. ఆల్కహాల్ బివరేజెస్ అన్నింటిలో కెల్లా ఇందులో చక్కెర స్థాయి తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

రెడ్ వైన్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల శరీరంలో పేరుకున్న కొవ్వు శాతం తగ్గుతుంది. దీనివల్ల గుండెపోటు వచ్చే ఛాన్స్ లు కూడా తక్కువే. రెడ్ వైన్ ఆరోగ్యానికే కాదు.. చర్మానికి కూడా మంచిదే. స్ర్టాబెర్రీ, రోజ్ హిప్, ద్రాక్ష, ఎసెన్షియల్ ఆయిల్స్ కలిపి రెడ్ వైన్ ముఖానికి రాసుకుని 10 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేసుకుంటే.. చర్మం కాంతివంతంగా మారుతుంది. రెడ్ వైన్ రోజూ తాగితే.. యంగ్ లుక్ మీ సొంతమవుతుంది. ముడతలు, స్ర్టెచెస్ ఉండవని సూచిస్తున్నారు.

red wine

అయితే రెడ్ వైనతో ఆడవాళ్లకు బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నాయి. కాబట్టి రెడ్‌ వైన్ తో పాటు అన్ని రకాల ఆల్కహాల్‌ డ్రింకులను పరిమితంగా తాగితేనే గుండెకు మంచిది. ఆల్కహాల్‌ ఎక్కువ తీసుకోవడం వల్ల కాలేయం జబ్బు, బహిష్టు సమస్యలు, నరాలు, కండరాలు దెబ్బతినడం, వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి పరిమితంగా ఉన్నంతవరకూ ఆరోగ్యకరం.. మించితే హానికరమే అని అధ్యయనాలు చెబుతున్నాయి.

English summary

Health Benefits and Health Risks of Red Wine

Health Benefits and Health Risks of Red Wine. Wine, especially the red variety, has been studied extensively over many years with impressive findings suggesting it may promote a longer lifespan, protect against certain cancers.
Story first published: Friday, January 22, 2016, 18:09 [IST]
Desktop Bottom Promotion