For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్టమక్ ఫ్లూ నివారణకు 10 ఎఫెక్టివ్ హోం రెమెడీస్

స్టమక్ ఫ్లూ నివారించే 10 ఎఫెక్టివ్ హోం రెమెడీస్

|

స్టమక్ ఫ్లూ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా..స్టమక్ ఫ్లూ అంటే గ్యాస్ట్రోఇంటెన్సినల్ ట్రాక్ ఇన్ఫ్లమేషన్ కు గురి అవుతుంది. గ్యాస్ట్రోఇంటెన్సినల్ ట్రాక్(ఆహారవాహిక లేదా జీర్ణవాహిక). జీర్ణవాహికకు త్వరగా వైరల్ ఇన్ఫెక్షన్ సోకుతుంది . ముఖ్యంగా స్టమక్ ఫ్లూ గురిచేస్తుంది. అందుకు ప్రధానకారణం అడినోవైరస్, ఆస్ట్రో వూరస్, క్యాల్సివైరస్, మరియు రోటో వైరస్.

Home Remedies for Stomach Flu

స్టమక్ ఫ్లూ పెద్దల్లో మరియు పిల్లల్లో వ్యాప్తి చెందే ఒక అంటువ్యాధి. స్టమక్ ఫ్లూ ఒకరి నుండి మరొకరికి చాలా త్వరగా వ్యాప్తి చెందుతుంది. స్టమక్ ఫ్లూ వైరస్ వల్లే వస్తుంది. స్టమక్ ఫ్లూ వ్యాధికి గురైనప్పుడు 48గంటల్లోపు వ్యాధిలక్షణాలు కనబడుతాయి. ఈ లక్షణాలు 2 నుండి 5 రోజుల వరకూ ఉంటాయి. కొంత మందిలో 10రోజులు కూడా ఉండవచ్చు.

స్టమక్ ఫ్లూకు గురవ్వడం ఒక బాధించే సమస్య. స్టమక్ ఫ్లూ సోకిన వరిలో సహజంగా కనిపించే లక్షణాలు, స్టమక్ అప్ సెట్, డయోరియా, వికారం, తలనొప్పి, బాడీపెయిన్, స్టమక్ క్రాంప్స్ , కొద్ది జ్వరంగా అనిపించడం, అలసట మరియు వాంతులు .

స్టమక్ ఫ్లూ వచ్చినవారిలో రెండు మూడు రోజులకు అదంతటదే తగ్గిపోతుంది. . త్వరగా నయం చేసుకోవడానికి విశ్రాంతి చాలా అవసరం. శరీరంను తేమగా ఉంచుకోవడానికి ఎక్కువగా నీరు తాగాలి . వీటితో పాటు కొన్ని హోం రెమెడీస్ గ్రేట్ గా సహాయపడుతాయి. ..

1. అల్లం:

1. అల్లం:

అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . అల్లం హైలీ ఎఫెక్టివ్ హోం రెమెడీ. స్టొమక్ ఫ్లూ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ప్లస్ అల్లం యాంటీ వైరల్ లక్షణాలు కలిగి ఉండటం వల్ల ఫ్లూకు కారణమయ్యే వివిధ రకాల వైరస్ లతో పోరాడుతుంది. రోజూ ఒక గ్లాసు జింజర్ టీ తాగడం వల్ల స్టొమక్ ఫ్లూ నుండి ఉపశమనం పొందవచ్చు.సూచన: హైబిపి ఉన్నవారు జింజర్ రెమెడీస్ నివారించాలి.

2. పెప్పర్ మింట్:

2. పెప్పర్ మింట్:

స్టొమక్ ఫ్లూ నివారించడంలో పెప్పర్ మింట్ గ్రేట్ గా సహాయపడుతుంది . పెప్పర్ మింట్ లో యాంటీస్పాస్మోడిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది గ్యాస్ మరియు బ్లోటింగ్ లక్షణాలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. స్టొమక్ మరియు ప్రేగు క్రాంప్స్ ను తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.పుదీనా ఆకులను ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించి , ఈ నీటిని వడగట్టి రోజుకొకసారి తాగడం వల్ల స్టొమక్ ఫ్లూ నుండి ఉపశమనం పొందవచ్చు.

3. దాల్చిన చెక్క:

3. దాల్చిన చెక్క:

స్టొమక్ ఫ్లూకు వ్యతిరేఖంగా పోరాడటంలో ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . ఇది ఒక పవర్ ఫుల్ యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ వైరల్ ఏజంట్ . ఇది పొట్టలో ఉండే బ్యాక్టీరియా మరియు వైరస్ ను తొలగించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . దాల్చిన చెక్క పౌడర్ ను ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించి, తర్వాత వడగట్టి, అందులో కొద్దిగా తేనె మిక్స్ చేసి రోజుకు రెండు మూడు సార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

4. చమోమెలీ టీ:

4. చమోమెలీ టీ:

మరో హెర్బల్ టీ . స్టొమక్ ఫ్లూ నివారించడంలో వండర్ ఫుల్ గా పనిచేస్తుంది . ఇది యాంటీ స్పాస్మోడిక్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది. స్టొమక్ ఫ్లూ తగ్గించుకోవడానికి ఎండిన చమోమెలీ. ఆకులను గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి. వడగట్టి ఇందులో తేనె మిక్స్ చేసి రోజుకు మూడు సార్లు తాగుతుంటే మంచి ఫలితం ఉంటుంది. డయోరియా, ఆబ్డామినల్ క్రాంపింగ్, వికారం, గ్యాస్, వంటి స్టొమక్ ఫ్లూ లక్షణాలను చమోమెలీ టీ నివారిస్తుంది.

5. ఆపిల్ సైడర్ వెనిగర్:

5. ఆపిల్ సైడర్ వెనిగర్:

స్టొమక్ ఫ్లూ నివారించుకోవడానికి మరో ఎఫెక్టివ్ హోం ట్రీట్మెంట్ ఆపిల్ సైడర్ వెనిగర్. వైరస్ కు వ్యతిరేకంగా ఇది చాలా ఎఫెక్టివ్ గా పోరాడుతుంది. మరియు ఇందులో పెక్టిన్ ఎక్కువగా ఉండటం వల్ల పొట్టను స్మూత్ గా మార్చుతుంది. ఇది పొట్టనొప్పిని, వికారం, వాంతులను, కడుపుబ్బరాన్ని నివారిస్తుంది.ఒక గ్లాసు నీరు లేదా మీకు నచ్చిన ఫ్రూట్ జ్యూస్ లో ఒకటీస్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ ను మిక్స్ చేసి భోజనానికి ముందు తాగడం వల్ల స్టొమక్ ఫ్లూ లక్షణాలు నివారించబడుతాయి.

6. నిమ్మరసం:

6. నిమ్మరసం:

నిమ్మరసంలో అసిడిక్ నేచర్ కలిగి ఉంటం వల్ల ఇది ఎక్సలెంట్ హోం రెమెడీగా పనిచేస్తుంది,. స్టొమక్ ఫ్లూ నివారిస్తుంది . ఇది స్టొమక్ ఫ్లూ కు కారణమయ్యే ప్యాథోజన్స్ ను నాశనం చేస్తుంది . నిమ్మరసంలో ఉండే విటమిన్ సి మరియు యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు వ్యాధినిరోధకశక్తిని అందివ్వడానికి సహాయపడుతుంది. ఒక గ్లాసు నీటిలో ఫ్రెష్ లెమన్ జ్యూస్ మిక్స్ చేసి భోజనానికి అరగంట ముందు తాగాలి.

7. పెరుగు:

7. పెరుగు:

పెరుగులో మంచి బ్యాక్టీరియాల ఉంటుంది. రెగ్యులర్ డైట్ లో పెరుగు చేర్చుకోవడం వల్ల స్టమక్ ఫ్లూక్ గురిచేసే హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. పెరుగులో ఉండే ప్రోబయోటిక్ లక్షణాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. స్టొమక్ ఫ్లూ ఉన్నప్పుడు పెరుగును రోజూ రెండు మూడు సార్లు తీసుకుంటే మంచిది .

8. వెల్లుల్లి:

8. వెల్లుల్లి:

మరో నేచురల్ స్టొమక్ ఫ్లూ రెమెడీ వెల్లుల్లి. యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ మైక్రోబయల్ లక్షనాలు స్టొమక్ లైనింగ్ కు ఉపశమనం కలిగిస్తుంది . క్రాంప్స్ , అజీర్తి, స్టొమక్ బ్లోటింగ్ గ్యాస్ సమస్యలను నివారిస్తుంది. తేనె తో పాటు వెల్లుల్లిని తీనడం వల్ల స్టొమక్ ఫ్లూ నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది.

9. రైస్ వాటర్ :

9. రైస్ వాటర్ :

డయోరియా మరియు స్టొమక్ ఫ్లూతో బాధపడుతుంటే రైస్ వాటర్ బెస్ట్ హోం రెమెడీ. అన్నం గంజిలో కొద్దిగా ఉప్పు వేసుకొని తాగొచ్చు లేదా కొద్దిగా తేనె మరియు దాల్చిన చెక్క పొడి మిక్స్ చేసి తాగడంవల్ల స్టొమక్ ఫ్లూ వల్ల వచ్చే ఇన్ఫ్లమేసన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది.

10. అరటిపండ్లు:

10. అరటిపండ్లు:

స్టొమక్ ఫ్లూ నివారించడంలో పచ్చివి మరియు పండిన అరిపండ్లు రెండూ మంచివే .జీర్ణవక్తిని పెంచుతుంది. పొటాసిషియం, మెగ్నీషియం ఉండటం వల్ల తక్షణ ఎనర్జీని అందిస్తుంది ఈ రెండు మినిరల్స్ శరీరానికి అవసరమయ్యే ఎలక్ట్రోలైట్స్ ను అందిస్తుంది,. జీర్ణక్రియను మెరుగుపరుచుకోవడానికి రోజుకు రెండు అరటిపండ్లు తినాలి.

English summary

Home Remedies for Stomach Flu

The stomach flu, or gastroenteritis, is a condition where the gastrointestinal tract is inflamed, usually as a result of contracting a viral infection. The four common viruses that can cause stomach flu are adenovirus, astrovirus, caliciviruses and rotavirus.
Desktop Bottom Promotion