For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దంతాల మద్య పాచి మరియు గారని తొలగించడానికి సులభమైన చిట్కాలు

By
|

మిగతా శరీర భాగాలతో పోల్చుకుంటే ఎక్కువగా నిర్లక్ష్యానికి గురయ్యే ప్రదేశం నోరు..! ఉదయం పళ్లు శుభ్రం చేయటం మినహా నోటి ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోరు చాలా మంది. దంతాల ఏర్పాటు మొదలుకుని, ఆహారపుటలవాట్ల వరకూ ఎన్నో అంశాలు ఓరల్‌ హెల్త్‌ని దెబ్బతీస్తూ ఉంటాయి. వాటిని వెంటనే గుర్తించి తగిన ట్రీట్మెంట్ తీసుకోకపోతే దీర్ఘకాలంలో తీవ్రరుగ్మతలుగా పరిణమించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

సాధారణంగా చాలా మందిలో పండ్లకు పాచి పట్టడం అనేది మనం చూస్తుంటాం. ఉదయాన్నే నిద్రలేవగానే పళ్లను పరపర తోమి పాచిని వదిలించుకోవాలని చూస్తుంటారు చాలా మంది. అయితే గార పట్టుకుపోయిన, లోపల పళ్లకు అలాగే పెంకుళ్లా అట్టకట్టుకు పోయిన పాచిని తొలగించడం కేవలం బ్రెషింగ్ వల్ల కాదు. అందుకోసం మరింత శ్రద్ద పెట్టాల్సి ఉంటుంది.

దంతాల మద్య లేదా దంతాల వెనుక దాగి ఉన్న గారను, పాచినీ తొలగించుకోవడానికి ప్రతి నెలా డెంటిస్ట్ ను కలిస్తూన్నారా...? అయినా ఫలితం లేకుండా ఉన్నదా..అయితే ఈ దంత సమస్యలను నివారించడానికి కొన్ని ఉత్తమ హోం రెమెడీస్ ఉన్నాయి. పళ్ళ మీద పాచి బాగా గారకట్టుకుపోవడం, చిగుళ్ళు వాచి ఎర్రబడడం, చిగుళ్ళ వెంబడి రక్తం కారటం మొదలైనవన్నీ చిగుళ్ళ రోగ లక్షణం. దంతాల మీద పాచి తీయించుకుంటుండాలి.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం దంతాల గురించి మంచి జాగ్రత్తలు తీసుకుంటున్నా...కూడా నోట్లో బ్యాక్టీరియా అలాగే ఉంటుంది. ఈ బ్యాక్టీరియా ప్రోటీన్స్ తో మిక్స్ అవుతుంది మరియు అలాడే ఆహారపదార్థాలకు కూడా అంటుకోవడం వల్ల దంతాల మద్యకు చేరి పాచిలా ఏర్పడుతుంది. ఇలా ఏర్పడినదాన్నే డెంటల్ ప్లాక్ అని పిలుస్తారు . ఇలా దంతాల మధ్య ఇబ్బందికరంగా ఏర్పడిన పాచీ ఎప్పటికప్పుడు క్లీన్ చసుకోకపోతే క్లీన్ చేయడం కూడా కష్టం అవుతుంది. ముఖ్యంగా దంతాల వెనుక భాగంలో టూత్ బ్రష్ తో శుభ్రం చేసినా ఫలితం ఉండదు.

డెంటిస్ట్ ను సంప్రదించకపోవడం, పాచిని తొలగించడంలో ఫెయిల్ అవ్వడం వల్ల అనేక దంత సమస్యలకు దారితీస్తుంది. నోటిలోపల ఇన్ఫ్లమేషన్ మరియు దంతక్షయానికి దారితీస్తుంది. అలాగే నోట్లో ఉండే బ్యాక్టీరియా ప్రతి సారి మనం తీసుకొనే ఆహారాలతో పాటు బ్యాక్టీరియా కూడా మిక్స్ అయ్యి పొట్టలోకి చేరుతుంది . దాంతో ఇన్ఫెక్షన్స్, మరియు ఇన్ఫ్లమేషన్ ఎదుర్కోవల్సి వస్తుంది. మరియు దంతాలు డ్యామేజ్ అవ్వడం, దంతాల ఎనామిల్ మరియు క్యావిటి సమస్యలకు దారితీస్తుంది.

కాబట్టి, ఈ సమస్యలకు గురికాకుండా ఉండాలంటే మొదట ఎప్పటికప్పుడు దంతాల మద్య ఏర్పడే పాచిని డెంటిస్ట్ అవసరం లేకుండా నేచురల్ పద్దతుల్లో తొలగిస్తుండాలి . అదెలాగో కొన్ని సింపుల్ చిట్కాలను ఈ క్రింది విధంగా...

లవంగాలు:

లవంగాలు:

కొన్ని లవంగాలను పౌడర్ చేసి, అందులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ ను దంతాలకు అప్లై చేసి, దీన్ని టూత్ బ్రష్ తో బ్రష్ చేయాలి . ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే పండ్ల మద్య ఉన్న పాచిని నేచురల్ గా తొలగించుకోవచ్చు.

స్ట్రాబెర్రీస్

స్ట్రాబెర్రీస్

స్ట్రాబెర్రీస్ బెస్ట్ నేచురల్ హోం రెమెడీ . ఇది దంతాలను నేచురల్ గా శుభ్రం చేస్తుంది. అందుకు మీరు చేయాల్సిందల్లా ఫ్రెష్ గా ఉండే స్ట్రాబెర్రీ పండ్లను తీసుకొని వాటితో దంతాలను, చిగుళ్లను రుద్దాలి . కొద్దిసేపు ఇలా మర్దన చేసిన తర్వాత గోరువెచ్చని నీటితో గార్గిలింగ్ చేసి నోటిని శుభ్రం చేసుకోవాలి.

MOST READ: కీళ్ళవాతం (గౌట్) నుంచి ఉపశమనాన్ని అందించే 10 ఎసెన్షియల్ ఆయిల్స్

దానిమ్మ:

దానిమ్మ:

దానికి ఫ్లవర్స్ ను పొడి చేసి, అందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా నీళ్ళు వేసి, పేస్ట్ లా చేసి దంతాలకు అప్లై చేసి బ్రష్ చేసుకోవాలి. ఇలా రెండు రోజులకొకసారి చేస్తుంటే మంచి ఫలితం ుంటుంది. ఇది దంతాల మద్య ఉండే పాచీని నేచురల్ గా తొలగిస్తుంది.

బేకింగ్ సోడా:

బేకింగ్ సోడా:

బేకింగ్ సోడా ఒక ఓల్డెస్ట్ కిచెన్ పదార్థం . పాచిని తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది బేకింగ్ సోడాను బ్రెష్ తో అద్ది దంతాల మీద రుద్దాలి. చాలా కొద్ది సమయంలోనే దంతాల మద్య పాచీ లేకుండా మీరు చూడగలరు.

కొత్తిమీర:

కొత్తిమీర:

క్యావిటీ సమస్యను కొత్తిమీర తగ్గిస్తుందంటే మీరు నమ్ముతారా . దంతాల వెనుక దాగున్న పాచీని నేచురల్ గా తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. కొత్తిమీర వాటర్ తో గార్గిలింగ్ చేసినా మంచి ఫలితం ఉంటుంది.

వాల్ నట్స్ :

వాల్ నట్స్ :

వాల్ నట్ పేస్ట్ చేసి, అనారోగ్యకరమైన దంతాల మీద , చిగుళ్ళ మీద అప్లై చేసి రెండు నిముషాలు బాగా రుద్దడం వల్ల దంతా మద్య ఉండే పాచిని నేచురల్ గా తొలగించుకోవచ్చు.

యాపిల్ తినాలి:

యాపిల్ తినాలి:

రోజుకు ఒక్క ఆపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదంటారు . అక్షరాల నిజం కొన్ని ఆరోగ్య సమస్యలల్లో దంత సమస్య కూడా ఒకటి. దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఆపిల్ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి . మరియు చిగుళ్లను బలోపేతం చేస్తుంది. చిగుళ్ళ నుండి రక్తం కారడం తగ్గించుకోవచ్చు.

MOST READ: డార్క్ లిప్స్ సమస్యను పరిష్కరించేందుకు తోడ్పడే లెమన్ బ్యూటీ టిప్స్

ఆరెంజ్ పీల్ :

ఆరెంజ్ పీల్ :

ఆరెంజ్ పీల్ ఎండబెట్టి, పౌడర్ గా చేసి, దానికి కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి దంతాలకు అప్లై చేసి మసాజ్ చేసి బ్రష్ చేయాలి. ఇలా చేయడం వల్ల నేచురల్ గా పాచిని తొలగించుకోవచ్చు. ఈ పద్దతిని వారంలో రెండు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

కొబ్బరినూనె

కొబ్బరినూనె

కొబ్బరినూనెలో ఉండే లారిక్‌యాసిడ్ దంతాలపైన బాక్టీరియాలు చేరడానికి దారితీసే పాచి వంటి వలయాన్ని నిర్మూలించడానికి ఉపయోగపడ్తుంది. అదేవిధంగా దంతాలు చెడు వాసన రాకుండా శుభ్రంగా ఉంచుతుంది.రోజూ ఉదయాన్నే బ్రష్ చేసుకునే ముందు కొంచెం కొబ్బరినూనెను వేలితో దంతాలను రుద్దాలి. కొబ్బరినూనెను మింగకుండా జాగ్రత్త పడాలి. తరువాత దంతాలను నీళ్ళతో శుభ్రంచేసుకుని బ్రష్ చేసుకోవాలి.

హైడ్రోజెన్ పెరాక్సైడ్

హైడ్రోజెన్ పెరాక్సైడ్

ఒక కప్పులో హైడ్రోజెన్ పెరాక్సైడ్ కొంచెం తీసుకుని, దానికి అరకప్పు వేడినీటిని కలిపి ఆ మిశ్రమాన్ని నోటిలో పోసుకుని ఒక నిమిషం పాటు పుక్కిళించాలి. ఆ తర్వాత చల్లని నీటితో పుక్కిళించాలి.

టమోటోలు:

టమోటోలు:

టమోటోల్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఇవి మౌత్ వాష్ చేసుకోవడానికి చాలా బాగా పనిచేస్తాయి. వీటిని మనం డైరెక్ట్ గా పళ్లను రుద్దేందుకు ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత బేకింగ్ సోడాతో చేసుకున్న మిశ్రమంతో వాష్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది .

బొప్పాయి

బొప్పాయి

అలాగే విటమిన్ సి లభించే బొప్పాయి, మిరియాలు, నిమ్మకాయ, నారింజ, కమలపళ్లతో కూడా మన దంతాలను శుభ్రం చేసుకోవచ్చు.

MOST READ: లోహపు పాత్రలలో తినడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసా?

జామకాయ:

జామకాయ:

జామకాయలో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కాబట్టి, రెగ్యులర్ డైట్ లో జామకాలను చేర్చుకోవడం వల్ల దంతాలు గట్టిపడటంతో పాటు, శుభ్రపడుతాయి.

అలోవెర:

అలోవెర:

అలోవెరాలో యాంటీబ్యాక్టీరియల్ లక్షనాలుంటాయి కాబట్టి, అలోవెరా జెల్ తో దంతాల మీద రుద్ది తర్వాత బ్రెష్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

వెనిగర్ :

వెనిగర్ :

వెనిగర్ దంత సంరక్షణాలో గ్రేట్ గా సమాయపడుతుంది. బేకింగ్ సోడాలో కొద్దిగా వెనిగర్ మరియు నిమ్మరసం మిక్స్ చేసి దంతాలను రుద్దుకొని, బ్రష్ చేసి చల్లటి నీటితో గార్గిలింగ్ చేసి, శుభ్రం చేసుకోవాలి.

టూత్ పిక్ :

టూత్ పిక్ :

టూత్ పిక్ తీసుకుని పండ్లకు ఎక్కడైతే పాచి బాగా పేరుకుపోయిందో అక్కడ దానిని తొలగించుకోవాలి. అలా చేసేటప్పుడు టూత్ పిక్ చిగుళ్ళకు తగలకుండా అత్యంత జాగ్రత్తపడాలి. ఇలా చేసిన మరుసటి రోజు యాంటీ సెప్టిక్ మౌత్ వాష్ తో దంతాలను శుభ్రం చేసుకునేలా వాష్ చేయాలి.

MOST READ: కొబ్బరినూనెతో కాఫీ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదేనా?

వేపపుల్ల:

వేపపుల్ల:

అప్పుడప్పుడు వేపపుల్లతో దంతాలను దుర్దడం వల్ల నోట్లో, దంతాల మద్య ఉండే బ్యాక్టీరియా తొలగిపోవడంతో పాటు, గార, పాచీ కూడా తొలగించుకోవచ్చు...

ప్లాసింగ్

ప్లాసింగ్

ఇంకా రెగ్యులర్ గా ప్లాసింగ్ , డెంటిస్ట్ ల సహాయంతో స్కేలింగ్' చేసుకోవడం ద్వారా దీర్ఘకాలికంగా పట్టిన గార పాచిల నుండి ఉపశమనం పొందవచ్చు. మిళమిళ మెరిసే దంతాలను మీ సొంతం చేసుకోవచ్చు.

English summary

How to naturally remove plaque and tartar from teeth

How to naturally remove plaque and tartar from teeth, Remove Plaque Naturally Without A Dentist,If your tired of going to the dentist every month to remove the gunk behind your teeth, here are some of the best home remedies you need to take a look at today!
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more