For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆస్తమాను అదుపులో ఉంచే జాను శీర్షాసనం...

By Super Admin
|

ఆస్తమా అనేది దీర్ఘకాలిక వ్యాధి. దీని ప్రభావం ఊపిరితిత్తులకు గాలి ప్రసరణ సజావుగా జరిపించే గాలి మార్గాల మీద ప్రతికూలంగా ఉంటుంది. గాలి మార్గాలనే ఎయిర్ వేస్ అని అంటారు.

ఆస్తమా ఎటాక్ అయినప్పుడు ఎయిర్ వేస్ అనేవి వాపు వల్ల బాగా ఉబ్బిపోతాయి. ఆస్తమా ఎటాక్ మరింత తీవ్రమయినప్పుడు ఎయిర్ వేస్ మీద పడే ప్రభావం మరింత ప్రతికూలంగా ఉంటుంది. తద్వారా మీరు కొన్నింటికి మరింత ఎలర్జీలకు గురవుతారు.

Janu Sirsasana

తద్వారా, మీకు ఊపిరి తీసుకోవడం కష్టతరమవుతుంది. శ్వాస పూర్తిగా అందుకోలేకపోతారు. అందువల్ల, గుండె పట్టేసినట్టనిపిస్తుంది. ఇంకా దగ్గు, ఊపిరి సరిగ్గా అందకపోవడంతో పాటు ఇబ్బందికరమైన శ్వాసకు గురక కూడా తోడవుతుంది. ఇవన్నీ ఆస్తమా లక్షణాలు.

అయితే, ఈ రోగలక్షణాలున్నంత మాత్రాన మీరు ఆస్తమా బారిన పడ్డట్టు అనుకోనవసరం లేదు. ఊపిరితిత్తులను పరీక్షించిన తరువాత మీ మెడికల్ హిస్టరీని పరిగణలోకి తీసుకోవడంతో పాటు మరిన్ని అలర్జీ పరీక్షలతో ఆస్తమా నిర్ధారణకు వైద్యులు వస్తారు.

పరిస్థితి తీవ్రమైనప్పుడు, ఆస్తమా ఎటాక్ కు మీరు గురవవచ్చు. అటువంటి ఎటాక్స్ అకస్మాత్తుగా వచ్చి మిమ్మల్ని అమితంగా ఇబ్బంది పెడతాయి. అవి ప్రాణాంతకమైనవి కూడా. మీరు అర్థం చేసుకుని రెస్పాండ్ అయ్యే సమయం కూడా మీకు కలగకపోవచ్చు.

ఒక వేళ, మీరు వైద్యులను సంప్రదించినా, వారు మీ జేబులకు చిల్లులు కలిగిస్తారు. ఆస్తమానూ అదుపులో ఉంచడానికి కొన్ని ఇన్హేలర్స్ ను సూచిస్తారు. అవన్నీ పక్కన పెట్టేయండి. ఈ ప్రాణాంతకమైన వ్యాధిని అదుపులో ఉంచడానికి యోగా అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది. మనసు పెట్టి చేస్తే, యోగా ఈ వ్యాధి తీవ్రతను తగ్గించి మీకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలిగించడానికి తోడ్పడుతుంది.

Janu Sirsasana

ఈ ఆసనం పేరు సంస్కృత పదాల నుంచి ఉద్భవించింది. 'జాను' అనగా మోకాలు, 'శీర్షం' అనగా తల అని అర్థం.

ఆస్తమా బారిన పడినవారికి ఈ ఆసనం చక్కటి ఉపశమనం కలిగిస్తుంది. శ్వాస తీసుకుని వదిలే ప్రక్రియలో కొన్ని మెళకువలను జోడించడం ద్వారా ఈ ఆసనం కాలేయంతో పాటు మూత్రపిండాల పనితీరుని మెరుగుపరుస్తుంది.

ఈ ఆసనం సాధనం చేసే స్టెప్స్

స్టెప్ 1: ముందుగా మీ కాళ్ళను చాపండి. మీ హిప్స్ కింద అవసరమైతే సపోర్ట్ కోసం దుప్పటిని ఉంచండి. శ్వాసను దీర్ఘంగా తీసుకోండి. మీ కుడి మోకాలును వంచుతూ మీ కుడి పాదాన్ని లోపలికి తీసుకోండి. మీ ఎడమ భాగం తొడను తాకే విధంగా కుడి అరిపాదాన్ని లోపలకు తీసుకోండి. మీ కుడిమోకాలు నేలను తాకాలి. ప్రారంభంలో, ఒకవేళ మీకు ఆసనం సాధన చేయడం కష్టంగా ఉంటే మీ మోకాళ్ళ కింద దట్టమైన దుప్పటిని అమర్చండి.

Janu Sirsasana

స్టెప్ 2: మీ ఎడమ చేతిని భూమిపై పిరుదుల పక్కగా ఉంచుతూ మీ కుడి చేతిని కుడి తొడపై ఉంచాలి. ఇప్పుడు, మీరు నిటారుగా ఉండడానికి ప్రయత్నిస్తూ, ఎడమ శ్వాసను వదలాలి. ఈ పొజిషన్ లో కొన్ని సెకండ్ల పాటు ఉండాలి.

స్టెప్ 3: ఇప్పుడు మీ చేతులను ముందుకు తీసుకువచ్చి, మీరూ ముందుకు వంగాలి. మీ హిప్స్ ను కదల్చకండి. ముందుకు వంగుతూ వెనక్కు వస్తూ ఈ ఆసనాన్ని కొనసాగించాలి. ఎటువంటి ఫోర్స్ ను ఉపయోగించకండి. శ్వాసను వదుల్తూ ముందుకు వంగినప్పుడు మీ మోచేతులను పక్కకు వంచి మళ్లీ కొంచెం పైకి తీసుకురావాలి. మీ చేతుల వెనుకభాగం అలాగే భుజాలు మరియు నడుము ఇవన్నీ ఒకే లెవల్ లో ఉండాలి.

స్టెప్ 4: ముందుకు వంగడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి. శ్వాస తీసుకుని వదలడానికి మీ ఊపిరితిత్తులకు సౌకర్యం ఉండేలా జాగ్రత్త తీసుకోండి. మొదటగా, మీ పొత్తికడుపు క్రింది భాగం మీ తొడలను తాకుతుంది. ఈ విధానం అనుసరిస్తూ మీ నడుము, తల కూడా మీ కాళ్లకు తగులుతాయి. ఈ భంగిమలో కనీసం రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఉండటానికి ప్రయత్నించండి.

స్టెప్ 5: మరో కాలితో ఇవే స్టెప్స్ ను రిపీట్ చేయండి.

Janu Sirsasana

ఈ ఆసనం సాధన చేయడం వలన కలిగే మరిన్ని లాభాలు

• మనసుకు ప్రశాంతతను కలిగించి డిప్రెషన్ ను అరికడుతుంది

• పొత్తికడుపు కింద పేర్కొని ఉన్న కొవ్వును కరిగిస్తుంది

• తైరాయిడ్ పనితీరును మెరుగుపరుస్తుంది

• లోయర్ బ్యాక్ పెయిన్ ను తగ్గిస్తుంది

• భుజాల నుంచి వెన్నెముక వరకు మీ శరీరంలోని సాగే సౌలభ్యతను పెంచుతుంది

• కాలేయం మరియు మూత్రపిండాల పనితీరును మెరుగుపరచి రక్తాన్ని శుద్ధి చేస్తుంది

• అధిక రక్తపోటును నియంత్రిస్తుంది

• సైనస్ తో పాటు నిద్రలేమిని అరికడుతుంది

• జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది

ప్రారంభంలో, మీకు ఈ ఆసనాన్ని సాధన చేయడం కొంచెం కష్టంగా అనిపించవచ్చు. అందువల్ల, తొడల పై భాగంలో పొత్తికడుపు కింద భాగంలో నొప్పి కలగవచ్చు. మొదట్లోనే ఈ ఆసన సాధన కోసం విపరీతంగా కష్టపడకండి. రాను రాను ఈ ఆసనం మీకు సులభంగా అనిపిస్తుంది.

సౌలభ్యం కోసం మీరు ఏదైనా ఎలాస్టిక్ రోప్ ను మీ రెండు పాదాలకి కట్టండి. ఆ తరువాత ఈ ఆసనాన్ని సాధన చేయండి. అయితే, ఎలాస్టిక్ మీద అధికంగా ఒత్తిడి పెట్టకుండా జాగ్రత్తపడండి. లేదంటే, మీకు గాయమయ్యే అవకాశం ఉంటుంది.

ఈ యోగాసనాన్ని ప్రశాంతంగా సాధన చేస్తూ ఆస్వాదించండి.

హెచ్చరిక:

ఈ ఆసనాన్ని గర్భిణీలు మూడవ త్రైమాసికం రాక ముందు వరకే సాధన చేయాలి.

English summary

Janu Sirsasana (Head-to-Knee Forward Bend) For Asthma

Asthma is as you all know a chronic disease that directly affects your airways. The main task of your airways is to carry the air in and out of your lungs. In case of asthma, these tubes become sore and swollen. Things become worse when asthma keeps on increasing and you start getting allergic to a few things.
Story first published:Monday, July 25, 2016, 10:28 [IST]
Desktop Bottom Promotion