For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పళ్లను స్ట్రాంగ్ గా, హెల్తీగా మార్చే సూపర్ ఫుడ్స్

ఖనిజాలు, విటమిన్లు సమృద్ధిగా దొరికే ఆహారంతో పాటు పళ్ల మీద ఆమ్లాలని తటస్థపరచి, లాలాజలం ఎక్కువగా ఊరేటట్లు చేసి, దంతసిరిని పెంచే 8 సూపర్ ఫుడ్స్ ఏంటో చూడండి..

By Lekhaka
|

దంతాలు ఆరోగ్యంగా ఉండటం పిల్లలలోనైనా, పెద్దలలో అయినా చాలా ముఖ్యం. బ్రష్షింగ్, ఫ్లాసింగ్ తదితర పద్ధతులని పాటించడం ద్వారా దంతాలు పుచ్చిపోవడం, దంతాలలో రంధ్రాలు, చిగుళ్ళ వ్యాధులని నివారించవచ్చు.

రోజూ చేసుకునే బ్రష్షింగ్ తదితరాలే కాకుండా కొన్ని పదార్ధాలని తీసుకోవడం ద్వారా కూడా ఆరోగ్యకరమైన దంతాలని పొందవచ్చు. దంతాలు ఆరోగ్యంగా ఉంటే మీ నవ్వు కూడా అందంగా ఉంటుంది.

ఖనిజాలు, విటమిన్లు సమృద్ధిగా దొరికే ఆహారంతో పాటు పళ్ల మీద ఆమ్లాలని తటస్థపరచి, లాలాజలం ఎక్కువగా ఊరేటట్లు చేసి, దంతసిరిని పెంచే 8 సూపర్ ఫుడ్స్ గురించి క్రింద ఇచ్చాము చూడండి.

1. మంచినీళ్లు:

1. మంచినీళ్లు:

మంచి నీళ్లు దంతాల ఆరోగ్యానికి చాలా ముఖ్యం. భోజనం తర్వాత నీళ్లు తాగడం ద్వారా నోటిలో మిగిలిన ఆహారం తొలగించబడి దంతాలు శుభ్రపడతాయి. నిత్యం మంచి నీళ్లు తాగుతూ ఉంటే చిగుళ్లకి తేమ అంది దంతాలు అరిగిపోవడం ఉండదు.

2.పాలు:

2.పాలు:

కాల్షియం, ఫాస్ఫరస్‌తో పాటు విటమిన్ డీ కూడా పాల ద్వారా దంతాలకి అందుతుంది. విటమిన్ డీ వల్ల శరీరంలోని కాల్షియం గ్రహించబడి ఎముకలు, దంతాలు పటిష్ఠమవుతాయి. దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతీరోజూ మామూలు పాలు లేదా సోయా పాలు తీసుకోండి.

3.చీజ్:

3.చీజ్:

ఇది దంతాలకి మరొక ముఖ్య ఆహారం. పాలలాగే ఈ పాల ఉత్పత్తిలో కూడా కాల్షియం, ఫాస్ఫరస్ ఉంటాయి. ఫాస్ఫేట్ నోటిలోని ఆమ్లాలని తటస్థపరుస్తుంది.చీజ్‌ని అనేక పదార్ధాల ద్వారా మనం తీసుకోవచ్చు. చీజ్ తినడం ద్వారా దంతాలలో రంధ్రాలని నివారించవచ్చు.

4.ఆరెంజ్:

4.ఆరెంజ్:

ఈ సిట్రస్ ఫ్రూట్ కూడా దంతాల ఆరోగ్యానికి మంచిది. ఆరెంజ్ జ్యూస్ హానికారక బాక్టీరియాని నోటిలో నుంచి తొలగిస్తుంది. కానీ ఆమ్ల గుణం ఉన్న ఈ జ్యూస్ త్రాగాకా నోరు శుభ్రపరచుకోవడం మర్చిపోవద్దు సుమా.

5.ఆపిల్:

5.ఆపిల్:

డాక్టర్ ఫలంగా పిలువబడే ఈ ఫలం నోటిలో లాలాజల శాతాన్ని పెంపొందించి దంతాలలో రంధ్రాలని నివారిస్తుంది. ఆపిల్‌లో ఉన్న విటమిన్లు, ఖనిజాలు దంతాల ఆరోగ్యానికి చాలా మంచివి.

6.నట్స్:

6.నట్స్:

విటమిన్లు, ఖనిజాలు కలిగిన నట్స్ దంతాల ఆరోగ్యానికి చాలా మంచివి. పల్లీలు, బాదాం, వాల్నట్స్, జీడిపప్పు తదితర నట్స్ లో ఉండే పీచు, థియామిన్, విటమిన్లు తదితరాలు దంతాలకి ఆరోగ్యాన్నిస్తాయి.కానీ ఈ నట్స్ నమిలేటప్పుడు జాగ్రత్త పాటించాలి. నట్స్ నమిలేటప్పుడు పళ్ళ మీద ఎక్కువ ఒత్తిడి కలుగచేస్తే పళ్లు పాడయ్యే అవకాశం ఉంది.

7.టీ:

7.టీ:

బ్లాక్ మరియూ గ్రీన్ టీలు రెండూ దంతాలకి మంచివే. వీటిలో ఉండే పాలీఫెనోల్స్ ప్లేక్ ద్వారా ఉత్పన్నమయ్యే బాక్టీరియాని తటస్థపరుస్తాయి.దీనివల్ల దంతాల మీద దాడి చేసే హానికారక ఆమ్లాలని నివారించవచ్చు. గ్రీన్ మరియూ బ్లాక్ టీలు నోటిలో ప్లేక్ ద్వారా ఉత్పన్నమయ్యే బాక్టీరియా పెరిగిపోకుండా చూడా చూస్తాయి.

8.డార్క్ చాక్లెట్:

8.డార్క్ చాక్లెట్:

డార్క్ చాక్లెట్లో ఉండే టానిన్ చిగుళ్ళ వాపుని అరికట్టడం ద్వారా దంతాలు అరిగిపోవడాన్ని నివారిస్తుంది.చాక్లెట్లో ఉండే కోకో కూడా నోటిలో ఆమ్ల ఉత్పత్తిని తగ్గిస్తుంది. డార్క్ చాక్లెట్ చిగుళ్ళకి రక్త ప్రసరణ సరిగ్గా అందేటట్లు చేస్తుంది.


English summary

Not Just Brushing And Flossing, Even Eating These 8 Superfoods Boosts Your Dental Health

Not Just Brushing And Flossing, Even Eating These 8 Superfoods Boosts Your Dental Health. Besides the regular practices like brushing and flossing, eating these 8 superfoods also improves the health of your teeth.
Story first published: Wednesday, November 23, 2016, 16:56 [IST]
Desktop Bottom Promotion