For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బుట్(పిరుదుల )మీద దురదకు వివిధ రకాల కారణాలు

By Super Admin
|

మన శరీరంలో అక్కడక్కడ దురద రావడం సహజం.ఈ దురద మరీ ఎక్కువగా మారి ఇన్‌ఫెక్షన్‌కి దారితీయనంత వరకూ ఫరవాలేదు.

మీకెప్పుడైనా మీ పిరుదుల మీద దురదగా అనిపించిందా??అయితే ఆ దురద ఏమిటో ఎందుకొస్తుందో చదివి తెలుసుకోండి.

1. మీ పిరుదుల మీద ఎర్రగా ప్యాచుల్లాగ ఉండి దురదగా ఉంటే కనుక మీకు ఫంగల్ ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లు లెక్క.పిరుదులు తేమగా ఉంటాయి కనుక అక్కడ ఫంగస్ పెరగటానికి ఆస్కారం ఉంది.ఇది తగ్గడానికి యాంటీ ఫంగల్ క్రీం వాడవచ్చు. అప్పటికీ తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించండి.

Reason Why Your Butt Itches

2.మీ పిరుదుల మీద కనుక ఎర్రగా ఉన్న పొక్కుల్లాగ ఉండి దురదగా ఉంటే హెర్పిస్ అనే చర్మ వ్యాధి ఉన్నట్లు.జెనిటల్ లేదా ఓరల్ హెర్పిస్ లక్షణాలే దీనికి కూడా ఉంటాయి.ఈ లక్షణాలుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించి యాంటీ వైరల్ ట్రీట్మెంట్ తీసుకోండి.

3.పిరుదుల మీద దురదకి ఇంకొక కారణం ఫాలిక్యులైటిస్ అనే సమస్య. ఈ సమస్య ఉన్నప్పుడు పిరుదుల మీద మొటిమల లాగ ఎర్రని పొక్కులు వస్తాయి.చర్మం మీద ఉన్న మృత కణాలూ మరియూ బాక్టీరియా పిరుదుల మీద ఉన్న హెయిర్ ఫోలికిల్స్ మార్గాన్ని అడ్డుకోవడం వల్ల ఇవి వస్తాయి.ఈ పొక్కులని బెంజాయిల్ పెరాక్సైడ్ ద్వారా నివారించవచ్చు. మెత్తగా ఉండి బాగా గాలి తగిలే నూలు వస్త్రాలని ధరిస్తే ఇచి త్వరగా తగ్గు ముఖం పడతాయి.

Reason Why Your Butt Itches

4.సోరియాసిస్ ఉన్నప్పుడు కూడా పిరుదుల మీద దురద బాగా ఉంటుంది.మీ పిరుదుల మధ్య భాగం పైన బాగా దురదగా ఉండి పొట్టు రాలుతోంటే కనుక అది సోరియాసిస్ అయ్యుండవచ్చు.దీనిని స్టెరాయిడ్స్ ద్వారా నియంత్రించాల్సి ఉంటుంది అందువల్ల చర్మ నిపుణులని తప్పకుండా సంప్రదించాలి.

5.మీ పాయువు వద్ద బాగా దురదగా ఉంటే హేమరాయిడ్స్ అయ్యే ఆస్కారం ఉంది.తీవ్రమైన మల బద్ధకం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది.దీనివల్ల చుట్టూ ఉన్న రక్త నాళ్ళాలు వాచి మంట పుడుతుంది.ఈ సమస్య నివారణకి క్రీంలు దొరుకుతాయి. ఇవి వాడినా సమస్య తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించాలి.

Reason Why Your Butt Itches

6.పిరుదుల దురదకి ఇంకో కారణం ఎగ్జీమా. ఇది ఉన్నప్పుడు పిరుదుల మీద దురద వచ్చి సన్నని పొట్టులా రాలుతూ చిన్న చిన్న పొక్కులు కూడా వ్స్తాయి.ఈ సమస్య ఉన్నప్పుడు బాగా గాలి తగిలేలా ఉండే మెత్తని నూలు వస్త్రాలు ధరించాలి.దురద వచ్చే భాగమంతా మాయిశ్చరైజర్ ఎక్కువగా రాస్తూ ఉండాలి.

English summary

Reason Why Your Butt Itches

It is normal to suffer from an itch here and there, on different parts of the body, as long as these do not turn into severe infections that cause itchiness. But have you ever felt itchiness in your butt? Read on to know more why your butt itches.
Story first published: Monday, November 7, 2016, 18:30 [IST]
Desktop Bottom Promotion