For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నోటిలో లక్షణాలు ద్వారా గుర్తించగలిగే డేంజర్ డిసీజెస్..!

By Swathi
|

వ్యాధులు మనుషులకు కామన్ గా వస్తూ ఉంటాయి. మన జీవితంలో ఏదో ఒకసారి.. ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడక తప్పదు. అది చిన్నదైనా, పెద్దదైనా వ్యాధి కావచ్చు. వందలాది వ్యాధులు మనుషులకు ఎటాక్ అవుతున్నాయి. రోజుకో కొత్త వ్యాధి గుర్తిస్తూనే ఉన్నాయి. వాటిలో కొన్ని నయమవుతాయి, మరికొన్ని.. నయం కానివి ఉన్నాయి.

కొన్ని రకాల వ్యాధులు డైలీ యాక్టివిటీస్ ని దెబ్బతీస్తాయి. చాలా రకాల వ్యాధులు నొప్పి, అసౌకర్యంతో కూడి ఉంటాయి. కొన్ని వ్యాధులు సైకాలజీని బలహీనం చేస్తాయి. భయం, ఆందోళన వల్ల వ్యాధి మరింత ముదిరిపోవడానికి కారణమవుతుంది.

చాలా సందర్భాల్లో ప్రాణాంతక వ్యాధుల లక్షణాలు ముందుగా గుర్తించడం కష్టం. చివరి దశ వరకు ఆ వ్యాధి ఉన్నట్టు తెలియని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ చాలా శ్రద్ధగా ఉండాలి. ఏ చిన్న మార్పులు కనిపించినా.. వెంటనే డాక్టర్ ని సంప్రదించడం చాలా అవసరం.

అయితే కొన్ని రకాల డేంజరస్ డిజార్డర్స్ కి సంబంధించిన లక్షణాలు.. నోట్లోనే తెలిసిపోతాయి. అంటే.. ఆ వ్యాధి లక్షణాలు మొదటగా నోటి ద్వారా బయటపడతాయి. ఈ లక్షణాలపై అవగాహన ఉంటే.. వ్యాధిని ముందుగానే గుర్తించడం సాధ్యమవుతుంది.

దీర్ఘకాలిక వ్యాధి

దీర్ఘకాలిక వ్యాధి

క్రోనిక్ డిసీజ్ అనేది ఇన్ల్ఫమేటరీ బొవెల్ డిజార్డర్ గా పేర్కొంటారు. ఈ వ్యాధి లక్షణాల్లో నోట్లో అల్సర్లు ప్రధానమైనవి. ముఖ్యంగా బుగ్గల లోపల, పెదాల కింది వైపు అల్సర్లు ఏర్పడతాయి.

డయాబెటిస్

డయాబెటిస్

చిగుళ్ల నుంచి నిరంతరాయం బ్లీడింగ్, చిగుళ్ల వాపు, నోరు ఆరిపోవడం, పళ్లు వదులవడం వంటి లక్షణాలన్నీ.. డయాబెటిస్ కి సంకేతం. కాబట్టి.. వెంటనే డయాబెటిస్ చెక్ చేయించుకోవడం మంచిది.

ఓరల్ క్యాన్సర్

ఓరల్ క్యాన్సర్

ఈ ప్రాణాంతక వ్యాధి మొదటి లక్షణాలు.. నోట్లో గాయాలు అవడం, ముఖ్యంగా నాలుక, నోటి పైభాగంలో కనిపిస్తాయి. ఇవి నొప్పి లేకుండా ఉంటాయి. దీనివల్ల వీటిని గుర్తించడం కాస్త కష్టమవుతుంది.

అనీమియా

అనీమియా

ఐరన్ లోపం వల్ల రెడ్ బ్లడ్ సెల్స్ తక్కువగా ఉన్నప్పుడు అనీమియా వస్తుంది. దీని మొదటి లక్షణాలు.. నోట్లోనే కనిపిస్తాయి. నోరు తెల్లగా మారడం, డ్రై గా మారడం వంటివి అనీమియా లక్షణాలు.

గెర్డ్

గెర్డ్

గ్యాస్ట్రోసోఫగీల్ రిఫ్లక్స్ అని పిలుస్తారు. ఇది.. జీర్ణవ్యవస్థకు సంబంధించిన వ్యాధి. ఇది పొట్టలో యాసిడ్ బ్యాలెన్స్ డిస్టర్బ్ అయినప్పుడు.. ఎక్కువ ఎసిడిటీకి కారణమవుతుంది. దీని మొదటి లక్షణాలు.. నొప్పితో కూడి అల్సర్లు నోట్లో వేధిస్తాయి.

హెచ్ఐవీ

హెచ్ఐవీ

ఇది శారీరక సంబంధం వల్ల ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ లేదని మనందరికి తెలుసు. మొదటి లక్షనాలు.. నోట్లో ఎక్కువ గాయాలు, అల్సర్లు ఏర్పడతాయి.

ఒత్తిడి

ఒత్తిడి

అత్యంత ఎక్కువ ఒత్తిడికి లోనవడం వల్ల.. నోట్లో అల్సర్లు, నోరు ఆరిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవన్నీ మెదడులో హార్మోనల్ చేంజెస్ వల్ల ఏర్పడతాయి.

English summary

Signs Of Shocking Diseases Seen In Your Mouth First!

Signs Of Shocking Diseases Seen In Your Mouth First! As humans, we are no strangers to diseases. Each one of us, at some point in our lives, suffer from ailments, be it minor or major.
Story first published: Thursday, August 25, 2016, 18:14 [IST]
Desktop Bottom Promotion