For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హాయిగా నిద్రపోవడానికి సుప్త బద్ధ కోనాసనం..!

By Swathi
|

సుప్త బద్ధ కోనాసనాన్ని రిక్లైనింగ్ బాండ్ ఏంజ్ ఫోజ్ అని పిలుస్తారు. అలాగే రిలాక్సింగ్ ఫోజు అని కూడా పిలుస్తారు. సుప్త అంటే.. కింద పడుకోవడం, బుద్ధ అంటే.. నిర్భంధంలో పెట్టు అని, కోన అంటే యాంగిల్ అని అర్థం.

మనుషుల శరీరం మిషిన్ కాదు. ఒకవేళ మనుషుల శరీరాన్ని యంత్రంలా వాడుకున్నా.. విశ్రాంతి మాత్రం ఖచ్చితంగా అవసరం అవుతుంది. ఎంత బిజీగా ఉన్నా.. ఎలా ఉన్నా కొంత సమయాన్ని విశ్రాంతికి కేటాయించాలి. ఒకవేళ మీరు యోగాని ఇష్టపడేవాళ్లు అయితే.. ఈ ఆసనాన్ని ప్రయత్నిస్తే.. చాలా రిలాక్స్ అవవచ్చు.

supta konasana

ఈ ఆసనం వేయడం వల్ల తొడలను బిగించి, పిరుదులు వదులు అయ్యేలా చేస్తుంది. చెస్ట్ ఓపెన్ అయ్యేలా చేయడంతపాటు, కాలర్ బోన్స్ వెడల్పుగా అవుతాయి. కాబట్టి ఈ ఆసనం వేయడం వల్ల చాలా రిలాక్స్ అవడంతోపాటు.. టెన్షన్ తగ్గుతుంది. హ్యాపీగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.

ఈ ఆసనం ఎలా వేయాలి ?
స్టెప్ 1
సప్త బద్ధ కోనాసనం వేయడానికి చేతులు రెండింటినీ ముందుగా వదులుగా వాల్చాలి. వెల్లకిలా పడుకుని చేతులు బెండ్ చేయాలి. చేతులను వెనకవైపుకి పెట్టుకుని.. వెన్నుభాగమంతా.. స్ట్రెయిట్ గా ఉండేలా చూడాలి. ముఖ్యంగా తల, మెడకు ఏదైనా మెత్తనిది సపోర్ట్ పెట్టుకోవడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

better sleep

స్టెప్ 2
ఇప్పుడు పైభాగంలో హిప్స్ ని గట్టిగా పట్టుకుని, లోపలి భాగంలోని హిప్స్ ని బయటకు రొటేట్ చేయాలి. ఇప్పుడు రెండు మోకాళ్లను హిప్స్ కి దూరంగా తీసుకురండి. రెండు చేతులను కరెక్ట్ గా మోకాళ్లకు సమానంగా ఉండేలా పైకి తీసుకురావాలి. భుజాలను ఫ్లోర్ పై 45 డిగ్రీల కోణంలో ఉంచాలి. అరచేతులను పైకి ఉంచాలి.

స్టెప్ 3
మోకాళ్లను పైకి లేపుతూ.. లోపలి తొడలు, మొల భాగంపై ఒత్తిడి తేవాలి. అయితే మొల భాగంలో ఎక్కువ బిగుతుగా ఉంటే.. దుష్ర్పభావం ఉంటుంది. అలాగే అవి మరింత గట్టిగా మారతాయి. బెల్లీ, లోయర్ బ్యాక్ కూడా హార్డ్ గా మారతాయి.

relaxing pose

స్టెప్ 4
ఈ భంగిమను కనీసం 60 సెకన్లు మెయింటేయిన్ చేయాలి. లేదా మీకు అనుకూలంగా ఉండేవరకు ఉండవచ్చు. 10 నిమిషాల వరకు ఉండవచ్చు. సాధారణ స్థితికి రావడానికి రెండు తొడలను దగ్గరకు చేర్చాలి. ఒకవైపు తిరిగి.. నెమ్మదిగా లేవాలి.

ఒక్కసారి ఈ ఆసనం ప్రయత్నిస్తే.. మీరు చాలా రిలాక్స్ అవుతారు. పని ఒత్తిడిని అధిగమిస్తారు. హాయిగా నిద్రపోవడమే కాకుండా.. తాజాగా నిద్రలేస్తారు.

ప్రయోజనాలు
జీర్ణక్రియ మెరుగుపడుతుంది
లోపలి తొడలు స్ట్రెచ్ అవుతాయి.
పొట్టికడుపుకి బ్లడ్ సర్క్యులేషన్ అందుతుంది
నరాల వ్యవస్థ మెరుగ్గా ఉండటంతో పాటు, ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది.

గమనిక
ఈ ఆనసం వేసేటప్పుడు తొడలకు బ్లాంకెట్ వేసుకోవాలి. మోకాలి గాయాలు, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్లు ఈ ఆసనం వేయకూడదు.

English summary

Supta Baddha Konasana Or Reclining Bound Angle Pose For Better Sleep

Supta Baddha Konasana Or Reclining Bound Angle Pose For Better Sleep. You get so beautifully relaxed if you perform this asana in a tension-free mind.
Story first published: Thursday, June 9, 2016, 15:31 [IST]
Desktop Bottom Promotion