For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ గుండె ఆరోగ్యంగా లేదని తెలిపే ఆశ్చర్యకర లక్షణాలు..!!

By Swathi
|

చాలా సందర్భాలు కొన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. అవి.. చాలా అసౌకర్యంగా ఉంటాయి. మనుషులుగా మనం అన్ని రకాల అనారోగ్య సమస్యలను ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. అయితే.. ఒక్కొక్కరిలో ఒక్కో విధమైన అనారోగ్య సమస్యలు వస్తుంటాయి.

మన శరీరం కొన్ని సందర్భాల్లో కొన్ని వార్నింగ్ సంకేతాలను బయటపెడుతుంది. అవి.. కొన్ని అనారోగ్య సమస్యలు, వ్యాధులకు సంకేతం. అయితే అన్ని వ్యాధులకు ముందుగా సంకేతాలు కనిపించవు. కొన్ని వ్యాధులు సమస్య చేయిదాటిపోయిన తర్వాత లక్షణాలను బయటపెడతాయి.

క్యాన్సర్ అలాంటిదే. మొదటిదశలో ఉన్నప్పుడు క్యాన్సర్ ని గుర్తించడం చాలా కష్టం. ఇప్పుడు.. మన శరీరంలో ముఖ్యమైన అవయవం అయిన.. గుండె గురించి తెలుసుకుందాం. గుండె ఆరోగ్యంగా లేదని తెలిపే కొన్ని లక్షణాలు ఇప్పుడు చూద్దాం. వీటిని తెలుసుకోవడం వల్ల ముందుజాగ్రత్త పడటం తేలికవుతుంది.

చెస్ట్ లో పట్టేసినట్టు

చెస్ట్ లో పట్టేసినట్టు

చాలా తరచుగా.. చెస్ట్ లో బాగా పట్టేసిన ఫీలింగ్ కలుగుతోంది అంటే.. అది ఎసిడిటీ లేదా అలసట వల్ల అయి ఉంటుందని చాలామంది భావిస్తారు. కానీ.. ఒకసారి గుండె టెస్ట్ చేయించుకోవడం మంచిది.

శ్వాసలో సమస్యలు

శ్వాసలో సమస్యలు

మీ శ్వాసలో మార్పులు గమనించడం, శ్వాస సరిగా అందకపోవడం, చిన్న పనులు చేసినా.. శ్వాసకు ఇబ్బందిగా మారడం వంటి లక్షణాలు.. గుండె ఆరోగ్యంగా లేదని తెలుపుతాయి.

వికారం

వికారం

ఒకవేళ మీరు.. చాలా సమయం.. వికారంగా ఫీలవుతుండటం, వాంతులు రాకుండా.. వచ్చినట్టు ఫీలవుతుండటం వంటి లక్షణాలు.. మీ హార్ట్ అన్ హెల్తీగా ఉందని సూచిస్తాయి.

చెమట

చెమట

ఒకవేళ మీ గుండె అనారోగ్యంగా ఉండి.. రక్తాన్ని శుద్ధి చేయడానికి ఎక్కువగా కష్టపడుతోంది అంటే.. మీరు అధిక చెమట, హాట్ ఫ్లాషెస్ తో తరచుగా ఇబ్బంది పడుతున్నారంటే.. మీ హార్ట్ హెల్తీగా లేదని సంకేతం.

మైకం

మైకం

గుండె అధిక ఒత్తిడికి లోనవుతున్నప్పుడు.. రక్త ప్రసరణ బ్రెయిన్ కి అందడం కష్టంగా మారుతుంది. దీనివల్ల తలతిరిగినట్టు, మైకంగా అనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు తరచుగా కనిపిస్తున్నాయంటే.. ఒకసారి డాక్టర్ ని సంప్రదించడం మంచిది.

స్టమక్ అప్ సెట్

స్టమక్ అప్ సెట్

మీరు చాలా ఎక్కువగా స్టమక్ అప్ సెట్ కి గురవుతున్నారంటే.. దీనికి అన్ హెల్తీ హార్ట్ కారణం అయి ఉండవచ్చు. కాబట్టి.. ఒకసారి.. డాక్టర్ ని సంప్రదించి టెస్ట్ చేయించుకోవడం మంచిది.

అలసట

అలసట

అలసట అనేది.. చాలా రకాల సమస్యలు, చాలా రకాల పరిస్థితుల కారణంగా వస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని చాలావరకు ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యం చేస్తారు. అయితే.. చాలా ఎక్కువ అలసటకు లోనవుతున్నారంటే.. అన్ హెల్తీ హార్ట్ కి సంకేతం కావచ్చు. కాబట్టి.. దీన్ని నిర్లక్ష్యం చేయకండి.

English summary

Surprising Signs That Indicate Your Heart Is Not Healthy Enough!

Surprising Signs That Indicate Your Heart Is Not Healthy Enough! Many a times, in the course of our lives, all of us experience disorders that may bring us great discomfort.
Story first published: Saturday, August 20, 2016, 10:28 [IST]
Desktop Bottom Promotion