For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కిడ్నీలు శాశ్వతంగా డ్యామేజ్ అవడానికి కారణమయ్యే అలవాట్లు..!!

By Staff
|

మన శరీరంలోని వ్యర్థాలను, హానికర మలినాలను బయటకు పంపడానికి పనిచేసే అవయవం కిడ్నీలు. వ్యర్థాలను బయటకు పంపడం ద్వారా మనం హెల్తీగా ఉంటాం. మీరు మద్యం సేవించేవాళ్లు లేదా స్మోక్ చేసే వాళ్లు మాత్రమే కావాల్సిన అవసరం లేదు.. కిడ్నీలు డ్యామేజ్ అవడానికి ఇలాంటి అలవాట్లు లేకపోయినా.. మరికొన్ని హ్యాబిట్స్ కారణమవుతాయి

kidney damage

స్మోకింగ్ నుంచి యూరిన్ పాస్ చేయకుండా ఆపడం వరకు.. చాలా అలవాట్లు.. కిడ్నీలు ముందుగానే డ్యామేజ్ అవడానికి కారణమవుతాయి. ఎలాంటి పొరపాట్లు, అలవాట్ల వల్ల.. కిడ్నీలు.. శాశ్వతంగా డ్యామేజ్ అవుతాయో తెలుసుకుందాం..

ఎక్కువ సాల్ట్

ఎక్కువ సాల్ట్

ఒకవేళ మీకు చాలా ఎక్కువ ఉప్పు తినే అలవాటు ఉంటే.. ఇప్పుడే మానేయండి. ఉప్పులో ఉండే సోడియం.. బ్లడ్ ప్రెజర్ ని పెంచి.. కిడ్నీలపై దుప్ప్రభావం చూపుతుంది.

MOST READ:పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయడం వెనక సైంటిఫిక్ రీజన్స్ ఏంటి ?MOST READ:పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయడం వెనక సైంటిఫిక్ రీజన్స్ ఏంటి ?

యూరిన్ కి వెళ్లకుండా ఆపుకోవడం

యూరిన్ కి వెళ్లకుండా ఆపుకోవడం

యూరిన్ కి వెళ్లాల్సి ఉన్నా కూడా.. కొంతమంది మళ్లీ వెళ్దాం అనుకుంటూ.. అలాగే ఉండిపోతారు. కానీ.. ఇలా చేయడం వల్ల.. బ్లాడర్ ఫుల్ అయిపోయి.. యూరిన్ రిఫ్లక్స్ కి కారణమవుతుంది. అలాగే యూరిన్ మళ్లీ.. కిడ్నీల్లోకి వెళ్లిపోవడం వల్ల.. కిడ్నీ ఇన్ఫెక్షన్ సమస్య వస్తుంది.

MOST READ:రత్నాలు ధరిస్తే.. మనుషుల తలరాత మారుతుందా ?MOST READ:రత్నాలు ధరిస్తే.. మనుషుల తలరాత మారుతుందా ?

ఎక్కువ మెడిసిన్స్

ఎక్కువ మెడిసిన్స్

చాలా ఎక్కువ మెడిసిన్స్ తీసుకునే అలవాటు ఉంటే.. వెంటనే మానేయండి. యాంటీ బయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల.. చిన్న చిన్న సమస్యలు తీసుకొస్తాయి. ఈ మందులు కిడ్నీలపై కూడా దుష్ర్పభావం చూపుతాయి.

సిగరెట్స్, టొబాకో

సిగరెట్స్, టొబాకో

సిగరెట్స్ తాగడం, ఎక్కువ పొగాకు నమలడం వల్ల.. శరీరంలో క్రిములు ఏర్పడటానికి కారణమవుతాయి. దీనివల్ల కిడ్నీలు శాశ్వతంగా డ్యామేజ్ అవుతాయి. అలాగే స్మోకింగ్, పొగాకు వంటివి.. బ్లడ్ ప్రెజర్ పై కూడా దుష్ర్పభావం చూపుతాయి.

 మాంసం ఎక్కువగా

మాంసం ఎక్కువగా

మాంసాహారంలో ఎక్కువ ప్రొటీన్ ఉంటుంది. కాబట్టి పరిమితి మించి.. ఎక్కువ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల.. కిడ్నీలపై మెటబాలిజం ఒత్తిడి పెరిగి.. కిడ్నీ స్టోన్స్ ఏర్పడతాయి.

MOST READ:18 నెలల్లో 108 కేజీలు.. !! అనంత్ అంబానీ స్టన్నింగ్ వెయిట్ లాస్ స్టోరీ.. !MOST READ:18 నెలల్లో 108 కేజీలు.. !! అనంత్ అంబానీ స్టన్నింగ్ వెయిట్ లాస్ స్టోరీ.. !

సరిగా నిద్రపోకపోవడం

సరిగా నిద్రపోకపోవడం

సరిపడా నిద్రపోకపోయినా.. కిడ్నీలు డ్యామేజ్ అవడానికి కారణమవుతాయి. ఇది బ్లడ్ ప్రెజర్ కూడా పెరగడానికి కారణమై.. గుండె వ్యాధులు వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది.

ఇన్ల్ఫెక్షన్స్

ఇన్ల్ఫెక్షన్స్

జలుబు, దగ్గు, టాన్సిల్స్ వంటి ఇన్ఫెక్షన్స్ ని నిర్లక్ష్యం చేస్తే.. వాటి ద్వారా ఉత్పత్తి అయ్యే బ్యాక్టీరియా.. కిడ్నీల్లో వాపు రావడానికి కారణమవుతాయి.

కూల్ డ్రింక్స్

కూల్ డ్రింక్స్

జపాన్ అధ్యయనాల ప్రకారం కూల్ డ్రింక్స్ లో ఆర్థోఫోస్ఫోరిక్ యాసిడ్ ఉంటుంది. ఇది.. కిడ్నీలను డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి.. అప్పుడప్పుడు కూల్ డ్రింక్స్ తీసుకోవచ్చు కానీ.. చాలా ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు.

ఎక్కువగా లేదా తక్కువగా నీళ్లు తాగడం

ఎక్కువగా లేదా తక్కువగా నీళ్లు తాగడం

శరీరంలో నుంచి మలినాలను బయటకు పంపడానికి నీళ్లు సహాయపడతాయి. అయితే తక్కువ నీళ్లు తాగితే.. శరీరంలో మలినాలు అలాగే పేరుకుపోయి.. కిడ్నీ పనితీరుపై దుష్ర్పభావం చూపుతుంది. మరీ ఎక్కువగా నీళ్లు తాగితే.. కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది.

MOST READ:రత్నాలు ధరిస్తే.. మనుషుల తలరాత మారుతుందా ?MOST READ:రత్నాలు ధరిస్తే.. మనుషుల తలరాత మారుతుందా ?

ఎక్కువగా తినడం

ఎక్కువగా తినడం

ఎక్కువగా తినడం వల్ల.. బరువు పెరగడానికి, కిడ్నీ డ్యామేజ్ అవడానికి ఎక్కువ అవకాశాలుంటాయి. ఎక్కువ ఆహారం తీసుకుంటే.. కిడ్నీలు సాధారణంగా కంటే.. ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది.

English summary

Ten Common Habits Can Damage Your Kidneys Permanently

Ten Common Habits Can Damage Your Kidneys Permanently. Here is a list of common mistakes that you might be making unintentionally that can cause kidney damage to your body.
Desktop Bottom Promotion