For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శరీరంలోని మలినాలను తేలికగా బయటకు పంపే.. బెడ్ టైమ్ డ్రింక్స్..!

By Swathi
|

శరీరంలోని మలినాలన్నింటినీ.. మలం రూపంలో బయటకు పంపే ప్రక్రియను కాలేయం నిర్వహిస్తుంది. ఇలా చెడు మలినాలు బయటకుపోవడం వల్ల మీ ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. ఈ ప్రక్రియ అంతా.. మనం నిద్రపోతున్న సమయంలో జరుగుతుంది.

ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ ప్రక్రియ తెల్లవారుజామున 1 నుంచి 3 గంటల మధ్యలో జరుగుతుంది. కాబట్టి.. రాత్రిపడుకోవడానికి ముందు.. ఆరోగ్యకరమైన, కాలేయ పనితీరుని మెరుగుపరిచే ఆహారాలు తీసుకోవడం చాలా అవసరం. అలాంటి ఫుడ్స్ వల్ల .. శరీరాన్ని క్లెన్స్ చేయడంలో కాలేయానికి న్యాచురల్ గా శక్తి అందుతుంది.

కిడ్నీలు, కాలేయం పనితీరుకి సహాయపడే.. హెల్తీ ఫుడ్స్, డ్రింక్స్ ని రాత్రిపూట నిద్రకు ముందు తీసుకోవడం చాలా అవసరం. శరీరంలోని వ్యర్థ పదార్థాలను తేలికగా బయటకు పంపాలంటే.. కాలేయం పనితీరుని మెరుగుపరిచే ఆహారాలు తీసుకోవాలి. మరి అలాంటి నైట్ టైమ్ డ్రింక్స్ ఇప్పుడు మీ కోసం..

నిమ్మ

నిమ్మ

రాత్రి నిద్రపోవడానికి ముందు లేదా.. ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత నిమ్మరసం తాగడం వల్ల.. చాలా సహాయపడుతుంది. నిమ్మలో బయోఫ్లేవనాయిడ్ గుణాలుంటాయి. కాబట్టి నిమ్మకాయను తొక్కతో పాటు కట్ చేసి.. ఒక కప్పు వేడి నీటిలో కలిపి, టీ స్పూన్ తేనె కలుపుకుని తాగితే.. లివర్ డెటాక్సిఫికేషన్ కి సహాయపడుతుంది.

చమోమిలే టీ

చమోమిలే టీ

శరీరంలో పేరుకున్న మలినాలను బయటకు పంపే ప్రక్రియను వేగవంతం చేయడానికి చమోమిలే టీ ఉపయోగపడుతుంది. ఈ టీని రాత్రిపూట నిద్రకు ముందు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

రేగుపళ్లు

రేగుపళ్లు

రకరకాల అనారోగ్య సమస్యలు నివారించడానికి రేగుపళ్లను దాదాపు 10 వేల ఏళ్ల క్రితం నుంచే ఉపయోగిస్తున్నారు. వీటిలో ఉన్న ఔషధ గుణాలే ఇందుకు కారణం. ఇందులో ఐరన్, ఫాస్పరస్ ఉంటాయి. ఇవి.. రెడ్ బ్లడ్ సెల్స్ ని పెంచుతాయి, బ్లడ్ ఫ్లోని మెరుగుపరుస్తాయి, ఇన్సోమ్నియా, అనీమియాను తగ్గిస్తాయి. కాబట్టి.. ఈ ఫ్రూట్స్ ని రాత్రిపూట తీసుకుంటే.. లివర్ డెటాక్స్ కి సహాయపడుతాయి.

పుదీనా

పుదీనా

జీర్ణసంబంధ సమస్యలతో పోరాడటానికి పుదీనా ఎఫెక్టివ్ గా పోరాడుతుంది. లివర్, గాల్ బ్లాడర్ కి సంబంధించిన సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి రాత్రి పడుకోవడానికి ముందు పుదీనా టీ తాగితే.. లివర్ డెటాక్సిఫికేషన్ కి సహాయపడుతుంది.

ఓట్ మీల్ వాటర్

ఓట్ మీల్ వాటర్

ఓట్ మీల్ వాటర్ తాగడం వల్ల.. అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. బరువు తగ్గడానికి, కొలెస్ట్రాల్ తగ్గించడానికి, బోవెల్ మూమెంట్స్ రెగ్యులేట్ చేయడానికి, ఆందోళన తగ్గించడానికి, శరీరంలోని మలినాలను బయటకు పంపడానికి సహాయపడతాయి. కాబట్టి రాత్రి నిద్రకు ముందు ఓట్ మీల్ వాటర్ తీసుకోండి.

లోటస్ సీడ్

లోటస్ సీడ్

పురాతన కాలం నుంచి.. లోటస్ సీడ్ ని.. చైనీస్ మెడిసిన్స్ లో ఉపయోగిస్తున్నారు. దగ్గు, శరీరంలో మలినాలను తొలగించడంలో.. ఇవి చాలా పవర్ ఫుల్ గా పనిచేస్తాయి. లావెండర్ తో కలిపి తీసుకుంటే.. ఆందోళనను కూడా తగ్గిస్తుంది. కాబట్టి రాత్రిపూట దీన్ని డైట్ లో చేర్చుకోవడం మంచిది.

English summary

The 6 Most Effective Night time Drinks For Quick Liver Detoxing

The 6 Most Effective Nighttime Drinks For Quick Liver Detoxing. It is very important to take liver-boosting foods before bed to improve its naturally ability to cleanse your body.
Story first published:Monday, July 11, 2016, 15:40 [IST]
Desktop Bottom Promotion