For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాడీ పెయిన్ త‌గ్గించ‌డానికి పెయిన్ కిల్ల‌ర్స్ కంటే.. న్యాచుర‌ల్ ఇంగ్రిడియంట్స్..!!

By Swathi
|

ఏదైనా ఫంక్ష‌న్‌కో, పార్టీకో వెళ్లాల‌ని ప్లాన్ చేసుకుని ఉంటారు. కానీ.. స‌డెన్‌గా బ్యాక్ పెయిన్ వ‌చ్చి ఉంటుంది. ఇక చేసేదేం లేక‌.. వెంట‌నే పెయిన్ కిల్ల‌ర్స్ వేసుకుని.. వెంట‌నే పెయిన్ నుంచి రిలాక్స్ అవ్వాల‌ని భావిస్తారు. అయితే కాసేపు రిలీఫ్‌ని ఇచ్చినా.. మ‌ళ్లీ బ్యాక్ పెయిన్‌తో బాధ‌ప‌డాల్సి వ‌స్తుంది.

బాడీ పెయిన్, బ్యాక్ పెయిన్ చాలా మందిని ఇబ్బందిపెడుతుంది. ఈ ప‌రిస్థితి ఉన్న‌ప్పుడు దాన్ని ఎదుర్కోవ‌డం చాలా క‌ష్టం. డైలీ యాక్టివిటీస్ పై కూడా చాలా ఇబ్బందిపెడుతుంది. అలాగే బాడీ పెయిన్‌ని వెంట‌నే, క‌రెక్ట్ టైంలో ట్రీట్ చేయ‌క‌పోతే.. చాలా కాంప్లికేటెడ్‌గా మారుతుంది.

బాడీ పెయిన్‌కి చాలా కార‌ణాలుంటాయి. గాయాలు, ఇన్ఫెక్ష‌న్స్, ఒబేసిటీ, స‌ర్జరీల‌, కొన్ని అనారోగ్య స‌మ‌స్య‌లు బాడీ పెయిన్, బ్యాక్ పెయిన్‌కి కార‌ణ‌మ‌వుతాయి. ప్ర‌తిసారీ పెయిన్ కిల్ల‌ర్స్ వేసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలోని కొన్ని భాగాల‌పై దుష్ర్ప‌భావం చూపుతుంది. హాని చేస్తాయి.

కాబ‌ట్టి న్యాచుర‌ల్ ఇంగ్రిడియంట్స్ ఉప‌యోగించ‌డం వ‌ల్ల కూడా బ్యాక్, బాడీ పెయిన్స్ త‌గ్గించుకోవ‌చ్చు. వీటిని డైలీ డైట్‌లో చేర్చుకుంటే చాలు.. వెంట‌నే.. ఎఫెక్టివ్ ఫ‌లితాలు పొంద‌వ‌చ్చు.

బాదాం

బాదాం

బాదాంలో అత్యంత ఎక్కువ పోష‌కాలు ఉంటాయి. అలాగే యాంటీ ఇన్ఫ్ల‌మేట‌రీ గుణాలు ఉంటాయి. ఇవి.. కండ‌రాల్లో వాపుని త‌గ్గించి.. బాడీ పెయిన్ నుంచి రిలీఫ్ ఇస్తాయి.

స్వీట్ పొటాటోస్

స్వీట్ పొటాటోస్

స్వీట్ పొటాటోస్‌ని చిల‌క‌డ‌దుంప‌లు అంటారు. ఇందులో బీటా కెరోటిన్, విట‌మిన్ ఏ, యాంటీ ఇన్ల్ఫ‌మేట‌రీ గుణాలు ఉంటాయి. ఇవి.. బాడీ పెయిన్ త‌గ్గించ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి.

నిమ్మ‌ర‌సం

నిమ్మ‌ర‌సం

ఒక క‌ప్పు నిమ్మ‌ర‌సం బాడీ పెయిన్ త‌గ్గించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. నిమ్మ‌లో విట‌మిన్ సి, శ‌రీరంలో ఇన్ల్ఫ‌మేష‌న్ త‌గ్గిస్తుంది. దీపివ‌ల్ల ఎఫెక్టివ్ ఫ‌లితాలు పొంద‌వచ్చు.

స్పినాచ్

స్పినాచ్

స్పినాచ్ బ్ల‌డ్ కి ఆక్సిజ‌న్ స‌ప్లైని పెంచుతుంది. దీనివ‌ల్ల శ‌రీరంలోని వివిధ భాగాల‌కు బ్ల‌డ్ ఫ్లో మెరుగ్గా జ‌రుగుతుంది. దీనివ‌ల్ల పెయిన్ న్యాచుర‌ల్‌గా త‌గ్గుతుంది.

ఆనియ‌న్స్

ఆనియ‌న్స్

ప‌చ్చి ఆనియ‌న్స్, ఆనియ‌న్ జ్యూస్ బాడీ పెయిన్ త‌గ్గించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. ఆనియ‌న్స్‌లో యాంటీ ఇన్ల్ఫ‌మేట‌రీ గుణాలు ఉండ‌టం వ‌ల్ల పెయిన్ రిలీఫ్ ఇస్తుంది.

బ్లూబెర్రీస్

బ్లూబెర్రీస్

చాలామంది అథ్లెట్స్ బ్లూబెర్రీస్ ని రెగ్యుల‌ర్ గా తీసుకుంటారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్క‌లంగా ఉండ‌టం వ‌ల్ల బాడీపెయిన్ ని, ఇన్ఫ్ల‌మేస‌న్ ని త‌గ్గిస్తుంది.

వెల్లుల్లి

వెల్లుల్లి

యాంటీ ఇన్ల్ఫ‌మేట‌రీ గుణాలు ఉండ‌టం వ‌ల్ల ఉల్లిపాయ‌, వెల్లుల్లి వ‌ల్ల బాడీ పెయిన్ న్యాచుర‌ల్‌గా త‌గ్గిస్తుంది. వెల్లుల్లిలో కూడా ఇన్ఫెక్ష‌న్ల‌తో పోరాడే బాడీ పెయిన్ ని తగ్గిస్తుంది.

English summary

These Natural Ingredients Work Better Than Painkillers To Reduce Body Pain!

These Natural Ingredients Work Better Than Painkillers To Reduce Body Pain! Imagine a situation in which you have promised your friends that you will party with them this weekend, but come Saturday, you suddenly start to experience back pain!
Story first published:Saturday, July 30, 2016, 12:12 [IST]
Desktop Bottom Promotion