For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎసిడిటీ సమస్యా ? ఐతే ఈ సీక్రెట్ రెమెడీ ఫాలో అయిపోండి..!

అజీర్ణానికి ప్రధాన లక్షణాలు బ్లోటింగ్, పొట్టనొప్పి, గ్యాస్, త్రేన్పులు, పొట్ట పెరగడం, వికారం, వాంతులు. కాబట్టి.. మీరు న్యాచురల్ గా ఈ అజీర్ణం సమస్యలు నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీ.

By Swathi
|

అజర్ణం అనేది.. కొన్ని సందర్భాల్లో చాలా అసౌకర్యంగా, బాధతోకూడినదిగా ఉంటుంది. కాబట్టి.. మీరు ఇన్ డైజెషన్ సమస్యతో బాధపడుతుంటే.. న్యాచురల్ గా ఈ సమస్య నుంచి బయటపడే ఎఫెక్టివ్ హోం రెమెడీ అందుబాటులో ఉంది..

indigestion

ఏదైనా ఫంక్షన్ లేదా పెళ్లిళ్లకు వెళ్లినప్పుడు చాలా ఎక్కువ తినేస్తుంటారు. దీనివల్ల మరుసటి రోజు ఉదయం.. బ్లోటెడ్ టమ్మీ, పొట్ట నొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇవన్నీ అజీర్ణాన్ని సూచించే లక్షణాలు. చాలా అసౌకర్యానికి గురిచేస్తాయి.

ఇన్ డైజెషన్ సమస్య ఉన్నప్పుడు.. పొట్టలో నొప్పి, అసౌకర్యాన్ని ఫేస్ చేస్తారు. అజీర్ణానికి రకరకాల కారణాలుంటాయి. అన్ హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్, ఒబేసిటీ, ఎసిడిటీ, అల్సర్స్, కాన్ట్సిపేషన్, మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్.. కారణం.

indigestion remedy

అజీర్ణానికి ప్రధాన లక్షణాలు బ్లోటింగ్, పొట్టనొప్పి, గ్యాస్, త్రేన్పులు, పొట్ట పెరగడం, వికారం, వాంతులు. కాబట్టి.. మీరు న్యాచురల్ గా ఈ అజీర్ణం సమస్యలు నివారించుకోవాలి అనుకుంటే.. ఎఫెక్టివ్ హోం రెమెడీని మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అదేంటో చూద్దాం..

ginger

కావాల్సిన పదార్థాలు
బేకింగ్ సోడా 1 టేబుల్ స్పూన్
నిమ్మరసం 2 టీస్పూన్లు
అల్లం రసం 2 టీస్పూన్లు

lemon juice

తయారు చేసే విధానం
పైన వివరించిన పదార్థాలన్నింటినీ ఒక కప్పులో కలపాలి. కొద్దిగా నీటిని అందులో కలపాలి. అన్నింటినీ.. బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని.. రోజుకి రెండుసార్లు.. భోజనం తర్వాత తీసుకుంటే.. అజీర్ణం సమస్య నుంచి బయటపడవచ్చు. ఎప్పుడైతే.. మీరు ఇన్ డైజెషన్ సమస్యతో బాధపడతారో అప్పుడు ఈ డ్రింక్ తాగితే.. ఎఫెక్టివ్ ఫలితాలు పొందవచ్చు.

ఈ డ్రింక్ తాగుతూ.. స్పైసీ, ఆయిలీ ఫుడ్ కి దూరంగా ఉండాలి. హెల్తీ ఫుడ్ ని డైట్ లో చేర్చుకోవాలి. ఈ రెమెడీలో ఉపయోగించిన మూడు పదార్థాల్లోనూ ఎసిడిటీ తగ్గించే సత్తా ఉంటుంది. పొట్టలో ఎసిడిటీ తగ్గితే.. ఎఫెక్టివ్ గా అజీర్ణం సమస్య నుంచి బయటపడవచ్చు.

English summary

This Secret Home Remedy For Indigestion Can Work Wonders!

This Secret Home Remedy For Indigestion Can Work Wonders! Suffering from indigestion? Worry not! Here is an amazing home remedy that can help treat indigestion. Learn how to make and use it below.
Story first published: Tuesday, November 15, 2016, 16:48 [IST]
Desktop Bottom Promotion