For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పొట్ట ఉబ్బరం, గ్యాస్, హార్ట్ బర్న్ కు బెస్ట్ సొల్యూషన్ : నేచురల్ రెమెడీస్!

By Super Admin
|

సహజంగా కారంగా...రుచికరంగా ఉండే ఆహారాలను తినడమంటే మనందరీకి చాలా ఇష్టం.కొన్ని సందర్భాల్లో రుచి టెప్ట్ చేస్తుంటే మరికాస్త ఎక్కువగా తింటుంటే స్టొమక్ పెయిన్ మరియు కడుపుబ్బరంకు దారితీస్తుంది. దాంతో తినడం ఆపుతామా? అవసరం లేదు. ఇష్టమైనప్పుడు, కడుపు నిండా తిన్నా..అరిగించుకోవడానికి బెస్ట్ హోం రెమెడీస్ ఉన్నాయి . ఈ హోం రెమెడీస్ పొట్ట ఉబ్బరం, గ్యాస్, హార్ట్ బర్న్ వంటి సమస్యలను నివారిస్తుంది.

ఎక్కువగా తిన్నప్పుడు, జీర్ణం కానప్పుడుయాంటాసిడ్స్ తీసుకోవడం వల్ల కడుపుబ్బరం మరియు అజీర్తి సమస్యలను నివారిస్తుంది. అయితే ఈ సమస్య ఫ్రీక్వెంట్ గా వస్తుంటే?బెస్ట్ సొల్యూషన్ నేచురల్ రెమెడీస్ గ్రేట్ గా సహాయపడుతాయి.ఇవి వంటగదిలో సులభంగా అందుబాటులో ఉన్నాయి. మరి ఈ హోం రెమెడీస్ ఏంటో తెలుసుకుందాం..

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్:

రెండు టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ ను ఒక గ్లాసు నీటిలో వేసి , మిక్స్ చేసి చల్లారిన తర్వాత తాగడం వల్ల పొట్ట కు ఉపశమనం కలుగుతుంది . గ్యాస్ తగ్గకపోతే మరో సారి కూడా తీసుకోవచ్చు. ఆపిల్ సైడర్ వెనిగర్ చాలా ఫాస్ట్ గా మరియు ఎఫెక్టివ్ గా ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా అజీర్తిని తగ్గిస్తుంది మరియు జీర్ణ సమస్యలను నివారిస్తుంది. ఇది పొట్టలో అసిడిక్ బ్యాలెన్స్ ను రీస్టోర్ చేస్తుంది. హానికరమైన బ్యాక్టీరియాను తొలగిస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలను నివారిస్తుంది.

పెప్పర్ మింట్ టీ:

పెప్పర్ మింట్ టీ:

ఒక గుప్పెడు పుదీనా ఆకులు, బాయిలింగ్ వాటర్లో మిక్స్ చేసి బాగా మరిగించాలి. దీనికి కొద్దిగా తేనె మిక్స్ చేసి తీసుకోవాలి. రోజులో రెండు మూడు సార్లు తీసుకుంటే మంచిది. పెప్పర్ మింట్ హెర్బ్ లో ఔషధగుణాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిలో ఫ్లెవనాయిడ్స్ అధికంగా ఉన్నాయి. యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది టమ్మీ ఇరిటేట్ చేస్తుంది. మరియు జీర్ణసమస్యలను నివారిస్తుంది.

చమోమెలీ టీ:

చమోమెలీ టీ:

ఒక కప్పు హాట్ వాటర్ లో చమోమెలీ టీబ్యాగ్స్ వేసి బాగా డిప్ చేసి, వేడి వేడిగా తాగడం వల్ల గ్యాస్ ట్రబుల్స్ దూరం చేస్తుంది. రోజుకు మూడు కప్పులను తీసుకోవచ్చు. చమోమెలీ టీ రిలాక్సింగ్ మరియు సెడటీవ్ లక్షణాలున్నాయి. జీర్ణ సమస్యలను నివారించడంలో ఇది పర్ఫెక్ట్ హోం రెమెడీ. ఇది స్ట్రెస్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.ఈ హెర్బ్ ఇంటెన్సినల్ గ్యాస్ ను నివారిస్తుంది, ఇది క్రోనిక్ హార్ట్ బర్న్, వికారం, వాంతులు, ఆకలిని , మోషన్ సిక్ నెస్ తగ్గిస్తుంది.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

ఒక కప్పు వేడి నీటిలో కొన్ని గ్రీన్ టీ ఆకులు వేసి, బాగా మరిగించి తర్వాత వడగట్టి గోరువెచ్చగా తాగాలి. దీనికి కొద్దిగా తేనె మరియు నిమ్మరసం మిక్స్ చేస్తే మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. రోజుకు నాలుగు కప్పుల గ్రీన్ టీ తాగవచ్చు. దీన్ని తాగడం వల్ల హెల్తీ బాడీ మరియు హెల్తీ మైండ్ పొందుతారు. గ్రీన్ టీ రెగ్యులర్ గా తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. ఇందులో యాంటీమైక్రోబయల్ లక్షణాలుంటాయి . క్యాట్చెన్స్ గ్యాస్ట్రిక్ సమస్యలను నివారిస్తుంది.

సోంపు:

సోంపు:

ఒక కప్పు వేడి నీటిలో అరటీస్పూన్ సోంపు వేసి బాగా మరిగించాలి. 10 నిముషాల తర్వాత వడగట్టి, తేనె మిక్స్ చేసి గోరువెచ్చగా తాగాలి. లేదా తిన్న వెంటనే కొద్దిగా సోంపు తీసుకుని, నోట్లో వేసుకుని నమిలి తినాలి. ఇది పొట్ట సమస్య మరియు హెవీ సెన్సేషన్ ను నివారిస్తుంది. ఈ వాటర్ రోజుకు రెండు మూడు సార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

బేకింగ్ సోడ:

బేకింగ్ సోడ:

ఒక టీస్పూన్ బేకింగ్ సోడను ఒక గ్లాసు వాటర్ లో మిక్స్ చేసి కాలీపొట్టతో తాగాలి, లేదా భోజనం చేసిన రెండు గంటల తర్వాత తాగాలి. రెగ్యులర్ గా తాగడం వల్ల జీర్ణ సమస్యలను తగ్గుతాయి.

వాటర్ :

వాటర్ :

వాటర్ యూనివర్స్ సొల్యూషన్ . వివిధ రకాల ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది. జీర్ణక్రియను సులభం చేస్తుంది మరియు త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. రోజుకు 10 నుండి 12 గ్లాసులను నీళ్ళు ప్రతి రోజూ తాగాలి.

అల్లం:

అల్లం:

ఒక కప్పు నీటిలో ఫ్రెష్ జింజర్ వేసి బాగా మరిగించాలి. తర్వాత వడగ్టి , భోజనం తర్వాత తాగాలి.ఇది గ్యాస్ ను తగ్గిస్తుంది.దీన్ని రోజుకు రెండు మూడు సార్లు తాగితే మంచి పలితం ఉంటుంది. వివిధ రకాల వ్యాదులను నివారించుకోవడానికి దీన్ని తాగుతారు. ముఖ్యంగా జీర్ణ సమస్యలు, టయర్డ్ నెస్, జలుబు దగ్గు నుండి రిలిఫ్ ను అందిస్తుంది. ఇది క్యుర్మినేటివ్ ఎఫెక్ట్ కలిగి ఉటుంది.

కోకొనట్ వాటర్ :

కోకొనట్ వాటర్ :

రోజుకు రెండు సార్లు ఫ్రెష్ కోకనట్ వాటర్ తాగాలి.రోజూ కోకనట్ వాటర్ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీరంలో హానికర టాక్సిన్స్ తొలగింపబడుతుంది. గ్యాస్ట్రో ఇంటెన్సినల్ ట్రాక్ సమస్యలను నివారిస్తుంది.

పెరుగు:

పెరుగు:

రోజూ ఒక కప్పు పెరుగు తినాలి. దీన్ని తినడం వల్ల పొట్టల్లో మంచి బ్యాక్టీరియాను ఉత్పత్తి చేయడానికిసహాయపడుతుంది. ఫ్రెండ్లీ బ్యాక్టీరాయి ప్రోబయోటిక్స్ ఉన్నప్పుడు, వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. హెల్తీ డైజెస్టివ్ ట్రాక్ . మిల్క్ షుగర్స్ డైరీ ప్రొడక్ట్స్ గ్యాస్ట్రిక్ సమస్యలను నివారిస్తుంది.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

సూప్స్ వంటి వాటిలో వెల్లుల్లి వేసి కాచి తాగాలి.రోజుకు రెండు సార్లు గార్లిక్ సూప్ తాగడం వల్ల గ్యాస్ట్రిక్ మరియు కడుపుబ్బరం నివారించబడుతుంది. ఫ్రెష్ గార్లిక్ తీసుకోవడం మంచిది

నిమ్మ:

నిమ్మ:

నిమ్మరసంను వేడినీటిలో మిక్స్ చేసి గోరువెచ్చగా తాగాలి, ఇది కాలేయంలో జీర్ణ రసాల ఉత్పత్తికి సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

జీలకర్ర:

జీలకర్ర:

జీలకర్రను ఒక గ్లాసు వేడినీటిలో వేసి మరిగించి వడగట్టి, గోరువెచ్చగా తాగాలి. లేదా కొద్దిగా జీలకర్ర తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.గ్యాస్ సమస్యలను నివారిస్తుంది .

English summary

Top 10 Home Remedies For Gas Problem

You can always have antacids to cure bloating and indigestion instantly. What about preventing frequent bloating and stomach disorders? The best solution would be to opt for some natural remedies that you can easily find in your kitchen. These remedies always come handy.
Story first published: Tuesday, August 9, 2016, 17:18 [IST]
Desktop Bottom Promotion