For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాలేయంలోని మలినాలను మాయం చేసే సూపర్ ఫుడ్స్

By Swathi
|

శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో లివర్ ఒకటి. ఇది శరీరంలో జీర్ణవ్యవస్థ, మెటబాలిజం, ఇమ్యునిటీ, పోషకాల నిలువ వంటి ప్రధాన ప్రక్రియలు సజావుగా సాగడానికి లివర్ బాధ్యత తీసుకుంటుంది. శరీరంలో ఈ వ్యవస్థలన్నీ ఆరోగ్యంగా ఉండాలంటే.. కాలేయం ఆరోగ్యంగా ఉండాలి.

కాలేయం శరీరంలోని హానికారక మలినాలను తొలగించి, అలాగే రక్తంలోని మలినాలను కూడా తొలగించి పోషకాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. అంతేకాదు కొన్ని విటమిన్స్, ఐరన్ వంటి వాటిని కూడా నిలువ ఉంచుకుంటుంది. అలాగే ఇన్సులిన్ లెవెల్స్ తగ్గించడంలో కూడా లివర్ దే బాధ్యత. అలాగే పాత ఎర్రరక్తకణాలను నాశనం చేసి.. అవసరమైన కెమికల్స్ ని ఉత్పత్తి చేస్తుంది.

READ MORE: మీ లివర్ డేంజర్ జోన్ లో ఉన్నది తెలిపే కొన్ని లక్షణాలు

ఇన్ని పనులతో బిజీగా ఉండే కాలేయం హెల్తీగా ఉండటం చాలా అవసరం. అనారోగ్యకరమైన ఆహారాలు, అలవాట్లు, జీవనశైలి కాలేయంపై ప్రభావం చూపుతుంది. అలాగే టాక్సిన్స్ ని బయటకు పంపడంలో ఫెయిల్ అయితే.. బరువు పెరగడానికి కారణమవుతుంది. దీనివల్ల ఒబేసిటీ, గుండె సంబంధిత వ్యాధులు, అలసట, తలనొప్పి, జీర్ణవ్యవస్థ సమస్యలు, అలర్జీ వంటి రకరకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి కాలేయం ఆరోగ్యానికి, కాలేయం పనితీరు సక్రమంగా ఉంటడానికి ఉపయోగపడే ఆహారాలు డైట్ లో చేర్చుకోవడం తప్పనిసరి. అలాంటి సూపర్ ఫుడ్స్ ఇవే...

వెల్లుల్లి

వెల్లుల్లి

కాలేయం ఆరోగ్యానికి వెల్లుల్లి గ్రేట్ గా పనిచేస్తుంది. ఇది కాలేయంలో ఎంజైమ్స్ ని ఉత్సాహపరిచి టాక్సిన్స్ ని బయటకు పంపడానికి సహాయపడుతుంది. లివర్ టాక్సిక్ డ్యామేజ్ కి గురికాకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. కాబట్టి 2 లేదా 3 పచ్చి వెల్లుల్లి రెబ్బలను రోజూ తీసుకోవాలి.

బీట్ రూట్స్

బీట్ రూట్స్

కాలేయంలో విషపూరిత మలినాలను బయటకు పంపడంలో బీట్ రూట్స్ పవర్ ఫుల్ గా పనిచేస్తాయి. ఇందులో ఫ్లేవనాయిడ్స్, బీటా కెరోటిన్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది లివర్ ఫంక్షన్ కి తోడ్పడుతుంది. కాబట్టి డైలీ డైట్ లో బీట్ రూట్స్ ని గానీ, బీట్ రూట్ జ్యూస్ ని గానీ చేర్చుకుంటే సరిపోతుంది.

నిమ్మకాయలు

నిమ్మకాయలు

నిమ్మకాయలు లివర్ ని డెటాక్సిఫై చేయడానికి ఉపయోగపడతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయంలోని ఎంజైమ్ లను ఉత్సాహపరిచి మలినాలను బయటకుపంపడానికి సహాయపడేలా చేస్తాయి. ఒక లీటర్ నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.

గ్రీన్ టీ

గ్రీన్ టీ

రోజూ గ్రీన్ టీ తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్, ఫ్యాట్ కి కారణమయ్యే కారకాలను బయటకు పంపడం తేలికవుతుంది. అంతేకాదు కాలేయ సంబంధిత వ్యాధులను నిరోధించడానికి గ్రీన్ టీ చక్కటి పరిష్కారం.

అవకాడో

అవకాడో

లివర్ డ్యామేజ్ కాకుండా కాపాడే కెమికల్స్ అవకాడోలో పుష్కలంగా ఉంటాయి. శరీరంలో పేరుకున్న హానికారక మలినాలను తొలగించడానికి, కాలేయం పనితీరు సజావుగా ఉండటానికి ఈ అవకాడో సహాయపడుతుంది. వారానికి 1 లేదా 2 అవకాడోలు కొన్ని నెలల పాటు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

పసుపు

పసుపు

లివర్ క్లెన్సింగ్ కి ఉపయోగపడే పవర్ పసుపులో ఉంది. శరీరంలో ఫ్యాట్స్ సులభంగా జీర్ణమవడానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాదు డ్యామేజ్ అయిన లివర్ సెల్స్ ని మళ్లీ ఉత్పత్తి చేయడంలో పసుపు సహాయపడుతుంది. ఒక గ్లాసు నీటిలో పావు టీ స్పూన్ పసుపు వేసి మరిగించాలి. కొన్ని వారాలపాటు రోజుకి రెండుసార్లు దీన్ని తీసుకుంటే మంచిది.

యాపిల్స్

యాపిల్స్

రోజుకి ఒక యాపిల్ తీసుకోవడం వల్ల లివర్ ఆరోగ్యంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. యాపిల్స్ లో ఫైబర్ తోపాటు పెక్టిన్ ఉంటుంది. ఇది టాక్సిన్స్ ని బయటకు పంపడానికి సహాయపడుతుంది. అన్ని రకాల యాపిల్స్ కాలేయం ఆరోగ్యానికి మంచిది. లేదా రోజు ఒక గ్లాసు ఫ్రెజ్ యాపిల్ జ్యూస్ తీసుకున్నా లివర్ హెల్త్ కి మంచిది.

వాల్ నట్స్

వాల్ నట్స్

వాల్ నట్స్ లో పుష్కలంగా ఉండే.. ఎమినో యాసిడ్స్ కాలేయం పనితీరుకి సహకరిస్తాయి. అలాగే వాల్ నట్స్ లో ఉండే ఒమేగా ఫ్యాటీ త్రీ యాసిడ్స్ న్యాచురల్ గా లివర్ క్లెన్సింగ్ ప్రాసెస్ కి సహాయపడతాయి.

రోజూ గుప్పెడు వాల్ నట్స్ తీసుకోవడం వల్ల కాలేయం ఆరోగ్యం బాగుంటుంది. లేదా సలాడ్స్, సూప్స్ లో వాల్ నట్స్ చేర్చుకోవడం మంచిది.

బ్రొకోలి

బ్రొకోలి

లివర్ క్లెన్సింగ్ హెల్తీగా, న్యాచురల్ గా జరగడానికి రెగ్యులర్ డైట్ లో బ్రొకోలి చేర్చుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. శరీరంలో ఉన్న హానికారక టాక్సిన్స్ తొలగించడానికి బ్రొకోలి పర్ఫెక్ట్ ఆప్షన్. అలాగే ఇది డైజెషన్ ప్రాజెస్ ఇంప్రూవ్ చేస్తుంది. వారానికి 3 సార్లు ఒక కప్పు బ్రొకోలి తీసుకుంటి కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.

గ్రేప్ ఫ్రూట్

గ్రేప్ ఫ్రూట్

గ్రేప్ ఫ్రూట్ లో విటమిన్ సి, పెక్టిన్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవన్నీ లివర్ న్యాచురల్ క్లెన్సింగ్ ని ప్రోత్సహిస్తాయి. అలాగే ఈ గ్రేఫ్ ఫ్రూట్ ఫ్యాట్ కరిగించడంలోనూ సహాయపడుతుంది. ఒక గ్లాసు గ్రేప్ ఫ్రూట్ జ్యుస్ తాగడం లేదా ఒక గ్రేఫ్ ఫ్రూట్ ని అల్పాహారంలో భాగం చేసుకోవాలి. ఒకవేళ మందులు వాడుతుంటే.. డాక్టర్ సలహాతో ఈ గ్రేఫ్ ఫ్రూట్ ని డైట్ లో చేర్చుకోవడం మర్చిపోకండి.

English summary

Top 10 Liver-Cleansing Superfoods

Top 10 Liver-Cleansing Superfoods. Many foods can help cleanse, rejuvenate and detoxify your liver. This will help keep your liver healthy and functioning the way you need it to.
Story first published: Tuesday, February 2, 2016, 17:52 [IST]
Desktop Bottom Promotion