For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్ట్ : కలుషిత నీరు త్రాగడం వల్ల వచ్చే ప్రమాదకర వ్యాధులు...!

|

మానవాలికి నీరు అత్యంత అవతసరమైన వనరు. భూమి మీద ఉండే ప్రతి ప్రాణికి నీరు అవసరం. నీరు లేకుండా ఏ ప్రాణి జీవించలేవు. ప్రాణం ఉన్న ప్రతి జీవిలో జీవక్రియలు జరగాలంటే అందుకు నీటి అవసరం చాలా ఉంది. అయితే ఈ రోజుల్లో కాలుష్యం మరియు నీటి కాలుష్యం అత్యంత ప్రమాదకర సమస్యగా మారింది.

పర్యావరణ కాలుష్యంతో బాటే ఈ మధ్యకాలంలో నీటి కాలుష్యం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. నీరు కలుషితమైనప్పుడు ఆరోగ్య సంరక్షణకోసం తగిన జాగ్రత్తలు తీసుకోవల్సి వుంటుంది. మనకు వచ్చే రోగాల్లో అధిక భాగం నీటి వల్లే సంక్రమిస్తాయి. తాగు నీటి విషయంలో ఏ మాత్రం అలసత్వం వహించిన భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

కలుషితమైన నీటిని తాగుట వలన అతిసారం, కలరా, టైఫాయిడ్‌, పచ్చకామెర్లు వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం వుంది. వీటితో పాటు మరికొన్ని వ్యాధుల గురించి మీరు తెలుసుకోవాలి....

టైఫాయిడ్ :

టైఫాయిడ్ :

వాటర్ పొల్యూషన్ వల్ల టైఫాయిడ్ వ్యాధి బారిన పడుతుంటారు. ప్రతి సంవత్సరం వాటర్ పొల్యూషన్ వల్ల 12 మిలియన్స్ పీపుల్స్ టైఫాయిడ్ బారీన పడుతున్నారు. టైఫాయిడ్ ఫీవర్ వచ్చిన వారిలో తలనొప్పి, వికారం, ఆకలి లేకపోవడం లక్షణాలు కనబడుతాయి.

కలరా:

కలరా:

విబ్రియో కలరా ఇది బ్యాక్టీరియా..ఇది చిన్న ప్రేగుల మీద ప్రభావం చూపుతుంది. కలరా సోకిన వ్యక్తిలో తలనొప్పి, బెల్లీ కాంట్రాక్షన్, డయోరియా, వాంతులు,వంటి లక్షణాలు కనబడుతాయి.

అమీబియాసిస్

అమీబియాసిస్

ఈ వ్యాది కూడా చాలా సాధారణంగా కలుషితమైన నీరు తాగడం వల్ల వచ్చే వ్యాధి. వాటర్ లో ఉండే అమీబియా వైరస్ వల్ల ప్రెద్ద ప్రేగులు, లివర్ మీద ప్రభావం చూపుతుంది.

 డిసెంట్రీ

డిసెంట్రీ

కలుషిత నీరు తాగడం వల్ల మరో వ్యాధి డిసెంట్రీ . ఈ వ్యాధి యొక్క లక్షణాలు, జ్వరం, వాంతులు, పొట్ట ఉదరంలో నొప్పి, డయోరియా , కఫం వంటి లక్షణాలు కనబడుతాయి.

డయోరియా...

డయోరియా...

కలుషిత నీరు తాగడం వల్ల వచ్చే మరో కామన్ డిసీజ్ డయోరియా. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ప్రాణపాయ స్థితికి చేరుతుంది. పిల్లల్లో డీహైడ్రేషన్ కారణంగా మరణించడం జరగుతుంది

హెపటైటస్ ఎ:

హెపటైటస్ ఎ:

హెపటైటిస్ చాలా దారుణంగా లివర్ మీద ప్రభావం చూపుతుంది. ఇది కలుషితమైన నీటి ద్వారా లేదా ఆహారం ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశించడం వల్ల హెపటైటిస్ ఎ కి గురి అవుతారు.

విషపూరితం

విషపూరితం

పాత నీటి గొట్టాల నుండి వచ్చే నీరు కొన్ని సందర్భాల్లో విషపూరితంగా మారవచ్చు. ఈ నీటిని తాగడం వల్ల, మానవ శరీరంలోని అంతర్గతంగా అవయవాలు డ్యామేజ్ అవ్వొచ్చు

మలేరియా:

మలేరియా:

నీటి కాలుష్యం వల్ల వచ్చే మరో అత్యంత సాధారణ వ్యాధి మలేరియా, దోమల గుడ్లు నీటిలో పెట్టడం వల్ల , ఆ కలుషితమైన నీరు తాగడం వల్ల మలేరియా వస్తుంది. కాబట్టి, కలుషితమైన నీరు తాగకుండా మలేరియా నుండి రక్షణ పొందాలి. కలుషితమైన నీరు తాగడం వల్ల కొన్నిసందర్భాల్లో ప్రాణాపాయ స్థితి ఏర్పడుతుంది.

పొలిమావిరస్ ఇన్ఫెక్షన్స్

పొలిమావిరస్ ఇన్ఫెక్షన్స్

ట్రూమర్స్ ఏర్పడటానికి ఈ వైరస్ కారణమవుతుంది. ఇది వివిధ రకాలుగా వ్యాప్తి చెందుతుంది. ఖచ్చితంగా వాటర్ ద్వారా నుండి కూడా వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ వల్ల మానవ శరీరంలో అనేక కణితులు సృష్టిస్తుంది.

పోలియో

పోలియో

పోలియోమెలిటీస్ అనేది పోలియో వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ . ఇది కూడా కలుషితమైన నీరు తాగడం వల్ల ఈ వ్యాధి బారిన పడాల్సి వస్తుంది. ఈ వ్యాధిలక్షణాలల్లో పెరాలసిస్ అత్యంత ప్రమాధకరమైన వ్యాది. ఇది నాడీవ్యవస్థను దెబ్బతీస్తుంది. దాంతో పక్షవాతానికి గురి కావల్సి వస్తుంది. కాబట్టి, శుభ్రమైన నీటిని తీసుకోవడం చాలా అవసరం

ఎర్సినికోసిస్ :

ఎర్సినికోసిస్ :

ఎర్సినికోసిస్ అనేది మనకు కంటికి కనబడనంత చిన్నదిగా నీటిలో దాగుంటుంది. ఇది వ్యాధులకు గురిచేస్తుంది. ముఖ్యంగా ఇది చర్మానికి ఎక్కువ హాని చేస్తుంది. దాంతో స్కిన్ క్యాన్సర్ కు దారితీస్తుంది. అలాగే ఊపిరితిత్తులు, కిడ్నీలు మరియు బ్లాడర్ మీద కూడా దుష్ప్రభావం చూపుతుంది. ఇది నేచురల్ గా వాటర్ లో ఉంటుంది. కాబట్టి, ఇది వాటర్ ద్వారా మానవ శరీరాల్లోకి ప్రవేశిస్తుంది. వ్యాధులకు గురిచేస్తుంది

ఫ్లోరోసిస్

ఫ్లోరోసిస్

ఫ్లోరోసిస్ అనేది మనుషుల్లో వచ్చే బోన్ డిసీజ్ బావుల్లో లేదా బోరుల్లో నుండి వచ్చే వాటర్ లో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండటం వల్ల ఫ్లోరోసిస్ వ్యాధులకు గురౌతారు. రీసెంట్ గా జరిపిన పరిశోధనల ప్రకారం ఒక సవంత్సరంలో దాదాపు 25 దేశాల్లో 10 మిలియన్ ప్రజలు ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు కనుగొన్నారు

గునియా వార్మ్ డిసీజెస్

గునియా వార్మ్ డిసీజెస్

ఇటువంటి వ్యాధులు ఎక్కువగా ఆఫ్రికన్స్ ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు, అక్కడి ప్రజలు, లార్వాతో కలుషితమైన నీరు తాగడం వల్ల ఈ వ్యాధులకు గురి అవుతారు. ఈ లార్వా నీటిలో ఒక మీటర్ పొడవు పెరుగుతుంది, ఇది గునియా మార్పుచెందుతుంది. కలుషిత నీటిని తాగడం వల్ల ఇది మానవుని శరీరంలో ఒక సంవత్సరం వరకూ నిల్వ ఉంటుంది. అంతే కాదు, దీని కారణంగా మానవ శరీరంలో అల్సర్

ప్రేగులో వార్మ్స్ (ఏలికపాములు)

ప్రేగులో వార్మ్స్ (ఏలికపాములు)

ప్యారాసైట్ ఇంటెన్సినల్ వార్మ్స్ కొన్ని ఆహారాల వల్ల కూడా ఏర్పడుతాయి. ముఖ్యంగా పిల్లలు చాలా సెన్సిటివ్ గా ఉండటం వల్ల , ఇంకా మాల్ న్యూట్రీషియన్, అనీమియా , ఇమ్యూనిటి లోపం వల్ల 10 శాతం ప్యారాసైట్ పెరుగతాయి. కాబట్టి, పిల్లలకు అందించే ఆహారం మరియు నీరు ఫ్రెష్ గా , క్లీన్ గా ఉండేట్లు జాగ్రత్తలు తీసుకోవాలి.

ట్రకోమా (కళ్ళ ఇన్ఫెక్షన్)

ట్రకోమా (కళ్ళ ఇన్ఫెక్షన్)

ట్రకోమ చాలా ప్రమాధకరమైన వ్యాధి. కలుషిత నీటిని తాగడం వల్ల చాలా మంది పేషంట్స్ కళ్ళను కోల్పోయినట్లు రీసెంట్ స్టడీస్ లో నిర్ధారణ జరిగింది. ఈ వ్యాధి ఎక్కువగా పిల్లలు మరియు మహిళలు గురి అవుతున్నారు. పరిశోధనల ప్రకారం ట్రకోమా వ్యాధి కారణంగా పిల్లలు అందత్వానికి గురి అవుతున్నారు.

English summary

Top 15 Diseases Caused by WATER Pollution

Water is very vital for human life and for all the plants and other living beings. Without water human beings can’t exist because most of the functions are working in the human body with the help of water. But today’s problem is pollution and water pollution is the most dangerous problem which is faced by us and there are list of diseases caused by polluted water.
Story first published: Thursday, September 29, 2016, 15:06 [IST]
Desktop Bottom Promotion