For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వ్యాధులను, ఇన్ఫెక్షన్స్ నునివారించే యాంటీవైరల్ హెర్బ్స్

By Super Admin
|

ఎప్పుడూ అనారోగ్యానికి గురి అవుతున్నారా? అయితే మీలో వ్యాధినిరోధక శక్తి లోపించినట్లే. వ్యాధినిరోధక శక్తి లోపించడం వల్ల బ్యాక్టీరియా మరియు వైరస్ లతో పోరాడే వ్యాధినిరోధక సామర్థ్యం కోల్పోవడం వల్ల తరచూ వ్యాధుల భారిన పడుతున్నారు .

శరీరంలోని వ్యాధినిరోధక శక్తిని బట్టే శరీరంలోని ఇంటర్నల్ సిస్టమ్ బ్యాక్టీరియల్ , వైరస్ ల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ మరియు వ్యాధులు ఆధారపడి ఉంటాయి. శరీరంలో వ్యాధినిరోధక శక్తి తగ్గినప్పుడు క్రమంగా ఇన్ఫెక్షన్స్ మరియు వ్యాధులు పెరుగుతాయి. అందువల్ల వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవాలి. వ్యాధినిరోధక శక్తి పెంచుకోవడానికి వివిధ మార్గాలున్నాయి .

 Top Antiviral Herbs To Boost Your Immunity And Fight Infection

తక్షణ ఇమ్యూనిటిని పెంచడానికి శతాబ్దాల కాలం నుండి కొన్ని రకాల మూలికలను ఉపయోగిస్తున్నారు .

వ్యాధినిరోధక శక్తి పెంచడంలో కులినరీ ఒక ముఖ్యమైన హెర్బల్ మెడిసిన్ గా ఉపయోగిస్తున్నారు . ఇందులో ఔషధగుణాలు మెండుగా ఉన్నాయి .

కాబట్టి, మన శరీరానికితక్షణ వ్యాధినిరోధక శక్తిని అంధించే , శరీర ఆరోగ్యానికి రక్షణ కల్పించే ఎంజైమ్స్ , ఆరోగ్యంగా మరియు ఫిట్ గా ఉండటానికి అవసరమయ్యే వ్యాధినిరోధకశక్తి అంధించే కొన్ని హెర్బ్స్ ఈ క్రింది విధంగా తెలపడం జరిగింది. వ్యాధినిరోధక శక్తిని పెంచే ఈ ఎఫెక్టివ్ హెర్బ్స్ గురించి తెలుసుకుందాం...

 Top Antiviral Herbs To Boost Your Immunity And Fight Infection

1. ఆస్ట్రాగలస్: ఆస్ట్రాగలస్ హెర్బ్ లో వ్యాధినిరోధక శక్తిని పెంచే అద్భుతమైన ఔషధగుణాలున్నాయి . ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ లక్షణాలకు సహాయపడే ఇమ్యూన్ సెల్స్ అధికంగా ఉన్నాయి . ఇవి వైరస్, మరియు ఇతర ఇన్ఫెక్షన్స్ నుండి శరీరానికి రక్షణ కల్పిస్తుంది.

 Top Antiviral Herbs To Boost Your Immunity And Fight Infection

2. వెల్లుల్లి: వెల్లుల్లి యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్స్ తో పోరాడే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి, వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

 Top Antiviral Herbs To Boost Your Immunity And Fight Infection

3. ఇచినేసియా:ఇది చాలా సింపుల్ హెర్బ్ , కానీ చాలా పవర్ ఫుల్ హెర్బ్ . ఇది బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది. ఈ హెర్బ్ ను తీసుకోవడం వల్ల బ్లడ్ అండ్ ఇమ్యూన్ సెల్స్ పనితీరును మెరుగుపరుస్తుంది.

 Top Antiviral Herbs To Boost Your Immunity And Fight Infection

4. అల్లం: జీర్ణ సమస్యలను మెరుగుపరచడంలో ఇది గ్రేట్ హెర్బ్ . బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. ఇది ఒక అద్భుతమైన హెర్బ్ .ఇందులో వ్యాధినిరోధక శక్తిని పెంచే ఔషధగుణాలు ఎక్కువగా ఉన్నాయి . కాబట్టి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ప్యాథోజన్స్ వల్ల వచ్చే వ్యాధులను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

 Top Antiviral Herbs To Boost Your Immunity And Fight Infection

5. లికోరైస్: లికోరైస్ లో వివిధ రకాల ప్రయోజనాలున్నాయి, ఇది వ్యాధినిరోధకశక్తిని పెంచి , వ్యాధులతో పోరాడుతుంది . హానికర బ్యాక్టీరియా మరియు వైరస్ వల్ల వచ్చే వ్యాధులను ఎదుర్కుంటుంది.

English summary

Top Antiviral Herbs To Boost Your Immunity And Fight Infection

Do you fall sick often? The chances are that you've got a weak immune system that has lost its ability to fight off the disease-causing bacteria and viruses. Our immune system's main function is to shield our internal system from the harmful bacteria and viruses that cause a multitude of infections and diseases.
Story first published: Wednesday, August 10, 2016, 18:12 [IST]
Desktop Bottom Promotion