For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాన్ట్సిపేషన్ నుంచి తక్షణ ఉపశమనం కలిగించే ఆలివ్ ఆయిల్ ట్రీట్మెంట్స్..!

కాన్ట్సిపేషన్ సమస్య ఉందంటే.. చాలా నొప్పిగా ఉంటుంది. బయటకు చెప్పలేని ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి.. ఈ సమస్య నివారించుకోవడానికి న్యాచురల్ గా తక్షణమే నివారించే..ఆలివ్ ఆయిల్ ట్రీట్మెంట్స్ ఫాలో అవడం మంచిది.

By Swathi
|

మూత్రవిసర్జనకు చాలా ఇబ్బంది పడుతున్నారా ? కాన్ట్సిపేషన్ నుంచి తక్షణ ఉపశమనం కలిగించే రెమెడీస్ ఉంటే బావుంటుందని భావిస్తున్నారా ? ఒకవేళ అవును అయితే.. మీకు చక్కటి రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి. అది కూడా చాలా సింపుల్ తయారు చేసుకుని తీసుకోవచ్చు.

Methods To Use Olive Oil For Constipation

కాన్ట్సిపేషన్ పొట్టనొప్పికి, గ్యాస్ట్రిక్స్, బ్లోటింగ్, జీర్ణసమస్యలకు కారణమవుతుంది. చాలా అసౌకర్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి.. కాన్ట్సిపేషన్ ని వెంటనే నివారించుకోవాలి. లేదంట,.. సమస్య మరింత తీవ్రమవుతుంది. బోవెల్ మూవ్మెంట్స్ తక్కువగా ఉన్నప్పుడు.. కాన్ట్సిపేషన్ సమస్య వస్తుంది.

కాన్ట్సిపేషన్ సమస్య ఉందంటే.. చాలా నొప్పిగా ఉంటుంది. బయటకు చెప్పలేని ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి.. ఈ సమస్య నివారించుకోవడానికి న్యాచురల్, హెర్బల్ రెమిడీస్ ఫాలో అవడం మంచిది. కెమికల్ మెడిసిన్స్ కంటే.. హోం రెమిడీస్ ద్వారా చాలా ఎఫెక్టివ్ సమస్య నుంచి బయటపడవచ్చు.

అది కూడా ఆలివ్ ఆయిల్ ఉపయోగించి కాన్ట్సిపేషన్ ని చాలా ఎఫెక్టివ్ గా నివారించవచ్చు.

Methods To Use Olive Oil For Constipation1

ఆలివ్ ఆయిల్ మసాజ్
ఆలివ్ ఆయిల్ తీసుకోవడాన్ని ఇష్టపడని వాళ్లు ఆలివ్ ఆయిల్ తో మసాజ్ చేసుకోవాలి. నాలుగైదు చుక్కల ఆలివ్ ఆయిల్ తీసుకుని బొడ్డు దగ్గర 5నిమిషాలపాటు మసాజ్ చేయాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే.. కాన్ట్సిపేషన్ నివారించుకోవచ్చు.

Methods To Use Olive Oil For Constipation2

ఆలివ్ ఆయిల్, కాఫీ
ఒకవేళ మీకు కాఫీ చాలా ఇష్టం అయితే.. ఈ రెమెడీ ట్రై చేయవచ్చు. ఒక కప్పు కాఫీలో ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి.. ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఇది.. కాన్ట్సిపేషన్ సమస్యను తేలికగా నివారిస్తుంది.

Methods To Use Olive Oil For Constipation3

అరటిపండు, ఆలివ్ ఆయిల్
ఒక కప్పు అరటిపండు ముక్కలలో, ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి తీసుకుంటే.. శరీరానికి కావాల్సిన పొటాషియం అందుతుంది. ఇది కాన్ట్సిపేషన్ తగ్గించడానికి సహాయపడుతుంది.

Methods To Use Olive Oil For Constipation4

ఆరంజ్ జ్యూస్, ఆలివ్ ఆయిల్
ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ ని, ఒక గ్లాసు ఆరంజ్ జ్యూస్ లో మిక్స్ చేసి.. ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే.. మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

Methods To Use Olive Oil For Constipation5

నిమ్మ, ఆలివ్ ఆయిల్
ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ ని, ఒక స్పూన్ నిమ్మరసంలో కలపాలి. రెండింటినీ బాగా మిక్స్ చేసి.. ఉదయాన్నే తీసుకుంటే బ్యాక్టీరియాని తొలగించి.. కాన్ట్సిపేషన్ ని నివారిస్తుంది.

Methods To Use Olive Oil For Constipation6

పాలు, ఆలివ్ ఆయిల్
ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ ని ఒక గ్లాసు పాలలో కలిపి.. ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఉదయం నిద్రలేచిన వెంటనే తీసుకుంటే.. కాన్ట్సిపేషన్ సమస్య దూరమవుతుంది.

Methods To Use Olive Oil For Constipation7

ఆలివ్ ఆయిల్, పెరుగు
పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది శరీరానికి చాలా అవసరం. ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ ని ఒక కప్పు పెరుగులో కలిపి రోజుకి మూడు సార్లు తీసుకుంటే.. కాన్ట్సిపేషన్ ని ఎఫెక్టివ్ గా నివారించుకోవచ్చు.

English summary

Top 7 Methods To Use Olive Oil For Constipation

There are 10 best ways with which olive oil can relieve us from constipation. Read further to find out the different methods.
Story first published:Monday, November 28, 2016, 17:18 [IST]
Desktop Bottom Promotion