For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యూరిన్ కి వెళ్లకుండా ఎక్కువసేపు ఆపుకుంటే ఏమవుతుంది ?

చాలా మంది, చాలా సందర్భాల్లో యూరిన్ చాలా అర్జెంట్ అయినా కూడా.. అలాగే ఆపుకుంటూ ఉంటారు. కొంతమంది సమయం, సందర్భం వల్ల అలా ఆపుకుంటే.. మరికొందరు బాత్ రూంకి వెళ్లడానికి బద్ధకమై.. యూరిన్ వెళ్లకుండా ఆపుకుంటారు.

By Swathi
|

చాలా మంది, చాలా సందర్భాల్లో యూరిన్ చాలా అర్జెంట్ అయినా కూడా.. అలాగే ఆపుకుంటూ ఉంటారు. కొంతమంది సమయం, సందర్భం వల్ల అలా ఆపుకుంటే.. మరికొందరు బాత్ రూంకి వెళ్లడానికి బద్ధకమై.. యూరిన్ వెళ్లకుండా అలాగే ఫోర్స్ తో ఆపుకుంటూ ఉంటారు.

What Happens when You Ignore the Urge to Urinate?

జర్నీ చేసేటప్పుడు, ఏదైనా ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నప్పుడు, చుట్టు పక్కన సరైన బాత్ రూం సౌకర్యం లేనప్పుడు, తాము వర్క్ చేస్తున్న దగ్గర పరిశుభ్రమైన బాత్ రూంలు లేనప్పుడు ఇలా.. యూరిన్ కి వెళ్లకుండా.. ఆపుకునే ప్రయత్నం చేస్తారు.

కానీ ఇలాంటి అలవాటుకి దూరంగా ఉండటం మంచిది. ఇలా యూరిన్ కి వెళ్లాల్సి ఉన్నా కూడా.. వెళ్లకుండా ఆపుకోవడం వల్ల.. అనేక ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. అనవసరమైన, అవాంఛిత ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే.. యూరిన్ కి వెళ్లాలని శరీరం సంకేతం ఇచ్చినప్పుడు వెళ్లాలి. ఒకవేళ యూరిన్ కి వెళ్లాల్సి ఉన్నా.. వెళ్లకుండా బిగపట్టుకుంటే ఏమవుతుంది, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయో చూద్దాం..

యూరినరీ ఇన్ఫెక్షన్

యూరినరీ ఇన్ఫెక్షన్

ఒకవేళ మీరు రెగ్యులర్ గా యూరిన్ కి వెళ్లాల్సి వచ్చినప్పుడు వెళ్లకుండా అడ్డుకుంటూ ఉన్నారంటే.. చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. ఇలా ప్రతిసారి ఆపుకోవడం వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. యూరినరీ ట్రాక్ లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలుంటాయి.

కారణం

కారణం

యూరిన్ లో క్రిములు ఎక్కువగా ఉంటాయి. అవి బ్లాడర్ లో ఎక్కువ సమయం ఉంటే.. తర్వాత ఇన్ఫెక్షన్ కి కారణమవుతాయి. కాబట్టి యూరిన్ కి వెళ్లాలి అనిపించిన వెంటనే వెళ్లాలి.

కిడ్నీ స్టోన్స్

కిడ్నీ స్టోన్స్

ఎక్కువసేపు యూరిన్ కి వెళ్లకుండా ఆపుకుంటూ ఉంటే.. కిడ్నీల్లో స్టోన్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. దీనికి మీరే బాధ్యులవుతారు. చిన్న చిన్న కిడ్నీ స్టోన్స్ యూరిన్ ద్వారా బయటకు వెళ్లిపోతాయి. కానీ మీరు యూరిన్ కి వెళ్లకుండా ఆపుకునే ప్రయత్నం చేయడం వల్ల అవి పెద్దవిగా మారి యూరిన్ ద్వారా బయటకు వెళ్లలేకపోతాయి.

కిడ్నీ స్టోన్స్ రాకూడదంటే

కిడ్నీ స్టోన్స్ రాకూడదంటే

కిడ్నీల్లో స్టోన్స్ ఏర్పడకుండా ఉండాలంటే.. ఎక్కువ మోతాదులో నీళ్లు తాగాలి. మీ శరీరం సూచించినప్పుడు యూరిన్ కి వెళ్లాలి. దీనివల్ల కిడ్నీల్లో ఉన్న ఎలాంటి వ్యర్థాలనైనా తొలగించుకోవచ్చు.

సిస్ట్స్

సిస్ట్స్

ఒకవేళ మీరు యూరిన్ కి వెళ్లకుండా ఆపుకున్నారంటే.. బ్లాడర్ లోని గోడలలో వాపు వస్తుంది. ఇలా వాపు రావడాన్ని సిస్ట్స్ అంటారు. ఒకవేళ మీకు యూరిన్ పాస్ చేసేటప్పుడు పెల్విక్ పెయిన్ రావడం, తక్కువ మోతాదులో యూరిన్ రావడం వంటి లక్షణాలన్నీ సిస్ట్స్ ని సూచిస్తాయి. కాబట్టి ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డాక్టర్ ని సంప్రదించాలి.

బ్లాడర్ వాల్

బ్లాడర్ వాల్

బ్లాడర్ లో యూరిన్ నిల్వ ఉంచుకోవడానికి లిమిట్ ఉంటుంది. ఒక వేళ మోతాదుకి మించి బ్లాడర్ లో యూరిన్ చేరుకుంటే.. వాపు వస్తుంది. బ్లాడర్ కేవలం 3 కప్పుల నీటిని మాత్రమే నిల్వ ఉంచుకోగలదు. కాబట్టి యూరిన్ కి వెళ్లడానికి అందుబాటులో బాత్ రూం లేనప్పుడు ఎక్కువ నీళ్లు తాగితే సమస్య వస్తుంది. కాబట్టి ముఖ్యమైన మీటింగ్, వర్క్ ఉన్నప్పుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.

మళ్లీ వెనక్కి

మళ్లీ వెనక్కి

ఇది చాలా సీరియస్ కండిషన్స్ లో జరుగుతుంది. అంటే మీరు యూరిన్ కి వెళ్లాల్సి ఉన్నా కూడా.. చాలా సమయం అలాగే బిగపట్టి ఉంటే.. బ్లాడర్ లో నిల్వ ఉండే యూరిన్ మళ్లీ మూత్రాశయంలోకి, కిడ్నీలలోకి వెనక్కి వెళ్తుంది. దీనివల్ల చాలా తీవ్రమైన ఇన్ఫెక్షన్స్ వస్తాయి.

పొట్టలో వాపు

పొట్టలో వాపు

యూరిన్ కి వెళ్లాలని శరీరం సంకేతం పంపినప్పుడు మీరు యూరిన్ కి వెళ్లకపోతే.. చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఈ లిక్విడ్స్ ని నిల్వ ఉంచుకోవడానికి శరీరం స్ట్రెచ్ అవుతుంది. దీనివల్ల పొట్టలో వాపు, ఇన్ఫెక్షన్ వస్తాయి.

English summary

What Happens when You Ignore the Urge to Urinate?

What Happens when You Ignore the Urge to Urinate. The problem with resisting the urge to urinate is that you accumulate toxins that you should have released, which can lead to unwanted infections.
Story first published: Tuesday, December 13, 2016, 13:11 [IST]
Desktop Bottom Promotion