For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తేనెలో వెల్లుల్లి నానబెట్టి తింటే శరీరంలో జరిగే అద్భుత మార్పులు..!!

By Swathi
|

తేనె, వెల్లుల్లిలోని ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలామందికి తెలుసు. అయితే ఈ రెండింటి మిశ్రమాన్ని కేవలం ఏడు రోజులు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పొందే అమేజింగ్ బెన్ఫిట్స్, శరీరంలో జరిగే అద్భుత మార్పుల గురించి తెలుసుకుందాం.

వెల్లుల్లి అందరికీ తెలిసిన పదార్థమే కాదు.. ఇది ఆహారాలకు అద్భుతమైన టేస్ట్ ని ఇస్తుంది. అనేక అనారోగ్య సమస్యలకు న్యాచురల్ రెమిడీగా ఉపయోగపడుతుంది. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే యాక్టివ్ ఇంగ్రిడియంట్ ఉంటుంది. ఒకవేళ వెల్లుల్లిని వేడి చేయడం, ఉడికించి తీసుకోవడం వల్ల.. ఈ అల్లిసిన్ అనే పదార్థం తగ్గిపోతుంది. కాబట్టి ఎప్పుడూ.. వెల్లుల్లిని పచ్చిగా తీసుకోవాలి.

అయితే వెల్లుల్లి కాస్త నలగొట్టి తీసుకుంటే. అల్లిసిన్ ని పొందవచ్చు. దంచిన తర్వాత 15 నిమిషాలు ఆగి తీసుకుంటే.. మరింత ఎక్కువ అల్లిసిన్ పదార్థాన్ని పొందవచ్చు. ఈ అల్లిసిన్ పదార్థం ద్వారానే వెల్లుల్లిలోని పోషకాలన్నీ పొందవచ్చు.

తేనెలో హెల్తీ గ్లిసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది.. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తేనెలో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్స్, ఎంజైమ్స్, మినరల్స్, జింక్, ఐరన్, పొటాషియం, క్యాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, సెలీనియం ఉంటుంది. ఇవన్నీ శరీరానికి ముఖ్యమైన పోషకాలు.

హైకొలెస్ట్రాల్

హైకొలెస్ట్రాల్

తేనెలో విటమిన్ బి6, థియామిన్, రైబోఫ్లేవిన్, నియాసిన్ కూడా ఉంటాయి. ఈ విటమిన్స్, మినరల్స్ అన్నీ.. హై కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేసే శక్తిని కలిగి ఉంటాయి. పచ్చి వెల్లుల్లి.. పవర్ ఫుల్ మెడిసిన్. ఈ రెండింటి మిశ్రమాన్ని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల.. కొలెస్ట్రాల్ ని తేలికగా కంట్రోల్ చేయవచ్చు.

ఇమ్యునిటీ

ఇమ్యునిటీ

యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు.. ఇమ్యునిటీని మెరుగుపరచడంలో గ్రేట్ గా సహాయపడతాయి.

వెల్లుల్లి, తేనె మిశ్రమం

వెల్లుల్లి, తేనె మిశ్రమం

3నుంచి 4 వెల్లుల్లి, ఒక కప్పు తేనె, ఒక టైట్ కంటెయినర్ తీసుకోవాలి.

తయారు చేసే విధానం

తయారు చేసే విధానం

ముందుగా వెల్లుల్లి నుంచి రెబ్బలను సపరేట్ చేసుకోవాలి. పొట్టు తీయకుండా... కేవలం పైపొట్టు మాత్రమే తీయాలి. తేనెలో వెల్లుల్లి రెబ్బలు వేసి.. కంటెయినర్ మూత పెట్టి టైట్ గా తిప్పాలి.

రెండ్రోజులు

రెండ్రోజులు

రెండు రోజులపాటు వెల్లుల్లిని తేనెలో బాగా నాననివ్వాలి. ఫ్రిడ్జ్ లో లేదా గది టెంపరేచర్ లోనే పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండాలి.

పరకడుపున

పరకడుపున

ఈ మిశ్రమాన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఏడు రోజులపాటు క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఆహారం తిన్న తర్వాత తీసుకుంటే.. ఆహారంలోని పోషకాలు గ్రహించడం కష్టమవుతుంది.

హైబ్లడ్ ప్రెజర్

హైబ్లడ్ ప్రెజర్

వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని కేవలం వారం రోజులు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల హైబ్లడ్ ప్రెజర్ ని ఎఫెక్టివ్ గా కంట్రోల్ చేయవచ్చు.

హార్ట్ ఎటాక్

హార్ట్ ఎటాక్

వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని తీసుకుంటూ ఉండటం వల్ల హార్ట్ ఎటాక్ రిస్క్ ని అరికట్టవచ్చు. అలాగే కరోనరీ హార్ట్ డిసీజ్ లకు కూడా దూరంగా ఉండవచ్చు.

ఇన్ఫెక్షన్స్

ఇన్ఫెక్షన్స్

ఫ్లూ, జలుబు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, డయేరియా వంటి సమస్యలను కూడా తేలికగా నివాస్తుంది.

కీళ్ల నొప్పులు

కీళ్ల నొప్పులు

వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే.. కీళ్ల నొప్పుల నుంచి కూడా.. తేలికగా ఉపశమనం పొందవచ్చు.

డయాబెటీస్

డయాబెటీస్

తేనెను పంచదార బదులు ఉపయోగించాలని సూచిస్తుంటారు. ఇది డయాబెటిక్స్ కి బాగా సహాయపడుతుంది. కాబట్టి ఇందులో వెల్లుల్లి కలిపి తీసుకుంటే.. డయాబెటిస్ ని ఎఫెక్టివ్ గా కంట్రోల్ చేయవచ్చు.

టాక్సిన్స్

టాక్సిన్స్

వెల్లుల్లిని పచ్చిగా తీసుకోవడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి.. దీన్ని తేనెలో కలిపి తీసుకోవడం వల్ల టేస్టీగా కూడా ఉంటుంది. అలాగే మిశ్రమం శరీరంలో మలినాలను బయటకు పంపి.. హెల్తీగా ఉండటానికి సహాయపడుతుంది.

English summary

What happens to your body if you Eat Honey & Garlic for One Week ?

What happens to your body if you Eat Honey & Garlic for One Week ? We have shared with you many news for garlic and honey including their numerous health benefits and this time we’ll show you what happens if you eat this health boosting combination for 7 days.
Desktop Bottom Promotion