For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టీ తాగుతున్నారా ? ఐతే బ్లడ్ గ్రూప్ ని బట్టి ఫ్లేవర్ ఎంచుకోండి..

|

బ్లడ్(రక్తం) మీద ఇప్పటి వరకూ వివిధ రకాల పరిశోధనలు జరిపి ఏ బ్లడ్ గ్రూప్ వారు ఎలాంటి స్వభావం కలిగి ఉంటారు? ఏఏ బ్లడ్ గ్రూప్ వారు ఎలాంటి , బ్లడ్ గ్రూప్ ను బట్టి ఎలాంటి ఆహారంను తీసుకోవాలని వివిధ రకాల పరిశోధనలు జరిపి నిర్ధారించారు. బ్లడ్ గ్రూప్ ను బట్టి ఆహారాలు పానీయాల మీద పరిశోధనలు జరపడానికి ముఖ్య కారణం ఇవి బ్లడ్ గ్రూప్ మీద ఏవిధంగా ప్రభావం చూపుతాయి మరియు బ్లడ్ గ్రూప్ ను బట్టి మన ఆరోగ్యాన్ని నిర్ణయించడంలో ముఖ్య పాత్రను వహిస్తుంది.

మీ క్యారెక్టర్ కి, మీ బ్లడ్ టైప్ కి సంబంధమేంటి ?

సాధారణంగా మనుష్యుల్లో వారివారి బ్లడ్ గ్రూప్ ను బట్టి హెల్త్ రిస్క్ ఫ్యాక్టర్స్ ను కనుగొనడం జరిగింది . ఉదాహరణకు, 'ఏ బ్లడ్ గ్రూప్'ఉన్నవారు ఎక్కువగా బ్యాక్టీరియల్ మరియు వైరల్ ఇన్ఫెక్షన్స్ కు త్వరగా గురి అవుతుంటారు. అదే విధంగా, 'ఓ'బ్లడ్ గ్రూప్ ఉన్నవారు అల్సర్ , 'ఏబి' మరియు 'బి'బ్లడ్ గ్రూప్ ఉన్నవారు అధిక బరువు పెరిగే రిస్క్ లో ఉన్నట్లు పరిశోధనల ద్వారా కనుగొన్నారు. ఇదివరకూ మనం ఎలాంటి ఫుడ్స్ ను తింటే ఏ బ్లడ్ గ్రూప్ వారు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు, అలాగే తినడకుండా ఆరోగ్యాన్ని ఏవిధంగా కాపాడుకోగలరన్న విషయాన్ని ఇదివరికే తెలుసుకున్నాము.

వ్యాధులు నివారణకు మీ బ్లడ్ గ్రూపును బట్టి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి..

మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బ్లడ్ గ్రూప్ ను బట్టి 'టీ'లు ద్వారా కూడా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చన్న విషయాన్ని పరిశోధనలు ద్వారా నిర్ధారించడం జరిగింది. ఎందుకంటే టీలో వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇవి వ్యాధులను నివారించి, బ్లడ్ గ్రూప్ ను బట్టి ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. మరి మీ బ్లడ్ గ్రూప్ ను బట్టి ఎలాంటి టీ త్రాగవచ్చో చూద్దాం...

1. బ్లడ్ గ్రూప్ ఎ:

1. బ్లడ్ గ్రూప్ ఎ:

బ్లడ్ గ్రూప్ ఎ ఉన్న వారు ఎక్కువ స్ట్రెస్ కు గురి అవుతుంటారు . వీరు చాలా సున్నితమనస్కులు. కాబట్టి, వీరిలో స్ట్రెస్ వల్ల వివిధ రకాల అనారోగ్యసమస్యలకు గురికావల్సి వస్తుంది. అందువల్ల, స్ట్రెస్ ను తగ్గించే ఫుడ్స్ మరియు డ్రింక్స్ ను తీసుకోవాలి . దాంతో వారు మరింత బెటర్ గా ఫీలవ్వడంతో పాటు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోగలరు.

2. ‘ఎ’బ్లడ్ గ్రూప్ వారు తీసుకోవల్సిన టీ:

2. ‘ఎ’బ్లడ్ గ్రూప్ వారు తీసుకోవల్సిన టీ:

ఏ బ్లడ్ గ్రూప్ వారు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి గ్రీన్ టీ, మ్యారిగోల్డ్ టీ, థైమ్ టీ మరియు జాస్మిన్ టీ తీసుకోవచ్చు . ఈ రకమైన టీలు బ్లడ్ గ్రూప్ ఏ' వారిని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఒత్తిడి తగ్గిస్తుంది. ఎఫెక్టివ్ గా విశ్రాంతి కలిగిస్తుంది .

3. ‘బి’బ్లడ్ గ్రూప్:

3. ‘బి’బ్లడ్ గ్రూప్:

బి'బ్లడ్ గ్రూప్ ఉన్న వారు, సులభంగా బరువు పెరుగుతుంటారు. ఇలాంటి వారు చాలా ఆలస్యంగా బరువు తగ్గుతారు. ఈ బ్లడ్ గ్రూప్ వారిలో మెటబాలిజం రేట్ తక్కువగా ఉండి, చాలా త్వరగా అలసిపోతుంటారు . వీరు ఎప్పుడు అలసట మరియు విశ్రాంతి లేకుండుట, నిద్రలేమి సమస్యలని ఫిర్యాదు చేస్తుంటారు.

4. బి’బ్లడ్ గ్రూప్ వారికి బెస్ట్ టీ:

4. బి’బ్లడ్ గ్రూప్ వారికి బెస్ట్ టీ:

‘బి' బ్లడ్ గ్రూప్ ఉన్నవారు ఖచ్చితంగా లెమన్ బామ్ టీ, సేజ్ టీ, ఎల్డర్ బెర్రీ టీ, రూయ్ బోస్ టీ, రెడ్ టీ మరియు గ్రీన్ టీ తీసుకోవచ్చు. ఈ టీలు వీరిలో మెటబాలిక్ లెవల్స్ ను పెంచి అలసట నుండి ఉపశమనం కలిగించి, రాత్రుల్లో ప్రశాంతమైన నిద్రకు సహకరిస్తాయి.

5. ‘ఎబి’బ్లడ్ గ్రూప్:

5. ‘ఎబి’బ్లడ్ గ్రూప్:

ఈ బ్లడ్ గ్రూప్ వారు చాలా స్పష్టమైనవారుగా ఉంటారు. అలాగే వీరు ఒత్తిడిని హ్యాండిల్ చేయగలరు. కానీ వీరు లో సెక్స్ డ్రైవ్ కలిగి ఉంటారు. అందువల్ల వీరు కాఫీకి దూరంగా ఉండటం మంచిది. కాఫీకి ప్రత్యామ్నాయంగా టీ తీసుకోవచ్చు.

6. ‘ఏబి’ బ్లడ్ గ్రూప్ తీసుకోగలిగిన బెస్ట్ ‘టీ’లు:

6. ‘ఏబి’ బ్లడ్ గ్రూప్ తీసుకోగలిగిన బెస్ట్ ‘టీ’లు:

ఏబి బ్లడ్ గ్రూప్ వారు పుదీనా టీ, క్రాన్ బెర్రీ టీ, ల్యావెండర్ టీ, గ్రీన్ టీ మరియు ఎల్లో టీని ఖచ్చితంగా త్రాగాలి . ఈ టీలు, ఏబి బ్లడ్ గ్రూప్ వారిలో లిబిడో(కామేచ్ఛ)ను పెంచుతుంది . రిలాక్స్ గా మరియు రిఫ్రెష్ గా మార్చుతుంది.

7. ‘ఓ’ బ్లడ్ గ్రూప్:

7. ‘ఓ’ బ్లడ్ గ్రూప్:

ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు ఎసిడిటి మరియు అజీర్తి సమస్యలను కలిగి ఉంటుంది. ఓ బ్లడ్ గ్రూప్ కలిగిన వారు ఒత్తిడిని తగ్గించుకోగలరు . వీరు కాఫీకి ప్రత్యామ్నాయంగా టీని తీసుకోవచ్చు.

8. ‘ఓ’బ్లడ్ గ్రూప్ వారు తీసుకోవల్సిన బెస్ట్ టీలు:

8. ‘ఓ’బ్లడ్ గ్రూప్ వారు తీసుకోవల్సిన బెస్ట్ టీలు:

ఓబ్లడ్ గ్రూప్ ఉన్న వారు అల్లం టీ, జెన్సింగ్ హేర్బల్ టీ, ఎర్బా మెట్ టీ మరియు గ్రీన్ టీ తీసుకోవాలి . ఈ రకమైన టీలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి మరియు గ్యాస్ట్రిక్ సమస్యను నివారిస్తాయి.

English summary

Which Tea Is Good For You As Per Your Blood Group

Many studies have been made on the foods and drinks that a person with a particular blood group type must have. Our blood group plays an important role in determining our health.People have some health risk factors associated with them, depending on their blood group type. For example, people with blood group A have more risk of getting infected with bacterial and viral infections.
Desktop Bottom Promotion