For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వరల్డ్ అల్జైమర్స్ డే: మతిమరుపు నివారించే 7 హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్

|

ఈ రోజు అంటే సెప్టెంబర్ 21 ప్రపంచ అల్జైమర్ డే. ఒక వయస్సు దాటాక మతిమరుపు రావడం అనేది సహజం. వృద్ధాప్యంలో వచ్చే అల్జైమర్స్ వ్యాప్తి ఇటీవల బాగా పెరిగింది. దాంతో అల్జైమర్స్ రోగుల సంఖ్య కూడా పెరుగుతోంది. గతంలో కంటే ఇప్పుడు ఆయు:ప్రమాణాలు పెరగడంతో వృద్ధుల సంఖ్య కూడా పెరుగుతోంది. దాంతో అల్జైమర్స్ బారీన పడే వారి సంఖ్య ఆందోళ కలిగిస్తోంది. అల్జైమర్స్ అంటే అదేదో మతిమరపు వ్యాధి మాత్రమేనని చాలా మంది అనుకుంటారు. కానీ దీని తీవ్రత అంత కంటే ఎక్కువే. నేడు వరల్డ్ అల్జైమర్స్ యాక్షన్ డే సందర్భంగా అల్జైమర్స్ వ్యాధిపై అవగాహన కల్పించడం కోసమే ఈ ఆర్టికల్ .

మనందరం ఏదో ఒక విషయాన్ని మరిచిపోతుంటాం. ఇలా మరిచిపోవడం వల్ల కలిగే నష్టం తాత్కాలికంగా ఇబ్బంది కలిగించినా దాని వల్ల మన రోజువారీ పనులకు ఏ మాత్రం ఆటంకం ఉండదు. కాస్త వయస్సు పైబడ్డ తర్వాత మతిమరుపు వచ్చిందనుకోండి. దానివల్ల కొన్ని నష్టాలున్నా జీవితం పెద్దగా అస్తవ్యస్తం కాదు. కానీ అల్జైమర్స్ అలా కాదు. మరుపు, మతిమరుపునకు తారాస్థాయిగా అల్జైమర్స్ ను పేర్కొనవచ్చును.

అల్జైమర్స్ కు ఒక చిన్న ఉదాహరణ చూద్దాం.. ఐదు నిముషాల క్రితం అక్కడే ఉంచిన తాళాలు ఎక్కడుంటాయో తల బాదుకున్నా ఒక్కోసారి గుర్తురావు. ఫ్రిజ్‌దాకా వెళ్లి ఎందుకోసం వచ్చామో ఎంతకీ తట్టదు. మళ్లీ వంటగదిలోకి వెళ్లగానే గుర్తొస్తుంది. ఫలానా స్నేహితురాలు ఫోన్‌చేసినపుడు ఫలానా విషయం చెబుదామని అనుకుంటాం. ఆ విషయం ఫోన్‌ పెట్టిన తరువాత గుర్తొస్తుంది. అలాగని అన్నీ మర్చిపోతామా అంటే లేదు. చిన్ననాటి సంగతులన్నీ పూసగుచ్చినట్లు చెప్పమంటే రెడీ! ఫలానా పండుగరోజు ఏం చేశామన్నది టీకా, తాత్పర్యాలతో సహా గుర్తే! మరి వయసుతో వచ్చే ఈ మతిమరుపును చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే అధిగమించొచ్చు.

ఎందుకిలా జరుగుతుంది? అల్జైమర్స్ రోగుల్లో మెదడు క్రమంగా కుచించుకుపోతుంది. దాంతో మెదడుకణాలు క్రమంగా నశించిపోతాయి. అయితే ఎందుకిలా జరుగుతుందన్న అంశంపై ఇప్పటికీ పూర్తి స్పష్టత లేదు. ఈ విషయంపై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే దీనికి కారణం పర్యావవరణ అంశాలతో పాటు, జన్యుపరమైన కారణాలు తలకు గాయాలవ్వడం వల్ల, అనుకోని సంఘటలను వల్ల మెదడు మీద ఎక్కువ ఒత్తిడికి గురి అవ్వడం కూడా ఈ వ్యాధికి దోహదపడుతున్నాయంటున్నారు నిపుణులు.

అల్జైమర్స్ వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే దాన్ని నయం చేయలేము. కానీ మతిమరుపు రాకుండా మాత్రం ముందు జాగ్రత్తలతో నివారించుకోవచ్చు. అందుకు బోలెడు మెడికేషన్స్ ఇతర ట్రీట్మెంట్ ఉన్నాయి. అయితే , మతిమరుపు నివారించుకోవడానికి నేచురల్ పద్దతిలో హెల్తీ ఫుడ్స్ ను ఫాలో అవ్వడం మంచి మార్గం. ఈ ఆల్జైమర్స్ రోజున మతిమరుపు నివారించుకోవడానికి 7ఫుడ్ హ్యాబిటిస్ ను పరిచయం చేస్తున్నాము. ఇవి గ్రేట్ గా సహాయపడుతాయి.

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్:

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్:

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో విటమిన్ ఎ మరియు విటమిన్ సిలు అత్యధికంగా ఉన్నాయి. వీటిలో న్యూట్రీషియన్స్ బ్రెయిన్ హెల్త్ కు గ్రేట్ గా సహాయపడుతాయి . ముఖ్యంగా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో ఆకుకూరలు, బ్రొకోలీ, బీన్స్, మరియు ఇతర గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ డైలీ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఆల్జైమర్స్ కు గురి కాకుండా నివారించుకోవచ్చు.

ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ :

ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ :

సాల్మన్, తున మరియు ఇతర ఫిష్ ఆయిల్స్ లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి . వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇది బీటా అమిలాయిడ్స్ ప్లాక్స్ ను తగ్గిస్తుంది. దాంతో ఆల్జైమర్స్ వ్యాధిని నివారించుకోవచ్చు.

ఫ్రైడ్ అండ్ ప్రొసెస్డ్ ఫుడ్స్ నివారించాలి:

ఫ్రైడ్ అండ్ ప్రొసెస్డ్ ఫుడ్స్ నివారించాలి:

డీఫ్ ఫ్రై మరియు ప్రొసెస్ చేసిన ఫుడ్స్ ను నివారించాలి. ఇవి బ్రెయిన్ ఇన్ఫ్లమేషన్ కు గురిచేస్తుంది. బరస్ట్ అయిన ఫ్రీరాడికల్స్ మెదడు మరియు మెదడు పనితీరు మీద ప్రభావం చూపుతుంది. ఈ ఆహారాలల్లో హైడ్రోజెనేటెడ్ ఆయిల్స్ ఉండట వల్ల ఇది బ్రెయిన్ కు హాని కలిగిస్తుంది. కాబట్టి, వీటికి దూరంగా ఉండటం మంచిది.

ఫ్లాక్స్ సీడ్స్ :

ఫ్లాక్స్ సీడ్స్ :

ఫ్లాక్స్ సీడ్స్ లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. బ్రెయిన్ లో బీటా అమిలాయిడ్ ఫ్లాక్స్ ఏర్పడకుండా చేయడం వల్ల ఆల్జైమర్స్ వ్యాధిని నివారించుకోవచ్చని కొన్ని పరిశోధనల్లో నిర్ధారించారు.

స్వీట్స్ మరియు పంచదారతో తయారుచేసిన ఆహారాలను మానుకోవాలి:

స్వీట్స్ మరియు పంచదారతో తయారుచేసిన ఆహారాలను మానుకోవాలి:

ఎక్కువ స్వీట్స్, షుగర్స్ తినడం వల్ల బ్రెయిన్ ఇన్ఫ్లమేషన్ కు గురి అవుతుంది. షుగర్ లో ఉండే కార్బోహైడ్రేట్స్ బ్లడ్ షుగర్ లెవల్స్ ను పెంచుతుంది. ఇవి బ్రెయిన్ డ్యామేజ్ కు మరియు ఆల్జైమర్స్ కు కారణమవుతుంది. కాబట్టి, మతి మరుపు నివారించుకోవాలంటే షుగర్ ఫుడ్స్ తినడం మానేయాలి.

 పండ్లు ఎక్కువ తినాలి:

పండ్లు ఎక్కువ తినాలి:

యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండే ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే వీటిలో విటమిన్స్, క్యాల్షియం, ఐరన్ , జింక్, మొదలగు న్యూట్రీసియన్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇవి మెమరీ పవర్ ను పెంచుతాయి. వయస్సైనప్పుడు మతిమరుపు నివారించుకోవాలంటే ఇప్పటి నుండి రెగ్యులర్ డైట్ లో పండ్లను ఎక్కువగా చేర్చుకోవాలి.

నట్స్ :

నట్స్ :

బ్రెయిన్ హెల్త్ కు బూస్ట్ వంటివి నట్స్. ఎందుకంటే వీటిలో ఫ్యాట్స్, ఫైబర్ మరియు ఇతర యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరచడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. దాంతో ఆల్జైమర్స్ రిస్క్ ను నివారిస్తుంది.

English summary

World Alzheimer's Day: 7 Healthy Food Habits That Help Prevent Alzheimer's

World Alzheimer's Day: 7 Healthy Food Habits That Help Prevent Alzheimer's,If you are finding difficulty in remembering dates, names and people, then you need to watch it out carefully. It could be the initial signs of Alzheimer's. Well, for a condition like this, there are certain food habits which people co
Story first published: Wednesday, September 21, 2016, 13:06 [IST]
Desktop Bottom Promotion