సైన‌స్ త‌ల‌నొప్పి త‌గ్గించేందుకు 10 ఉత్త‌మ ఆహారాలు!

Posted By: sujeeth kumar
Subscribe to Boldsky

సైన‌స్ త‌ల‌నొప్పి విప‌రీతంగా బాధిస్తున్న‌ట్ట‌యితే మీరేం చేస్తారు? ఆ.. ఏముంది.. దీపాలు ఆర్పేసి ఏదో మాత్ర మింగేసి ప‌డుకుంటాం అంటారా? సైన‌స్ లేదా ముక్కు దిబ్బ‌డ విప‌రీత‌మైన చ‌లి, ఉష్ణోగ్ర‌త‌లో హెచ్చుత‌గ్గుల వ‌ల్ల వ‌స్తుంది.

తీవ్ర‌మైన సైన‌స్ ల‌క్ష‌ణాల వ‌ల్ల అనేక న‌ష్టాలు, క‌ష్టాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. అది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. సైన‌స్ ల‌క్ష‌ణాల‌లో భాగంగా ముక్కు దిబ్బ‌డ‌, త‌ల‌నొప్పి, ద‌గ్గు లాంటివి ఉంటాయి. విటమిన్ ఏ పుష్క‌లంగా ఉండే ఆహార‌ప‌దార్థాల‌ను తిన‌డం ద్వారా రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంపొందించుకోవ‌చ్చు. సైన‌స్‌ను క‌లిగించే క్రిముల‌నుంచి శ‌రీరాన్ని కాపాడుకోవ‌చ్చు.

10 Best Foods Good For Sinus Congestion

కేవ‌లం యాంటిబ‌యాటిక్స్ ను మింగ‌డం వ‌ల్ల అంత‌గా ప్ర‌యోజ‌నం ఉండ‌దు. సైన‌స్‌ను ఎదుర్కొన‌గ‌లిగే ఆహారాన్ని డైట్‌లో భాగం చేసుకోవాలి.

సైనస్ ఇన్ఫెక్షన్ కు సహజ నివారణోపాయాలు

మ‌రి ఆ 10 ఆహార ప‌దార్థాలేమిటో తెలుసుకుందామా....

1. పైనాపిల్‌

1. పైనాపిల్‌

పైనాపిల్ లో యాంటిఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. ముక్కు లో ఉన్న మ్యూక‌స్ మెంబ్రేన్‌ను ర‌క్షిస్తుంది. పైనాపిల్‌లో కొన్ని రకాల ఎంజైమ్‌ల వ‌ల్ల సైనస్ నుంచి సాంత్వ‌న ల‌భిస్తుంది.

2. పుచ్చ‌కాయ‌

2. పుచ్చ‌కాయ‌

సైన‌స్ త‌ల‌నొప్పితో బాధ‌ప‌డుతున్న‌ట్ట‌యితే ... పుచ్చ‌కాయ తిన‌డం మేలు. దీంట్లో అవ‌స‌రమైన మిన‌ర‌ల్స్ ఉంటాయి. ఇందులోని మెగ్నీషియం త‌ల‌నొప్పిని నివారించే గుణ‌ముంది.

3. అల్లం

3. అల్లం

అల్లంలో యాంటీయాక్సిడెంట్లు ఉంటాయి. దీంతోపాటు యాంటీ ఇన్‌ఫ్ల‌మేట‌రీ ల‌క్ష‌ణాల వ‌ల్ల నొప్పి త‌గ్గించ‌గ‌ల‌గుతుంది. అదేవిధంగా సులువుగా జీర్ణ‌మ‌య్యేలా అల్లం దోహ‌ద‌ప‌డుతుంది.

సైనస్ చికిత్సకై వెల్లుల్లి ఎలా వాడాలి?

4. ముల్లంగి

4. ముల్లంగి

ముల్లండి ఇన్‌ప్ల‌మేష‌న్‌ను త‌గ్గించి మ్యూక‌స్ ఉత్ప‌త్తిని పెంచుతుంది. దీనికి మంచి యాంటి బ‌యాటిక్ ల‌క్ష‌నాలు ఉన్నాయి. అవి త‌ల‌నొప్పిని ఇట్టే మాయం చేసేయ‌గ‌ల‌దు.

5. వేడి వేడి సూప్‌

5. వేడి వేడి సూప్‌

చికెన్ లేదా వెజిటెబుల్ సూప్ సైనస్ త‌ల‌నొప్పి నివార‌ణ‌కు బాగా ప‌నిచేస్తుంది. వేడి వేడి సూప్ తాగ‌డం వ‌ల్ల మ్యూక‌స్ సుల‌భంగా క‌దిలి సైన‌స్‌ను క్లియ‌ర్ చేస్తుంది.

6. యాపిల్ సిడార్ వెనిగ‌ర్‌

6. యాపిల్ సిడార్ వెనిగ‌ర్‌

ఇదో అద్భుత‌మైన స‌హ‌జ గుణాలు క‌లిగిన ప‌దార్థం. సైన‌స్ త‌ల‌నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం క‌లిగించ‌గ‌ల‌దు.

7. కేయాన్ పెప్పర్

7. కేయాన్ పెప్పర్

కేయాన్ పెప్పర్ యాంటీ బ్యాక్టిరియ‌ల్‌, యాంటీ ఇన్ఫ్ల‌మేట‌రీ గుణాలు ఉంటాయి. మ్యూక‌స్ బ్లాక్ అయితే ఇవి దాన్ని నివారించ‌గ‌లుగుతుంది.

8. వెల్లుల్లి

8. వెల్లుల్లి

వెల్లుల్లిలో అల్లిసిన్ అనే ప‌దార్థం ఉంటుంది. ఇది సైన‌స్‌తో బాధ‌ప‌డేవారికి ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తుంది. అందుకే కాస్త వెల్లుల్లి తింటే త‌ల‌నొప్పి, ముక్కుదిబ్బ‌డ మ‌టుమాయం అవుతుంది.

9. నిమ్మ‌జాతి పండ్లు

9. నిమ్మ‌జాతి పండ్లు

సంత్రాలు, నిమ్మ‌కాయ‌లు, ద్రాక్ష‌ల్లో విట‌మిన్ సి పుష్క‌లంగా ఉంటుంది. ఇవి సైన‌స్ ను స‌మ‌ర్థంగా ఎదుర్కొంటాయి.

10. ఉల్లి

10. ఉల్లి

ఉల్లికి ఘాటైన వాస‌న ఉంటుంది. దీంట్లో యాంటీ హిస్ట‌మైన్ ల‌క్ష‌ణాలు ఉంటాయి. అవి సైన‌స్ కంజెష‌న్‌ను త‌గ్గించ‌గ‌ల‌వు.

English summary

10 Best Foods Good For Sinus Congestion

Sinus occurs when the mucus membranes are damaged or the mucus becomes too thick to move freely. There are certain foods which you can add in your daily diet that will help to prevent sinus congestion and will clear up the pathway.