ఎట్టిపరిస్థితిలో నిర్లక్ష్యంచేయకూడాని క్యాన్సర్ యొక్క ప్రారంభ సంకేతాలు

Posted By: Lekhaka
Subscribe to Boldsky

క్యాన్సర్ ఒక ప్రాణాంతక వ్యాధి. క్యాన్సర్ వ్యాధి లక్షణాలు అంత త్వరగా భయటపడవు. కానీ అతి తక్కువ లక్షణాలు మాత్రమే గుర్గించగలరు . క్యాన్సర్ లక్షణాలను ప్రారంభ దశలో గుర్గించి వెంటనే తగిన జాగ్రత్తలు, ట్రీట్మెంట్ తీసుకోవాలి.

క్యాన్సర్ లక్షణాలను నిర్లక్ష్యం చేయడం వల్ల క్యాన్సర్ లక్షణాలు మరింత ప్రాణాంతక ప్రమాధంగా ఏర్పడుతాయి. కాబట్టి, అలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఈ క్రింది లక్షణాల్లో ఏ ఒక్క లక్షణం కనిపించినా వెంటనే చెక్ చేయించుకోవాలి.

క్యాన్సర్ యొక్క ప్రారంభ లక్షణాలను గుర్తించినట్లైతే ట్రీట్మెంట్ సులభమౌతుంది. ఈ లక్షణాలు మరియు సంకేతాలను గుర్తించినప్పుడు శరీరంలో ఏదో మార్పు జరుగుతున్నట్లు గుర్తించాలి. కాబట్టి, క్యాన్సర్ కు ప్రారంభ దశలో కొన్ని వార్నింగ్ సంకేతాలను ఈ క్రింది విధంగా తెలపడం జరిగింది.

సూపర్ ఫుడ్స్ : క్యాన్సర్ తో పోరాడుతాయి మరియు నివారిస్తాయి

క్యాన్సర్ ప్రారంభ దశలో గుర్తించదగ్గ కొన్ని ప్రారంభ లక్షణాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్యాన్సర్ కణాల ఉత్పత్తి అయిన ప్రదేశంలో వాటికి దగ్గరగా ఉన్న అవయవాలు, రక్త కణాలు, నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది.

ఆ ప్రెజర్ వల్ల క్యాన్సర్ కు ప్రారంభ సంకేతాలను సూచిస్తుంది. మరి క్యాన్సర్ ప్రారంభదశలో క్యాన్సర్ లక్షణాలు లేదా సంకేతాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం..

 చర్మం లోపల గడ్డలు :

చర్మం లోపల గడ్డలు :

బ్రెస్ట్ టిష్యుల క్రింద కణుతులు ఏర్పడుతాయి. వీటిని సెల్ష్ ఎక్జామినేషన్ (స్వయంగా, చేతుల స్పర్శతో తెలుసుకోవచ్చు). చాతీలో మార్పులు గమనించినప్పుడు వెంటనే డాక్టర్ ను కలవాలి.

చర్మంలో దురద:

చర్మంలో దురద:

శరీరంలో క్యాన్సర్ కణతులున్నప్పుడు క్యాన్సర్ కు సంబంధించిన బ్యాక్టీరియా విస్తరిస్తున్నప్పుడు శరీరంలో వ్యాధినిరోధక శక్తితో పోరాడుతుంది. ఆ సమయంలో రక్తప్రసరణ పెరుగుతుంది. దాంతో ఆ ప్రదేశంలో వెచ్చగా , దురద కలిగిస్తుంది.

గాయాలు మానవు :

గాయాలు మానవు :

చర్మం మీద ఏదైనా గాయం అయినప్పుడు, లేదా తెగినప్పుడు ఎక్కువ రోజులు ఆ గాయం మానకపోవడం వంటి లక్షణం కూడా శరీరంలో క్యాన్సర్ పెరుగుతోందనడానికిసంకేతం. ఇదికూడా క్యాన్సర్ కు ప్రారంభ సంకేతాల్లో ఒకటి.

నోరు లేదా నాలుక మీద కణుతులు లేదా బొడిపెలు:

నోరు లేదా నాలుక మీద కణుతులు లేదా బొడిపెలు:

నోరు లేదా గొంతు బాగంలో వైట్ కలర్ కణతులు గుర్తించినట్లైతే వెంటనే డాక్టర్ ను కలవాలి. క్యాన్సర్ లక్షణాలు ఇది ఒకటి. ఈ లక్షణాన్ని చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు .

 మ్రింగడానికి ఇబ్బందిగా ఫీలవుతారు లేదా ఆకలి ఉండదు:

మ్రింగడానికి ఇబ్బందిగా ఫీలవుతారు లేదా ఆకలి ఉండదు:

ఆహారం తినడానికి ఇబ్బంది పడుతుంటే , జీర్ణ వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం ఉంటుంది. కాబట్టి, వెంటనే డాక్టర్ ను సంప్రదించడం చాలా అవసరం. శరీరానికి తగిన న్యూట్రీషియన్స్, ప్రోటీన్స్ అందకపోవడం వల్ల క్యాన్సర్ లక్షణాల్లో ప్రారంభ లక్షణంగా సూచిస్తుంది.

బౌల్ మూమెంట్ లో మార్పులు :

బౌల్ మూమెంట్ లో మార్పులు :

బౌల్ మూమెంట్ లో మార్పులు , మూత్రం, మలవిసర్జనలో రక్తం కనబడటం వంటి సంకేతాలు బ్లడ్ క్యాన్సర్ కు సంకేతాలు .

యూరిన్ లో మార్పులు :

యూరిన్ లో మార్పులు :

బ్లాడర్ ఫంక్షన్ లో మార్పులు, బ్లాడర్ సరిగా పనిచేయకపోవడం , యూరిన్ లో మార్పులు, వాసన, మూత్రం రంగు బూడిదవర్ణంలో మారడం వంటి లక్షణాలన్ని కూడా క్యాన్సర్ సంకేతాలలో ఒకటి.

బ్లీడింగ్ :

బ్లీడింగ్ :

ఊహించని రీతిలో రక్త స్రావం..యూట్రస్ లో , నిప్పల్స్ లేదా శరీరంలో వేరే ఏ ఇతర భాగాల్లో సెడెన్ గా రక్తస్రావం అవ్వడం.

వాయిస్ లో మార్పు:

వాయిస్ లో మార్పు:

లారెనిక్స్ క్యాన్సర్ కారణంగా పిట్చ్ లేదా వాయిస్ టోన్ లో మార్పులు కనబడితే వెంటనే డాక్టర్ సంప్రధించాలి.

తరచూ దగ్గుతుండటం:

తరచూ దగ్గుతుండటం:

గొంతు, లంగ్స్, ఈసోఫోగస్, స్టొమక్ క్యాన్సర్ ఉన్నట్లైతే తరచూ దగ్గుతుండటం. దగ్గినప్పుడు ఎక్కువ నొప్పి ఉండటం లేదా దగ్గుతో పాటు రక్తం పడటం వంటి సంకేతాలు కనబడితే వెంటనే చికిత్స తీసుకోవాలి.

English summary

10 Early Warning Signs Of Cancer That Most People Ignore

10 Early Warning Signs Of Cancer That Most People Ignore, You need to be aware of the early warning signs of cancer before it is too late. Read this article to know more about it.
Subscribe Newsletter