For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కళ్ళు మంటలు, వాపు తగ్గించే 10 ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ..!!

కళ్ళ చాలా సెన్సిటివ్ అవయవం కాబట్టి, ఏ మాత్రం ఇన్ఫ్లమేషన్ ఉన్నా కళ్ళు దురద, సోర్ నెస్ వంటి లక్షణాలు కనబడుతాయి. ఇన్ఫ్లమేషన్ దుమ్ము, ధూళి, నిద్రలేమి వల్ల కళ్ళు మంటలుగా అగుపించవచ్చు.

|

ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో కొన్ని విషయాలు, పనులు సర్వసాధారణంగా మారిపోయాయి. అందులో ఆఫీసులో పని ఒత్తిడి.. కళ్ళకు కంప్యూటర్‌ల వల్ల శ్రమ తప్పదు. ఆఫీసు ముగిసిన తర్వాత ఇంటీకి వచ్చిరాగానే ఇక ఫ్రెండ్స్‌తో చాటింగ్. అప్పుడు కూడా కళ్ళకు రెస్ట్‌ వుండదు. ఇవి పూర్తి కాగానే నిద్రపోదాం అని అనుకుంటూనే సమయమే తెలియకుండా టి.విని చూడటం మొదలు పెడతాం. ఇలా చేస్తే కళ్ళ ఆరోగ్యం ఏమవుతుంది? ఆలోచించరు.

కంటికి సంబంధించి ఏమైనా సమస్య వస్తే అప్పుడు ఇబ్బంది పడతారు. టీవీల ముందు, కంప్యూటర్ల ముందు గంటల తరబడీ గడపటం వల్ల క్రమంగా కంటికి సంబంధించిన సమస్యల బారిన పడతారు. సరైన నిద్రలేకపోవడంతో కళ్ళ కింద నల్లటి చారలు, కంటి చూపు తేడాగా వుండటం మరియు మందగించడం వంటివి సమస్యలు ఎదుర్కోవాలి. అంతే కాదు, కంటి సమస్యల్లో చూపు సరిగా కనబడకపోవడం, కళ్ళకు అలర్జీ కలగడం జరుగుతుంటాయి. కళ్ళకు అలర్జీ కలిగినప్పుడు కండ్ల కలక మరియు డ్రై ఐ సిండ్రోమ్ వంటి వంటి సమస్యలకు కారణం కావచ్చు.

కళ్ళ చాలా సెన్సిటివ్ అవయవం కాబట్టి, ఏ మాత్రం ఇన్ఫ్లమేషన్ ఉన్నా కళ్ళు దురద, సోర్ నెస్ వంటి లక్షణాలు కనబడుతాయి. ఇన్ఫ్లమేషన్ దుమ్ము, ధూళి, నిద్రలేమి వల్ల కళ్ళు మంటలుగా అగుపించవచ్చు. ఇన్ఫ్లమేషన్ చాలా నొప్పిగా ఉంటుంది. చీకాకు కలిగిస్తుంది. చివరికి కళ్ళు ఎర్రగా మారుతాయి. కళ్ళ ఇన్ఫ్లమేషన్ నుండి ఉపశమనం కలిగించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.

కీరదోసకాయ:

కీరదోసకాయ:

కీరదోసకాయలో కూలింగ్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. కీరదోసకాయను స్లైస్ గా కట్ చేసి, 2 గంటలు ఫ్రిజ్ లో పెట్టాలి.చల్లగా మారిన తరవ్ాత కళ్ళ మీద పెట్టి కొద్ది సేపు రిలాక్స్ అవ్వాలి. లేదా కీరదోసకాయను పేస్ట్ చేసి, అందులో రసం తీసి, కాటన్ ను డిప్ చేసి కళ్ళ మీద కొద్దిసేపు ఉంచాలి. ఇలా చేయడం వల్ల కళ్ళ మంటలు తగ్గుతాయి. కళ్ళ ఉబ్బును కూడా తగ్గిస్తాయి.

బంగాళదుంపలు:

బంగాళదుంపలు:

బంగాళదుంపలో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇవి కళ్ళ ఉబ్బును చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తాయి. పొటాటోను స్లైస్ గా కట్ చేసి ఫ్రిజ్ లో పెట్టాలి. ఒక గంట తర్వాత బయటకు తీసి కళ్ళ మీద పెట్టుకోవాలి. ఇది కళ్ళ ఉబ్బును, దురదను తగ్గిస్తుంది. చీకాకు తగ్గిస్తుంది. అలాగే ఫ్రెష్ గా తయారుచేసిన బంగాళదుంప రసంలో కాట్ డిప్ చేసి కళ్ళ మీద ప్లేస్ చేసి, రిలాక్స్ అవ్వాలి.

అలోవెర:

అలోవెర:

అలోవెరలో మెడిసినల్ లక్షణాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉన్నాయి. ఇవి కళ్ళకు చాలా మేలు చేస్తాయి. కలబంద ఆకు నుండి ఫ్రెజ్ గా జెల్ ను వేరుచేసుకుని, ఫ్రిజ్ లో పెట్టాలి. కొద్దిసేపటి తర్వాత బయటకు తీసుకి కళ్ళకు అప్లై చేయాలి. ఇది ఐ ఇన్ఫ్లమేషన్ ను చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. అలాగే జెల్లో కొద్దిగా కాటన్ డిప్ చేసి, కళ్ళ మీద ప్లేస్ చేయాలి. కళ్ళ ఉబ్బు ఎఫెక్టివ్ గా తగ్గించుకోవచ్చు.

సాల్ట్ వాటర్ :

సాల్ట్ వాటర్ :

కళ్ళ ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో సాల్ట్ వాటర్ గ్రేట్ గా సహాయపడుతాయి. గోరువెచ్చని నీళ్ళు తీసుకుని, అందులో ఉప్పు మిక్స్ చేయాలి. అందులో క్లీన్ క్లాత్ లేదా కాటన్ డిప్ చేసి, కళ్ళ మీద అప్లై చేయాలి. 20నుండి 20 నిముషాల వరకూ ఉండనిచ్చి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కాను రిపీట్ చేయడం వల్ల ఇన్ఫ్లమేషన్ ను క్రమంగా తగ్గించుకోవచ్చు.

స్ట్రాబెర్రీస్ :

స్ట్రాబెర్రీస్ :

స్ట్రాబెర్రీస్ లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇది ఐ ఇన్ఫ్లమేసన్ తగ్గించడంలో గొప్పగా సహాయపడుతుంది. ఫ్రెష్ గా ఉండే స్ట్రాబెర్రీలను స్లైస్ గా కట్ చేసి, ఫ్రిజ్ లో 2 గంటలు పాటు పెట్టాలి. తర్వాత బయటకు తీసి కళ్ళ మీద పెట్టుకోవాలి. 15 నిముషాలు పెట్టుకోవాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఫ్రెష్ గా ఉండే స్ట్రాబెర్రీ జ్యూస్ ను రోజుకు రెండు సార్లు తాగితే కళ్ళ ఆరోగ్ాయినకి మంచిది.

కోల్డ్ వాటర్ :

కోల్డ్ వాటర్ :

చల్లటి నీళ్లు కళ్ల ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో గ్రేట్ హోం రెమెడీ. చల్లటి నీళ్ళతో ముఖాన్ని రోజుకు రెండు మూడు సార్లు శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇది కళ్ళ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. కాటన్ క్లాత్ ను చల్లటి నీటిలో డిప్ చేసి కళ్ళ మీద అప్లై చేయాలి. ఇది కళ్ళ ఇరిటేషన్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడతుంది.

ధనియాలు:

ధనియాలు:

ధనియాల్లో ఔషధగుణాలు అధికంగా ఉన్నాయి. కళ్ళ ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో ఇది గ్రేట్ గా సమాయడపుతుంది. ఈ ధనియాలు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ ధనియాలను వేసి మిక్స్ చేయాలి. రాత్రంతా అలాగే ఉండనిచ్చి, మరుసటి రోజు ఉదయం వడగట్టి తాగాలి.. అలాగే ఈ వాటర్ ను పసరేట్ గా తీసుకుని, కాటన్ క్లాత్ ను డిప్ చేసి కళ్ళమీద ప్లేస్ చేయడం వల్ల కూడా కళ్ళ మంటలు తగ్గించుకోవచ్చు.

టీ బ్యాగ్స్ :

టీ బ్యాగ్స్ :

ఐఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో టీ బ్యాగ్స్ గ్రేట్ గా సహాయపడుతుంది. టీ బ్యాగ్స్ ను వేడినీటిలో డిప్ చేయాలి. ఒక బౌల్లో లిక్విడ్ ను సపరేట్ గా తీసుకోవాలి. అందులో కాటన్ ప్యాడ్స్ డిప్ చేసి కళ్ళ మీద పెట్టుకోవాలి. లేదా వేడినీటిలో డిప్ అయిన టీబ్యాగ్స్ ను నేరుగా కళ్ళ మీద పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల కళ్ల ఇన్ఫ్లమేషన్ తో పాటు, వాపు కూడా తగ్గుతుంది.

ఎగ్ వైట్ :

ఎగ్ వైట్ :

కళ్ళ మంటలు, కళ్ళ వాపును తగ్గించడంలో ఎగ్ వైట్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఎగ్ వైట్ ను సపరేట్ బౌల్లో తీసుకుని అందులో కొన్ని చుక్కల తేనె మిక్స్ చేయాలి. తర్వాత దీన్ని కళ్ళమీద అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత నార్మల్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కొద్ది సేపటి తర్వాత నార్మల్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి.

పసుపు:

పసుపు:

పసుపులో యాంటీ సెప్టిక్, మరియు యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. పసుపులో కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసి, కళ్ళ చుట్టూ ఈ ప్యాక్ ను అప్లై చేయాలి. అరగంట తర్వాత ప్యాక్ డ్రైగా మారిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

English summary

10 Effective Home Remedies for Eye Inflammation,

Eyes are vital sensory organs in the body. Any inflammation can cause itching and soneness in the eyes. This inflammation can be very painful or may cause irritation resulting in redness of eyes.
Desktop Bottom Promotion