For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాత్రుల్లో చెమటలు ఎక్కువ పడుతున్నాయా? ఐతే వెంటనే డాక్టర్ కలవండి!

|

ప్రతి ఒక్కరి శరీరంలో స్వేదగ్రంధులు ఉంటాయి. వీటి ద్వారా ప్రతి ఒక్కరిలో చెమటలు పట్టడం సహాజం. అయితే ఒక్కొక్కరిలో ఒక్కోవిధంగా ఉంటుంది. అందరిలో ఒక విధంగా చెమటలు పట్టవు. పగట పూట ఉష్ణోగ్రతలో కారణంగా చెమటలు పట్టడం సహజం. అయితే రాత్రి పూట ఎలాంటి శ్రమ లేకండా చెమటలు పడితే అనారోగ్య సమస్యలను సూచిస్తుంది.

కొన్ని సందర్బాల్లో రాత్రుల్లో చెమటలు పట్టినా, ముఖంలో ఫ్రెష్ లుక్ కనిపిస్తుంది. కొంత మందిలో చెడు కలలు వస్తున్నా రాత్రుల్లో చెమటలు అధికంగా పడుతుంటాయి. రాత్రుల్లో చెమటలు ఎక్కువగా పడుతుంటే అందుకు వివిధ రకాల కారణాలుంటాయి.

Reasons Why You Are Sweating At Night

రాత్రుల్లో నిద్రకు అంతరాయం కలిగిస్తూ రోజు మిడ్ నైట్లో చెమటలు పడుతున్నాయా? విశ్రాంతి లేకున్నా చేస్తున్నదా? నైట్ స్వెట్ ను తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఏదో అనారోగ్యానికి చిహ్నంగా గుర్తించాలి. ముఖ్యంగా మోనోపాజ్ లక్షణాలలో అత్యంత ముఖ్యమైన లక్షణం ఇది. నైట్ స్వెట్ కు మరో పేరు హైపర్ హైడ్రోసిస్. నిద్రించేటప్పుడు ఎక్కువ చెమటలు పట్టడం.

మద్యరాత్రిలో చెమటలతో నిద్రలేవడం వల్ల హాపీ ఫీలింగ్ ఉండదు మరియు చికాకు కలిగిస్తూ...అసౌకర్యానికి గురిచేస్తుంది. ఇది మెడికల్ ప్రాబ్లెమ్ కాకపోయినా మహిళల్లో ఇలాంటి లక్షణాలను మోనోపాజ్ ను సూచిస్తాయి. నైట్ స్వెట్ చాల మందిలో చూస్తుంటాము. మద్యరాత్రిలో చెమటతో తడిచిన జుట్టు, బెడ్ షీట్స్ తేమగా ఉండటం గమనిస్తుంటారు. రూమ్ టెంపరేచర్ నార్మల్ గా ఉన్నా.,.ఇలా రాత్రుల్లో చెమటలు పట్టడం మోనోపాజ్ ప్రధానకారణం అవుతుంది .

మహిళల్లో బ్రెయిల్ లో నోరాడ్రినలలిన్ లేదా సెరోటినిన్ లెవల్స్ తక్కువగా ఉండటం వల్ల హాట్ ఫ్లాషెస్ మరియు నైట్ స్వెట్స్ అధికంగా ఉంటుంది. ఇంకా వేడిగా ఉన్న వాతావరణం కూడా అధిక చెమటలకు దారితీస్తుంది. ఇంకా మహిళల్లో హార్మోన్ డిజార్డర్స్, న్యూరాజికల్ సమస్యలు, హైపో గ్లిసిమియా వంటి కారణాల వల్ల కూడా రాత్రుల్లో చెమటలు అధికంగా పట్టవచ్చు. రాత్రుల్లో చెమటల పట్టడానికి మరొకిన్ని కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..

ఇన్ఫెక్షన్స్

ఇన్ఫెక్షన్స్

శరీరంలో కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది. ఉదాహరణకు లంగ్ ఇన్ఫెక్షన్ (ఫ్ప్యూమోనియల లేదా ట్యుబర్క్యులోసిస్) లేదా మలేరియా వంటి ఇన్ఫెక్షన్స్ తో శరీరం పోరాడే సమంయలో శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. రాత్రుల్లో చెమటలు ఫ్రీక్వెంట్ గా పడుతుంటే అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నట్లు గుర్తించాలి. చెమటలు అధికంగా ఉన్నట్లై వెంటనే డాక్టర్ ను సంప్రదించండి.

మోనోపాజ్

మోనోపాజ్

మహిళల్లో మోనోపాజ్ దశలో వేడి వల్ల చెమటలు అధికంగా పడుతాయి. మోనోపాజ్ దశలో ఉన్న మహిళల్లో రాత్రుల్లో చెమటలు అధికంగా పడుతాయి.

70 శాతం కంటె ఎక్కువగా మోనోపాజ్ మహిళల్లో చెమటలు అధికంగా పడుతాయి.

క్యాన్సర్

క్యాన్సర్

లివర్ లేదా బోన్ క్యాన్సర్ కు ప్రారంభ సంకేతం. రాత్రుల్లో చెమటలు పట్టడానికి ముఖ్యమైన కారణం లింపోమా..

ఇంకా లుకేమియా కూడా నైట్ స్వెట్ కు కారణమవుతుంది. అదే విధంగా చెమటలు కార్సినాయిడ్ ట్యూమర్స్, అడ్రినల్ ట్యూమర్స్ కు కారణమవుతుంది. మన శరీరంలో చెమటలు పట్టడం సాధారణం. కానీ ఇలా నైట్ స్వెట్ కు లింపోమా సంకేతం కావచ్చు. క్యాన్సర్ కణుతులు లిప్స్ సెల్స్ లో డెవలప్ కావచ్చు. చాలా మంది లింపోమా పేషంట్స్ లో రాత్రుల్లో చెమటలు అధికంగా పడుతున్నట్లు గుర్తించారు. వీరిలో సెడన్ గా బరువు తగ్గడం లేదా ఫీవర్ వంటి లక్షణాలు కూడా కనబడుతాయి

ఓవర్ ట్రైనింగ్

ఓవర్ ట్రైనింగ్

నార్మల్ ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉన్నప్పుడు వర్కౌట్స్ ఎక్కువగా చేయడం వల్ల రాత్రుల్లో చెమటలు పడుతాయి. ఇది ఓవర్ ట్రైనింగ్ కు సంకేతంగా చెప్పవచ్చు.

ఐడియోపతిక్ హైపర్ హిడిరోసిస్

ఐడియోపతిక్ హైపర్ హిడిరోసిస్

ఐడియోపతిక్ హైపర్ హిడిరోసిస్ కండీషన్ వల్ల కూడా శరీరంలో చెమటలు అధికంగా పడుతాయి. మెడికల్ కండీషన్ ను అంత సులభంగా గుర్తించలేము. పగలు కంటే రాత్రుల్లో వీరిలో చెమటలు అధికంగా పడుతాయి . ఎలాంటి రీజన్స్ లేకుండానే చెమటలు పడుతుంటాయి.

హార్మోన్ డిజార్డర్స్

హార్మోన్ డిజార్డర్స్

హార్మోన్ డిజార్డర్ కారణంగా చెమటలు అధికంగా పడుతాయి. ఫియోడ్రోమోసైటోచల మరియు కార్సినాయిడ్ సిండ్రోమ్ (ట్యూమర్స్ కు కారణమయ్యే హార్మోన్స్) అధికంగా ఉత్పత్తి చేస్తాయి .

ఈ హాట్ ఫ్లాషెస్ వల్ల ఈస్ట్రోజెన్ లెవల్స్ పెరుగుతాయి. అలాగే మహిళల్లో హైపోథాలమస్ ఎఫెక్ట్ కూడా అధికంగా ఉంటుంది. హైపోథాలమస్ బ్రెయిన్ కు సంబంధించినది. ఇది ఆకలి, నిద్ర, శరీర ఉష్ణోగ్రతలు హార్మోన్స్ ను ప్రభావితం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో నార్మల్ ఈస్ట్రోజెన్ లెవల్స్ నేచురల్ గా తగ్గిస్తుంది

హైపో గ్లికామియా

హైపో గ్లికామియా

హైపో గ్లికామియా బ్లడ్ షుగర్ చెమటలకు కారణమవుతుంది. హైపో గ్లుకామియా కారణంగో మద్యరాత్రుల్లో నిద్రలేవడం, తలనొప్పి విపరీతంగా ఉండటం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో రాత్రుల్లో స్వెట్ అధికంగా ఉంటుంది.

పురుషుల్లో టెస్టోస్టెరాన్ లెవల్స్ తక్కువగా ఉండటం

పురుషుల్లో టెస్టోస్టెరాన్ లెవల్స్ తక్కువగా ఉండటం

పురుషుల్లో కూడా రాత్రుల్లో అధికంగా చెమటలు పడుతుంటాయి. అందుకు కారణం కొంత మంది మహిళల్లో లో లెవల్ టెస్టోస్టెరాన్ కారణమవుతుంది. పురుషుల్లో టెస్టోస్టెరాన్ ముఖ్యమైన హార్మోన్ .

పురుషుల్లో ఈ హార్మోన్ స్మెర్మ్ ను ఉత్పత్తి చేస్తుంది. లైంగిక శక్తిని పెంచుతుంది. ఇంకా మజిల్, బోన్ మాస్ ను బిల్డ్ చేస్తుంది. నైట్ స్వెట్ ను ఫేస్ చేసేప్పుడు , టెస్టోస్టెరాన్ లెవల్స్ చాలా తక్కువగా ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.

హెచ్ఐవి/ఎయిడ్స్

హెచ్ఐవి/ఎయిడ్స్

హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ కు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల 10 సంవత్సరాల తర్వాత ఎయిడ్స్ ను సూచిస్తుంది. ఎయిడ్స్ కు గురైన వ్యక్తిలో వ్యాధినిరోధక శక్తి పూర్తిగా డ్యామేజ్ అవుతుంది. హెచ్ఐవి లో రాత్రుల్లో చెమటలు పట్టడం, డయోరియా, స్కిన్ రాషెస్, అలసట, నాలుక రుచి కోల్పోవడం వంటి లక్షణాలను సూచిస్తుంది.

న్యూరోలాజికల్ కండీషన్స్

న్యూరోలాజికల్ కండీషన్స్

న్యూరాలజికల్ డిజార్డర్స్ బ్రెయిన్ మరియు నాడీవ్యవస్థ మీద తీవ్ర దుష్ప్రభావాన్ని సూచిస్తుంది. వెన్నెముకలో గాయాలైనప్పుడు , నాడీవ్యవస్థ పనిచేయనప్పుడు, బ్రెయిన్ డిజార్డర్స్ కారణంగా హైపర్ హైడ్రోసిప్ లేదా ఎక్ససివ్ స్వెట్టింగ్ ఉంటుంది. న్యూరాలజికల్ కండీషన్ లో స్ట్రోక్, అటనామిక్ డిస్స్రెఫ్లెక్సియా మరియు అటానమిక్ న్యూరోపతి నైట్ స్వెట్ కు కారణమవుతుంది.

English summary

10 Reasons Why You Are Sweating At Night

Everybody sweats; yet there is always a difference in the way people sweat, as it can't be the same for everyone. Are you dripping in sweat every night? There are a few people who experience sweating while at sleep. Sometimes, people do wake up with a flushed look on their face and are completely covered in perspiration either due to a haunting nightmare or terrified from a bad dream.
Story first published: Saturday, June 10, 2017, 18:22 [IST]
Desktop Bottom Promotion