ఈ 10 పనులను మహిళలు శృంగారానికి ముందు యోని తో అస్సలు చేయకూడదు

By: :R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

ప్రతి ఒక్కరు శృంగారం అనే ప్రేమ యుద్ధం లో మధురమైన అనుభూతిని పొందాలని భావిస్తారు. అందుకోసం రకరకాలుగా సన్నద్ధం అవుతుంటారు. కొన్ని కొన్ని సార్లు శృంగారాన్ని రక్తి కట్టించడానికి, తమ జీవిత భాగస్వామిని విపరీతంగా సంతృప్తి పరచాలనే ఉద్దేశంతో అవసరానికి మించి తాపత్రయ పడుతుంటారు. అందు కోసం కొన్ని కొత్త ప్రయోగాలను చేస్తుంటారు స్త్రీలు.

 ఈ 10 పనులను మహిళలు శృంగారానికి ముందు యోని తో అస్సలు చేయకూడదు

ఆ ప్రయత్నం లో భాగంగా స్త్రీలు చేసే పనుల వల్ల కొన్నిసార్లు వాళ్ళ యోని పై ప్రతికూల ప్రభావం చూపే ఆస్కారం ఉంది. అప్పుడు మీరు పడక గదిలో చేయాలనుకున్న తియ్యటి యుద్ధం, మొదలు కాకముందే చేదు గా మారే అవకాశం ఉంది. శృంగారం లో మధురానుభూతిని పొందాలి అనే మీ ప్రయత్నం విఫలం కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్క స్త్రీ తన యోని భాగం పై శ్రద్ధ వహించి, శృంగారానికి ముందు యోని తో ఈ క్రింద చెప్పబడిన ప్రయోగాలను మాత్రం అస్సలు చేయొద్దని సూచిస్తున్నారు నిపుణులు.

"ల్యూబ్" ని అస్సలు వాడకండి :

యోని లోపలికి పురుషాంగం సులువుగా వెళ్ళడానికి వాడే ఒక ద్రవ పదార్థాన్ని "ల్యూబ్" అంటారు. ల్యూబ్ ని శృంగారం లో ఎక్కువగా వాడకండి. రతి క్రీడ సమయం లో, యోని లో ద్రవాలు కొద్దిగా విడుదలయినప్పటికీ కూడా ల్యూబ్ ని తరచూ వాడేస్తున్నారు. అలా వాడటం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు వైద్యులు, ఎందుకంటే దాని వల్ల శృంగారం లోని మజాను కోల్పోతారు. మీ జీవిత భాగస్వామిని మొదట పురుషాంగాన్ని యోని లోకి మెల్ల మెల్లగా చొప్పించే ప్రయత్నం చేయమని చెప్పండి. అలా చేయటం ద్వారా మీ సంభోగం మొదట కొద్దిగా కష్టం అనిపించినా తరువాత సాఫీగా సాగుతుంది. అలా మెల్లగా మొదలైన మీ శృంగార ప్రయాణం చివరికి స్వర్గపుటంచులను చేరుకుంటుంది. కాబట్టి, అనవసరంగా ల్యూబ్ వాడి ఆ ఆనందాన్ని దూరం చేసుకోకండి.

అక్కడ వంట నూనె ను వాడొచ్చా, వాడకూడదా :

అక్కడ వంట నూనె ను వాడొచ్చా, వాడకూడదా :

చాలా మంది ల్యూబ్ కి బదులుగా శృంగార సమయం లో అంగ ప్రవేశం సాఫీగా జరగటానికి ఇంట్లో ఉన్న నూనెలను (వంట నూనె,కొబ్బరి నూనె ) వాడేస్తుంటారు. ఇది శృంగార శాస్త్రం గురించి జ్ఞానం లేని అజ్ఞానులు చేసే పని అని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే ఇలా చేయటం ద్వారా ఎన్నో సమస్యలు తలెత్తుతాయట. మన ఇంట్లో వాడే నూనెలు వాటి సహజ స్వభావం వలన చాలా మందంగా ఉంటాయట. ఆ నూనెలను సంభోగ సమయం లో అంగ ప్రవేశానికి వాడటం వల్ల కొన్ని అనుకోని అవాంతరాలు ఎదురయి మనకు నష్టం కలిగించే ఆస్కారం ఉందంట. రతి క్రీడ సమయం లో విపరీతమైన శృంగార ప్రక్రియ లో స్త్రీ పురుషులు మునిగిపోయి ఉన్నపుడు ఈ మందమైన నూనె లు వాడటం మూలాన ఆ రాపిడి వల్ల కండోమ్ చిరిగిపోయే ప్రమాదం ఉంది. అంతే కాకుండా శృంగారం అయిపోయిన తరువాత ఆ నూనెను యోని నుండి వదిలించుకోవడం కూడా అంత సులువు కాదు. దీని వల్ల రకరకాల యోని సంబంధిత వ్యాధులు సంక్రమించే అవకాశాలు ఎక్కువ.

యోని ని శృంగారానికి ముందు శుభ్రం చేయటం :

యోని ని శృంగారానికి ముందు శుభ్రం చేయటం :

శృంగారానికి సిద్ధం అయ్యే సమయం లో చాలా మంది స్త్రీలు యోని శుభ్రత పేరుతో మార్కెట్ లో దొరికే వివిధ రకాల వాష్ లు మొదలైన వాటితో లేదా నీటితో యోని ని శుభ్రం చేసేస్తుంటారు. కానీ, ఇలా చేయటం మంచి పద్ధతి కాదు అని చెబుతున్నారు. ఎందుకంటే దీనివల్ల యోని పొడి బారి పోతుందంట. కాబట్టి మీరు శృంగారానికి ముందు ఇలా చేయటం వల్ల రతి క్రీడ మొదలు కాకముందే మీలో నైరాశ్యం మొదలయి శృంగారాన్ని సరిగ్గా చేయలేరు. శుభ్రత పేరుతో శృంగారం తరువాత అతిగా యోని ని కడగటం మూలాన ఆ ప్రదేశం పొడి బారి విపరీతమైన మంట తో పాటు, ఏవైనా రోగాలు త్వరగా సోకే ప్రమాదం ఉంది.

యోని కి ఆవిరి చికిత్స చేయటం మంచిదా :

యోని కి ఆవిరి చికిత్స చేయటం మంచిదా :

యోని కి ఆవిరి చికిత్స చేయటం వల్ల యోని లో ద్రవాలు ఊరకుండా ఆ ప్రదేశం మరింత పొడి బారి పోతుంది.ఇందు వల్ల అంగప్రవేశం సమయం లో విపరీతమైన నొప్పి కలుగుతుంది. చాలా మంది ఆవిరి చికిత్స ద్వారా ఆడవాళ్ళ శరీరం లో హార్మోన్లు సమతుల్యతను సాధిస్తాయని, గర్భాశయాన్ని శుద్ధి చేస్తాయని అనుకుంటారు. కానీ అవన్నీ వట్టి మాటలే అంటున్నారు వైద్యులు. ముఖ్యంగా గైనకాలజిస్ట్(స్త్రీ ఆరోగ్య సంబంధిత) వైద్యులు చెప్పేదేంటంటే ఆవిరి చికిత్స వల్ల యోని కి గర్భాశయానికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందంట. కాబట్టి, ఎటువంటి పరిస్థితుల్లో శృంగారినికి ముందు యోని కి ఆవిరి చికిత్స మాత్రం అస్సలు చేయొద్దని సూచిస్తున్నారు.

యోని పై ఉన్న వెంట్రుకల ను తొలగించడం :

యోని పై ఉన్న వెంట్రుకల ను తొలగించడం :

చాలా మంది స్రీలు తమ యోని పై ఉన్న వెంట్రుకలను పెరిగిన వెంటనే షేవ్ లేదా ట్రిమ్ చేసి తొలగిస్తే బాగుంటుందని భావిస్తారు. ఆలా చేయటం తప్పు కాదు కానీ , శృంగారానికి ముందు అలా చేయటం తప్పు.రతి క్రీడకు ముందు అలా చేయటం వల్ల, ఆ ప్రాంతం లో ఉన్నది సున్నితమైన చర్మం కావటం తో స్త్రీలకు ఆ ప్రదేశం లో మంట పుట్టడం వల్ల విపరీతమైన బాధను అనుభవిస్తారు. శృంగారం చేయాలనుకునే ముందు రోజు రాత్రే అక్కడ ఉన్న వెంట్రుకలను తొలగిస్తే మంచిది. అలా కాకుండా శృంగారం చేసే రోజే అక్కడ షేవ్ లేదా ట్రిమ్ చేసుకున్నట్లైతే యోని క్రీం లను యోని పై రాయటం ద్వారా సుఖానుభూతిని పొంది ఆ మంటను దూరం చేసుకోవచ్చు.

యోని పై ఉన్న వెంట్రుకలను తొలగించటానికి క్రీములు వాడొచ్చా ? :

యోని పై ఉన్న వెంట్రుకలను తొలగించటానికి క్రీములు వాడొచ్చా ? :

యోని వెంట్రుకలను తొలగించటానికి ఫేవింగ్ లేదా ట్రిమ్మింగ్ కంటే క్రీములు వాడటం ఉత్తమమైన మార్గం అని భావిస్తే అంత కంటే అవివేకమైన పని ఇంకొకటి ఉండదు.ఎందుకంటే ఆ క్రీములలో రకరకాల రసాయనాలను వాడుతారు. ఇవి అక్కడ వాడటం వల్ల ఆ ప్రాంతం అంతా ఎర్రబడి పోయి గీసుకొనిపోయినట్లు అవుతుంది. అందు వల్ల సంభోగం చేసే సమయం లో స్త్రీలు చిరాకు పడే అవకాశం ఉంది. దీని వల్ల ఆమె భాగస్వామి కూడా చికాకు పడి దాంపత్య జీవితం నాశనం అయ్యే అవకాశాలు ఎక్కువ. కాబట్టి వెంట్రుకలను తొలగించటానికి క్రీములు వాడకపోవడం మంచిది.

యోని ని అలంకరించడం :

యోని ని అలంకరించడం :

ఈ మధ్య కాలం లో చాలా మంది ఫ్యాషన్ పేరుతో ఆధునిక జీవన శైలి లో భాగంగా తన భాగస్వామిని సంతృప్తి పరచాలనే ఉద్దేశంతో రకరకాల రాళ్లను. ముత్యాలను ఇలా ఏవేవో అలంకార సామాగ్రిని వివిధ శస్త్రచికిత్సల ద్వారా యోని పై అమర్చుకుంటున్నారు. ఇలాంటి విపరీత చర్యల వల్ల భవిషత్తులో ఎలాంటి ఉపద్రవాలు ముంచుకొస్తాయో చెప్పడం కష్టం అంటున్నారు నిపుణులు.

 యోని నుండి సువాసనలు వెదజల్లడానికి :

యోని నుండి సువాసనలు వెదజల్లడానికి :

యోని కి సహజసిద్ధమైన రంగు, రుచి, వాసన ఉన్నాయి. కానీ ఈ మధ్య కాలం లో అంతర్జాలం పుణ్యమా అని యోని పై కూడా రకాల ప్రయోగాలు చేయొచ్చు అనే వార్తలు దర్శనమిస్తున్నాయి. ఉదాహరణకు,మీ వంటింట్లో ఉండే చక్కరె ను రతిక్రీడ కు ముందు యోని పై రుద్దుకోవటం వలన యోని మంచి సువాసనలు వెదజల్లటం తో పాటు, తియ్యగ ఉంటుంది లాంటి తప్పు దోవ పట్టించే వార్తలు, వంటింటి చిట్కాలు, కుప్పలు తెప్పేలుగా ప్రచురితమవుతున్నాయి. ఇలాంటి వార్తలను నమ్మి ,అలాంటి పనులు మాత్రం అస్సలు చేయకండి. అలా చేయటం వల్ల రకరకాల వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉంది.

మంచి కారం కారంగా ఉండే ఆహార పదార్థాలు తినడం:

మంచి కారం కారంగా ఉండే ఆహార పదార్థాలు తినడం:

ఆశ్చర్య పోతున్నారా, ఇది నిజం. కారం కారం గా ఉండే ఆహార పదార్థాలు రతికేళి కి ముందు తినటం వల్ల యోని లోని పీ హెచ్ సమతుల్యత దెబ్బతినటం వల్ల వ్యాధులు సంక్రమించటం తో పాటు విపరీతమై చిరాకు మొదలవుతుంది. దీంతో కామ కోరికలు పెద్దగా కలగవు. సంసార జీవితం దెబ్బతింటుంది.

కాబట్టి సుఖమైనా సంసారంలో భాగంగా మధురమైన రాత్రులను ప్రతి రోజు ఆస్వాదిస్తూ, పైనా చెప్పిన కొన్ని సూచనలు తూచ తప్పకుండా పాటించి ప్రతి రాత్రి ని మొదటి రాత్రి లాగా అనుభవించి ఆనందించండి.

English summary

10 things you should NEVER do to your vagina before sex

Avoid These Things Before Intercourse For A Healthy Vagina, Read more to know about,
Subscribe Newsletter