నూడుల్స్ మన ఆరోగ్యానికి హానికరమని ఈ పదకొండు కారణాలు తెలియచేస్తున్నాయి

Posted By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky
Are noodles good for health

మధ్యకాలంలో నూడుల్స్ కి పిల్లలు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. పిల్లలతో పాటు కొంతమంది పెద్దలు కూడా నూడుల్స్ పై ప్రత్యేక అభిమానాన్ని చాటుకుంటున్నారు. స్నాక్ గా, టిఫిన్ గా అలాగే అర్థరాత్రి ఆకలి తీర్చే ఫుడ్ గా నూడుల్స్ ని మొదటి ఛాయిస్ గా ఎంచుకుంటారు. అయితే, నూడుల్స్ లో అధిక మోతాదులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. వీటిని మన శరీరం చక్కెరగా మార్చుకుంటుంది. అయితే, శరీరంలో నిలువ ఉన్న చక్కెర రాను రానూ కొవ్వుగా మారిపోతుంది.

నూడుల్స్ లో పోషకాలు తక్కువగా ఉండటం వలన కేవలం నూడుల్స్ మీదనే ఆధారపడకూడదు. ఎక్కువగా నూడుల్స్ ని మాత్రమే తీసుకోవడం వలన మెటబాలిక్ సిండ్రోమ్ కి గురయ్యే ప్రమాదం ఉంది. ఆలాగే, శరీరానికి తగిన పోషకాలు కూడా లభించవు.

ఇన్స్టెంట్ నూడుల్స్ అనేవి ఎక్కువ కాలం నిలువ ఉండేందుకు వీటిని ఎక్కువగా ప్రాసెస్ చేస్తారు. నూడుల్స్ లో ఫ్యాట్ కంటెంట్ అధికంగా ఉంటుంది. అలాగే, సోడియం, కేలరీలు కూడా అధికమే. ఇంకా, నూడుల్స్ తయారీలో కృత్రిమ ఫ్లేవర్స్ ను, ప్రిజర్వేటివ్స్ ను అలాగే ఎడిటివ్స్ ను వాడతారు. నూడుల్స్ అనేవి సులభంగా తయారుచేసుకోగలిగిన ఇన్స్టెంట్ డిష్ అయినా వీటి ద్వారా శరీరానికి కలిగే దుష్ప్రభావాలు అనేకం.

నూడుల్స్ , మన ఆరోగ్యానికి హానీకరమైనవని ఈ 1 కారణాలు తెలియచేస్తున్నాయి. వీటిని తెలుసుకుని ఆరోగ్యాన్ని సంరక్షించుకోండి.

1. ప్రోటీన్లతో పాటు ఫైబర్ కంటెంట్ కూడా తక్కువే

1. ప్రోటీన్లతో పాటు ఫైబర్ కంటెంట్ కూడా తక్కువే

నూడుల్స్ అనేవి ప్రొసెస్డ్ ఫుడ్స్ కాబట్టి ఇవి అధిక బరువు సమస్యను కలుగచేస్తాయి. అలాగే, వీటిలో ఫైబర్ తో పాటు ప్రోటీన్ శాతం తక్కువ. అందువల్ల, ఇవి మీ ఆకలిని తీర్చలేవు అలాగే వెయిట్ లాస్ కోసం మీరు వీటిపై ఆధారపడలేరు .

2. మెటబాలిక్ సిండ్రోమ్

2. మెటబాలిక్ సిండ్రోమ్

నూడుల్స్ ని వారానికి కనీసం రెండు సార్లు తీసుకునే మహిళలలో మెటబాలిక్ సిండ్రోమ్ కి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని అలాగే ఈ నూడుల్స్ ని తక్కువగా తీసుకున్నవారిలో అలాగే అస్సలు తీసుకొని మహిళలలో ఈ ప్రమాదం తక్కువని ఒక పరిశోధనలో తేలింది. అందువలన, నూడుల్స్ ని ఎంత వీలయితే అంత అవాయిడ్ చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకున్నవారవుతారు.

3. మైదా

3. మైదా

నూడుల్స్ ని మైదాతో తయారు చేస్తారు. గోధుమలను మిల్లులో పట్టించి, శుద్ధి చేసి, తెల్లబడిన పదార్థాన్ని వెలికి తీస్తే మైదాగా రూపాంతరం చెందుతుంది. మైదా అనేది ఎక్కువగా ప్రాసెస్ చేయబడినందువలన మన ఆరోగ్యానికి మంచిది కాదు. పోషకవిలువలు ఇందులో శూన్యం. రుచిగా ఉందని మైదా నూడుల్స్ ని ఎక్కువగా తీసుకుంటే మన ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టుకున్నవారవుతాము. కేలరీలు లేని ఈ నూడుల్స్ కి దూరంగా ఉండటం మంచిది.

4. చెడు కొవ్వులు

4. చెడు కొవ్వులు

నూడుల్స్ అనేవి అత్యంత ఘోరమైన ప్రొసెస్డ్ ఫుడ్. ఇందులో ట్రాన్స్ ఫ్యాట్ లేదా సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ లు పుష్కలంగా ఉంటాయి. అలాగే, వీటిలో వెజిటబుల్ ఆయిల్ తో పాటు చక్కెర అలాగే చక్కెర పాకం కూడా అధికంగా ఉంటాయి. ఫ్లేవర్ ని పెంచే పదార్థాలతో పాటు మరికొన్ని పదార్థాలకు నూడుల్స్ నిలయంగా మారతాయి. ఇవన్నీ, ఆరోగ్యానికి హానీ కలిగించేవే కాబట్టి నూడుల్స్ ని దూరంగా ఉంచడం మంచిది.

5. నూడుల్స్ లో MSG

5. నూడుల్స్ లో MSG

నూడుల్స్ లో MSG (మోనోసోడియం గ్లుటామేట్) అనే సాధారణ ఫుడ్ అడిటివ్ అనేది ఉంటుంది. ఇది ప్రొసెస్డ్ ఫుడ్స్ లోని ఫ్లేవర్ ని పెంచేందుకు ఉపయోగపడుతుంది. MSGని తీసుకోవడం వలన అధిక రక్తపోటు, తలనొప్పి, వికారంతో పాటు అధిక బరువు సమస్య వేధిస్తుంది.

6. పోషకాహార లోపం

6. పోషకాహార లోపం

ఇన్స్టెంట్ నూడుల్స్ పై ఆధారపడటం వలన మనం పోషకాహార లోపానికి గురవుతాము. నూడుల్స్ ని ఎక్కువగా తీసుకోవడం వలన చాలా మంది శరీరానికి అవసరమయ్యే పోషకాలను అందుకోలేకపోయారు. నూడుల్స్ ని తీసుకోవడం వలన శరీరానికి విటమిన్ ఏ, సీ, డీ, కేల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ లు లభించే శాతం గణనీయంగా తగ్గుతుంది.

7. నూడుల్స్ లో సోడియం కంటెంట్ అధికం

7. నూడుల్స్ లో సోడియం కంటెంట్ అధికం

నూడుల్స్ లో సోడియం అధికంగా ఉంటుంది. అందుచేత, ఎవరైతే సాల్ట్ సెన్సిటివ్ గా ఉంటారో వారిపై నూడుల్స్ చూపించే దుష్ప్రభావాలు అనేకం. అంతే కాదు, సాధారణంగా కూడా, నూడుల్స్ అనేవి రక్తపోటును పెంపొందించడానికి కారణమవుతాయి. అలాగే, గుండెజబ్బులకు దారితీస్తాయి.

8. పోషకాలను గ్రహించే శక్తి నశిస్తుంది

8. పోషకాలను గ్రహించే శక్తి నశిస్తుంది

నూడుల్స్ ను తరచూ తీసుకునే పిల్లలలో మిగతా పోషకాహార పదార్థాల నుంచి పోషకాలను గ్రహించే శక్తి నశిస్తుంది. నూడుల్స్ ని తీసుకున్న తరువాత సాధారణ భోజనం తీసుకున్నా శరీరానికి తగినంత పోషకాలు లభించకపోవటం జరుగుతుంది. శరీరంలో పోషకాలను గ్రహించే శక్తి నశించడమే ఇందుకు కారణం.

9. గర్భస్రావం

9. గర్భస్రావం

గర్భిణీలు ప్రొసెస్డ్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలి. ఇన్స్టెంట్ నూడుల్స్ వంటి ప్రొసెస్డ్ ఫుడ్స్ ని వారు తీసుకుంటే వారి ఆరోగ్యానికి మంచిది కాదు. నూడుల్స్ ని తీసుకునే గర్భిణీలు గర్భస్రావానికి గురయ్యే ప్రమాదం ఎక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుచేత, గర్భంలోని శిశువు అన్నివిధాలా ఆరోగ్యంగా ఉండేందుకు గర్భిణీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇన్స్టెంట్ నూడుల్స్ కి దూరంగా ఉండటం ముఖ్యమైన విషయం.

10. ఒబెసిటీ

10. ఒబెసిటీ

ఇన్స్టెంట్ నూడుల్స్ లో అధిక శాతం సోడియం ఉండటం వీటిని తీసుకుంటే ఒబెసిటీకి గురయ్యే ప్రమాదం ఉంది. అందువలన, శరీరంలోని వాటర్ రిటెన్షన్ సమస్య ఏర్పడుతుంది. రోజూ నూడుల్స్ ని తింటే వేగంగా అధిక బరువు సమస్యకు గురవుతారు.

11. ప్రొపైలెన్ గ్లైకోల్

11. ప్రొపైలెన్ గ్లైకోల్

నూడుల్స్ లో ప్రొపైలెన్ గ్లైకోల్ అనే యాంటీ ఫ్రీజ్ పదార్థం ఉంటుంది. దీని వలన నూడుల్స్ అనేవి తేమకు గురవకుండా పొడిపొడిగా ఉంటాయి. శరీరం, ఈ పదార్థాన్ని త్వరగా గ్రహిస్తుంది. ఈ పదార్థం గుండె, కిడ్నీ అలాగే లివర్ లో పేరుకుంటుంది. తద్వారా, రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తుంది.

ఈ ఆర్టికల్ ని షేర్ చేయండి!

ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ ప్రియమైన వారితోఈ ఆర్టికల్ ని షేర్ చేసుకోండి.

English summary

11 Reasons Why Noodles Are Not Good For Health

Noodles are very low in nutrients and it is advisable to not be eaten as a staple diet. Frequent consumption of noodles is linked to poor diet quality and an increased risk of metabolic syndrome. Though they are inexpensive and easy to prepare, they have adverse effects on health.