For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నేచురల్ గా సైనస్ ను నివారించే 12 ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ..!!

తరచూ మీకు దగ్గు,తుమ్ములు నిరంతరాయంగా వస్తున్నాయా? మీకు మీ అలెర్జీ చికాకు కలిగిస్తున్నదా? తలనొప్పి తీవ్రంగా వేధిస్తోందా? కళ్ల దగ్గర దురదగా ఉందా? ముక్కు ఇరువైపులా ముట్టుకుంటే నొప్పిగా ఉందా? అయితే మీరు..

|

తరచూ మీకు దగ్గు,తుమ్ములు నిరంతరాయంగా వస్తున్నాయా? మీకు మీ అలెర్జీ చికాకు కలిగిస్తున్నదా? తలనొప్పి తీవ్రంగా వేధిస్తోందా? కళ్ల దగ్గర దురదగా ఉందా? ముక్కు ఇరువైపులా ముట్టుకుంటే నొప్పిగా ఉందా? అయితే మీరు సైనసైటిస్‌తో బాధపడుతున్నట్టే. సైనసైటిస్ ఇది ఒక రకమైన ఇన్ఫ్లమేషన్ . ముఖంలో కళ్ళ దగ్గర, ముక్కు పక్క భాగంల్లోని ఎముకలలో ఉండే సన్నని గాలితో నిండే ప్రదేశాన్ని సైనస్ అంటారు. ఈ భాగంలో ఇన్ఫెక్షన్ సోకి వాచి పోవడాన్ని సైనసైటిస్ (Sinusitis) అంటారు.

12 Effective Home Remedies To Combat Sinus Naturally ,

వాతావరణ మార్పులు జరిగినప్పుడు ఈ సమస్య సహజం....
వాతావరణ మార్పులు జరిగినప్పుడల్లా సైనసైటిస్‌ సమస్య మొదలవుతుంది. కొంత మందికి వేసవి కాలంలో వస్తే, మరికొందరికి శీతాకాలంలో వేదించే సమస్య సైనసైటిస్. ఇది 90 శాతం మందిలో కనిపించే సాధారణ సమస్య. దాదాపుగా ప్రతి మనిషి జీవనకాలంలో దీని బారిన పడనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మళ్లీ మళ్లీ వస్తూ దీర్ఘకాలం వేధించే ఈ సమస్యతో కాలం వెళ్లదీస్తున్న వారు చాలా మందే ఉంటారు. ఈ సైనసైటిస్ ఇన్‌ఫెక్షన్ వలన వస్తుంది. వైరస్, బ్యాక్టీరియా వలన కూడా వస్తుంది. ముఖ్యంగా స్టైప్టోకోకస్ నిమోనియా, ఇన్‌ఫ్లుయోన్‌జా వలన వస్తుంది. అన్ని రకాల ఇన్ డోర్ మరియు అవుట్ డోర్ అలర్జీల వల్ల వస్తుంది. కొన్ని సందర్భాల్లో తీసుకునే ఆహారాల వల్ల కూడా సైనస్ వస్తుంది. సర్జరీలు, స్టెరాయిడ్స్, యాంటీబయోటిక్స్ వాడటం వల్ల కూడా సైనస్ కు దారితీస్తుంది.

సైనస్‌ రకాలు: ఈ సమస్యను మూడు విభాగాలుగా చూడవచ్చు. ఒకటి ఎక్యూట్‌. ఇది వస్తే వారం రోజులుంటుంది. రెండోది సబ్‌ఎక్యూట్‌. ఇది నాలుగు నుంచి ఎనిమిది వారాలుంటుంది. మూడోది క్రానిక్‌. ఇది దీర్ఘకాలంపాటు అంటే 8 నుంచి 10 వారాల పైన ఉంటుంది. ఈ సైనసైటిస్‌ వైరస్‌, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ వల్ల వస్తుంది.సెట్రప్టోకాకస్‌, న్యుమోనియా, ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ వల్ల వస్తుంది. ముఖంలో కళ్ల దగ్గర, ముక్కు పక్కభాగంలో ఎముకలలో ఉండే సన్నని గాలితో నిండి ఉండే ప్రదేశాన్ని సైన్‌సలు ఉంటారు. ఈ భాగం ఇన్‌ఫెక్షన్ల మూలంగా వాచిపోవడాన్ని సైనసైటిస్‌ అంటారు.

వ్యాధి లక్షణాల: ఈ సైనసైటిస్ యొక్క ముఖ్య లక్షణాలు ముక్కు మూసుకుపోవడం, తరచూ జలుబు చేయడం, జలుబుతో ఎక్కువ రోజులు బాధపడటం. తలనొప్పి, ఫేషియల్ పెయిన్, ముక్కు కారడం, ముఖంలో వాపు, సైనస్ భాగంలో నొప్పి, ముక్కుదిబ్బడ, ముక్కు దురద, నీరు కారటం, గొంతులోనికి ద్రవం కారటం, గొంతు గరగర, దగ్గు, జలుబు, చెవిలో చీము, కోపం, మానసిక స్థైర్యం కోల్పోవటం, అలసట, విసుగు పనిపై శ్రద్ధ లేకుండటం, హోరు, దగ్గు. మొదలగు సాధరణ లక్షణాలు సైనస్ కు ముఖ్య లక్షణాలు.. వింటర్లో ఈ లక్షణాలు మరీ ఎక్కువగా ఉంటాయి. వింటర్లో వేధించే సైనస్ ను నివారించుకోవడానికి కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ..

ఆవిరి పట్టడం:

ఆవిరి పట్టడం:

వింటర్లో సైనస్ నివారించుకోవడానికి ఆవిరి పట్టడం వల్ల నాజల్ ప్యాసేజ్ క్లియర్ అవుతుంది. మ్యూకస్ పల్చగా మారి శ్వాస ఆడటానికి సహాయపడుతుంది. ప్రొఫిషినల్ స్టీమర్ ఉపయోగించవచ్చు. లేదా ఇంట్లోనే ఒక బౌల్లో నీళ్ళు మరిగించి తలకు బెడ్ షీట్ కవర్ చేసి,ఆవిరి పట్టాలి. మీకు ఇష్టమైతే యూకలిప్టస్ ఆయిల్ జోడించి ఆవరిపడితే వెంటనే ఉపశమనం కలుగుతుంది.

సాల్ట్ వాటర్ :

సాల్ట్ వాటర్ :

సైనస్ ఇన్ఫెక్షన్ నివారించడంలో సాల్ట్ వాటర్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఫిల్టర్ చేసిన నీటిలో కొద్దిగా సాల్ట్ వేయాలి. ఈ సాల్ట్ వాటర్ ను ఒక మట్టి కుండలో సోసి, ఆవిరి పట్టాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

వార్మ్ కంప్రెసర్ :

వార్మ్ కంప్రెసర్ :

గోరువెచ్చని నీటిలో యూకలిప్టస్ ఆయిల్ ను మిక్స్ చేసి, ఆ నీటితో ఆవిరి పట్టడం మంచిది. అలాగే క్లీన్ గా ఉన్న కాటన్ క్లాత్ ను ఈ నీటిలో డిప్ చేసి, ఎక్సెస్ వాటర్ డిప్ చేసి, నాజల్ ప్యాసేజ్ ను కంప్రెస్ చేయాలి. ఈ ఆరోమా వాసన హాట్ వాటర్ ప్రెజర్ వల్ల నాజల్ క్లియర్ అవుతుంది. దాంతో సైనస్ కు సంబంధించిన లక్షణాలన్నీ దూరం అవుతాయి.

గ్రేఫ్ ఫ్రూట్ ఎక్స్ ట్రాక్ట్ :

గ్రేఫ్ ఫ్రూట్ ఎక్స్ ట్రాక్ట్ :

గ్రేప్ ఫ్రూట్ సీడ్స్ డ్రైడ్ ఫ్రూట్ సీడ్స్ నుండి తయారుచేస్తారు. ఇది చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. ఈ గ్రేప్ ఫ్రూట్ ఎక్స్ ట్రాక్ట్ ను వేడి నీటిలో వేసి టీ మాదిరి తయారుచేసుకుని తాగాలి. గ్రేప్ ఫ్రూట్ నేచురల్ ఏజెంట్ మ్యూకస్ ను నివారించడంలో ఇది గ్రేట్ గా సహాయపడుతుంది. నాజల్ ప్యాసేజ్ ను క్లియర్ చేస్తుంది.

టర్మరిక్ రూట్ :

టర్మరిక్ రూట్ :

టర్మరిక్ రూట్ లేదా పసుపు కొమ్ములను పురాతన కాలం నుండి ఇండియన్ ఆయర్వేదిక్ మెడిసిన్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇందులో యాంటీ ఆన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉండటం వల్ల సైనస్ ఇన్ఫెక్షన్ ను గ్రేట్ గా నివారిస్తుంది. పసుపును కొద్దిగా వేడి పాలతో మిక్స్ చేసి, రోజూ రాత్రి పడుకునే ముందు తాగాలి. ఇది ఇన్ఫెక్షన్ మరియు ఇన్ఫ్లమేషన్ తో పోరాడుతుంది. పసుపును సాల్ట్ వాటర్ తో మిక్స్ చేసి గార్గిలింగ్ చేయడం వల్ల గొంతు నొప్పి నివారించబడుతుంది.

అల్లం:

అల్లం:

అల్లం ఇన్ఫ్లమేషన్ తగ్గించడం మాత్రమే కాదు, ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్, వ్యాధినిరోధకతను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. వేడి వేడి జింజర్ టీలో తేనె మిక్స్ చేసి రోజుకు రెండు మూడు సార్లు తాగుతుంటే మంచి ఫలితం ఉంటుంది. మ్యూకస్ పల్చగా మారి, నాజల్ ప్యాసేజ్ ను క్లియర్ చేస్తుంది.

యాపిల్ సైడర్ వెనిగర్ :

యాపిల్ సైడర్ వెనిగర్ :

రెండు టేబుల్ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ ను ఒక గ్లాసు వేడి నీటిలో మిక్స్ చేసి, ఒక రోజుకు రెండు, మూడు సార్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది. దీనికి కొద్దిగా అల్లం చేర్చితే మరింత ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఈ నేచురల్ రెమెడీ, సైనస్ కు సంబంధించిన సమస్యలను ఎఫెక్టివ్ గా నివారిస్తుంది.

విటమిన్ సి :

విటమిన్ సి :

ఆరెంజ్, లెమన్, లైమ్, గ్రేప్స్ వంటివి వింటర్ సీజన్లో విరివిగా అందుబాటులో ఉంటాయి. ఇవి వ్యాధినిరోధకతను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. దాంతో సైనస్ లక్షణాలు కూడా నివారించబడుతాయి. మ్యూకస్ ను క్లియర్ చేస్తుంది. విటమిన్ సి అంధించడంలో ఇది నేచురల్ ఏజెంట్.

ఫార్మినేటెడ్ కోడ్ లివర్ ఆయిల్ :

ఫార్మినేటెడ్ కోడ్ లివర్ ఆయిల్ :

ఫార్మినేటెడ్ కోడ్ లివర్ ఆయిల్లో యాంటీబయోటిక్స్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి, ఈ నూనెను వేడి నీటిలో వేసి ఆవిరి పట్టాలి. అలాగే ఈ నూనెను ముక్కుకు అప్లై చేసి మసాజ్ చేస్తే సైనస్ లక్షణాలు నివారించబడుతాయి.

ఓరిగానో ఆయిల్:

ఓరిగానో ఆయిల్:

ఓరిగానో ఆయిల్లో కూడా యాంటీబయోటిక్స్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి, ఈనూనె వేడి నీటిలో వేసి ఆవిరి పట్టాలి. అలాగే నాజల్ ప్యాసేజ్ కు అప్లై చేసి, మసాజ్ చేయవచ్చు.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

సైనస్‌కు ఉపయోగించే చికిత్సలో ఇది ఒక పురాతన హౌం రెమెడీ. వెల్లుల్లిలో యాంటీబ్యాక్టీరియల్‌, యాంటీఫంగల్‌ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. వెల్లుల్లి రెబ్బలు సైనస్‌ ఇన్ఫెక్షన్‌కు కారణమయ్యే హానికరమైన బ్యాక్టీరియాను తొలగిస్తాయి. వెల్లుల్లిలో ఉండే ఔషధగుణాలు సైనస్‌ ఇన్ఫెక్షన్‌ లక్షణాలను నివారించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. దీన్ని పచ్చిగాగానీ, ఉడికించి లేదా పేస్ట్‌ చేసి అందులో తేనె కలిపి తీసుకోవాలి.

కేయాన్‌ పెప్పర్‌:

కేయాన్‌ పెప్పర్‌:

కొద్దిగా కేయాన్‌ పెప్పర్‌ను ఉపయోగించడం వల్ల సైనస్‌ నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది. కేయాన్‌ పెప్పర్‌లో ఉండే క్యాప్ససిన్‌ సైనస్‌ ఇన్ఫెక్షన్‌ లక్షణాలు నివారించడంలో బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా ముక్కుదిబ్బడను తగ్గించడంలో గొప్పగా సహాయపడుతుంది. వేడినీటిలో కొద్దిగా కేయాన్‌ పెప్పర్‌ వేసి తాగాలి.

English summary

12 Effective Home Remedies To Combat Sinus Naturally

The term sinus infection is used to define the Inflammation or any kind of congestion that takes place in the sinus region.
Story first published: Wednesday, January 4, 2017, 16:45 [IST]
Desktop Bottom Promotion