వామ్మో! ఇలాంటి చికిత్సలు మీరూ ఎప్పుడూ చూసి ఉండరు

Posted By: Y .BHARATH KUMAR REDDY
Subscribe to Boldsky

మీరు ఎప్పుడైనా కప్ప స్మూతీ గురించి విన్నారా? లైంగిక సమస్యలతో బాధపడేవారికి పల్వరైజ్డ్ ఫ్రాగ్ స్మూతీ ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇక ఆస్తమా సమస్యతో బాధపడేవారికోసం ప్రత్యేకమైన ట్రీట్ మెంట్ ఉంది. చేపపిల్లల్ని నేరుగా నోట్లో వేస్తారు. దాదాపుగా ఈ చికిత్స గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసే ఉంటుంది. ఇలా పలురకాల వివిధ రోగాల నివారణకు చేసే పలు చికిత్సలు కాస్త వెరైటీగా ఉంటాయి. జలగల థెరపీ, ఈగ లార్వాలతో థెరపీ వంటివి వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇలాంటి వైద్య చికిత్సలు కూడా ఉన్నాయి. వీటి ద్వారా కూడా చాలామంది రోగాలను తగ్గించుకుంటూ ఉంటారు. వాటి గురించి తెలుసుకుందామా మరి.

1. అస్తమాను తగ్గించడానికి చేప మందు వైద్యం

1. అస్తమాను తగ్గించడానికి చేప మందు వైద్యం

ఆస్తమా అనేది ఊపిరితిత్తులకు కలిగే దీర్ఘకాలిక వ్యాధి. ఊపిరితిత్తులకు గాలి చేరే మార్గం సరిగ్గా లేకపోవడం, కొన్ని సమయాల్లో ఉపిరితిత్తులు ఇన్ఫెక్షనులకు గురికావడం వంటి సమస్యల బారినపడాల్సి వస్తుంది. శ్వాస నాళాలుసన్నగా మారి శ్వాసలో అంతరాయలను ఏర్పడుతాయి. దీంతో శ్వాస తీసుకోటానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. గురకలు, శ్వాసలో ఇబ్బందులు, గొంతులో గాయంగా అనిపించటం, అలసట, ఛాతిలో గడ్డ కట్టినట్టుగా అనిపించటం వంటి సమస్యలు ఏర్పడతాయి. అయితే చేపలతో ఆస్తమా వ్యాధికి చికిత్స చేయడం అందరికి తెలిసిందే. ఈ చికిత్సలో ఒక మందును 2 లేదా 3 ఇంచులు ముర్రెల్ చేపల నోట్లో ప్రవేశపెడతారు. వీటిని నేరుగా నోట్లో ప్రవేశపెడతారు. ఈ రకమైన చేప మందులను వాడటానికి 4 గంటల ముందు ద్రావణాలను గానీ, ఆహారాలను గానీ తినకూడదు. ఈ మందులను వేసుకున్న 2 గంటల వరకు ఎలాంటి ఆహారాలను తినకూడదు. ఈ రకంగా తయారుచేసిన చేప ఔషధాలు మింగటానికి సులభంగా ఉంటాయి. ఇవి శ్వాస గొట్టాలలో ఉండే శ్లేష్మాన్ని, మ్యూకస్ ఆస్తమాను కలుగచేసే కారకాలను తొలగిస్తాయి. అస్తమాను, శ్వాసకోశ సంబంధ సమస్యలను తగ్గించడానికి బ్రతికే ఉన్న చేప నుంచి మందును తీసుకొని అస్తమాతో బాధపడే వారికి అందిస్తారు. నాలుక నుండి 45 రోజులపాటు ఆహారం విషయంలో పత్యం పాటించాలి. 1845లో ఒక హిందూ గురువు నుంచి బతిని గౌడ్ కుటుంబం వారసత్వంగా చేసుకొని ఈ మందును ఆ వ్యాధి గ్రస్తులకు అందిస్తోంది.

2. జలగలతో వైద్యం

2. జలగలతో వైద్యం

శరీరంపై ఉండే దీర్ఘకాలిక గాయాలకు జలగలతో చికిత్స చేస్తారు. దీర్ఘకాలికంగా ఉన్న పుండ్ల ప్రదేశంలో బురద నీటి నుంచి తెచ్చిన జలగలను వదిలి పుండ్లలో పేరుకుపోయి ఉన్న చెడు రక్తాన్ని పీల్పించడం ద్వారా చికిత్స మొదలుపెడతారు. అలా జలగలు చెడు రక్తాన్ని పీల్చివేసిన అనంతరం వైద్యుడు ఆ ప్రదేశాన్ని శుభ్రపరిచి మందుల ద్వారా 10-15 రోజులలో గాయం మానేటట్లు వైద్యం చేస్తారు. ఈ ప్రక్రియలో చికిత్స కోసం జలగలను ఒక రోగికి ఒక్కసారి మాత్రమే వినియోగిస్తారు.

అలాగే మన శరీరంలో రక్తం గడ్డకట్ట ఉండేందుకు రక్తం ఫ్లో సాఫీగా సాగడానికి జలగలను మన శరీరంపై వదులుతారు. జలగలు మన శరీరంలో ఉండే రక్తాన్ని పీల్చేస్తాయి. అయితే కొన్ని పెప్టైడ్స్ వల్ల రక్తం గడ్డ కట్టేలా చేస్తుంది. జలగలతో ఈ వైద్యం చేయడం ద్వారా గాయాలు కూడా తొందరగా నయమవుతాయి. ప్రస్తుతం వైద్యులు ఈ విధానాలను ప్లాస్టిక్ సర్జరీ, మైక్రో సర్జరీలో ఉపయోగిస్తున్నారు.

3. శరీరంపై కప్పలను వదిలే వైద్యం

3. శరీరంపై కప్పలను వదిలే వైద్యం

శరీరంపై కప్పులను వదులుతారు. వాటికి మధ్యమధ్యలో మంటను తాకించడం లేదా ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వడం చేస్తారు. ఇలా చేయడం ద్వారా బాడీలో ఉన్న నొప్పులు, కండరాల బలహీనతలు, ప్రెజర్స్ తొలగుతాయంట. కొందరు హాలీవుడ్ నటులు ఈ వైద్యాన్ని చేయించుకుంటున్నారట. ఇక కొన్ని కప్పలను వైద్యంలో ఔషధంగా వాడుతుంటారు. కప్పల చర్మం, చెవుల వద్ద ఉండే గ్రంధుల నుంచి స్రవించే ద్రవాన్ని, అదేవిధంగా వాటి ఎముకలను, కండరాలను వైద్యంలో ఉపయోగిస్తుంటారు. వీటి వల్ల వివిధ ఇన్‌ఫెక్షన్లు, గుండెజబ్బులు, కేన్సర్లు, వళ్లు నొప్పులతో పాటు.. చివరికీ ఎయిడ్స్‌ కూడా నయమవుతుందని చైనా సంప్రదాయ వైద్యులు పేర్కొన్నారు.

4. డాక్టర్ ఫిష్ వైద్యం

4. డాక్టర్ ఫిష్ వైద్యం

మన శరీరంపై కొందరికి దురదలు లేదా చిన్న గాయమైనా త్వరగా నయం కాదు. అయితే ఒక డాక్టర్ దీనికి చేసే చికిత్స బాగా ఫేమస్ అయ్యింది. గర్ర రూఫ అనే డాక్టర్ కొలనులో, టర్కీ నదులలో ఉండే కొన్ని చేపలను ఉపయోగించి ఈ వైద్యం చేస్తాడు. ఇలా చేపలు మన శరీరాన్ని తాకడం వలన దురదలు, ఎర్రటి మచ్చలు నయం అవుతాయంట. అయితే ఒకప్పుడు ఈ వైద్యం అందుబాటులో ఉన్నా యుఎస్, కెనడాలలో బ్యాన్ చేయడంతో ప్రస్తుతం ఈ వైద్యం చేయడం లేదు.

5. మూత్రంతో వైద్యం

5. మూత్రంతో వైద్యం

వినడానికి ఇది చాలా ఆశ్చర్యంగా ఉన్నా.. ఇలాంటి వైద్యం కూడా ఒకటి ఉంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుందంట. మన శరీరంలో ఉండే బ్యాక్టీరియాలు తొలగిపోవడానికి, ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండటానికి ఎవరి మూత్రం వారు సేవించడం, స్నానానికి ఉపయోగించటం వలన ఆరోగ్యంగా ఉంటారట. మన దేశంలో గోమూత్రాన్ని ఆరోగ్యం బాగా ఉండాలని సేవిస్తారు తెలుసుకదా.

6. మల బ్యాక్టీరియా

6. మల బ్యాక్టీరియా

ఆరోగ్యవంతుడైన వ్యక్తి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి యొక్క మలాన్ని ఆ వ్యక్తి శరీరం నుంచి తీసుకొని ఇతనికి సరఫరా చేస్తారు. ఇలా చేయటం ద్వారా వ్యాధిగ్రస్తుడికి వ్యాధి నయం అవుతుందట. మైక్రోఫ్లోరర్లాను పంపిస్తారు. నార్త్ అమెరికా, యూరప్ లలో ఈ వైద్యాన్ని చేస్తున్నారు.

7. శీతల వైద్యం

7. శీతల వైద్యం

చెడు కణాల పెరుగుదల పునరుత్పత్తి కాకుండా చేస్తూ మంటను తగ్గిస్తుంది. ఎలాంటి నొప్పి కలిగినా నొప్పి త్వరగా నయం అవుతుంది. రక్త నాళాల నిర్మాణం ప్రోత్సహించడానికి, చర్మంపై మొటిమలు,మచ్చలు రాకుండా శరీర సంబంధ వ్యాధులు కలగకుండా చాలా తక్కువ టెంపరేచర్ లో ఈ వైద్యాన్ని అందిస్తారు. తరచుగా ఇలా చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు వైద్యులు.

8. చైనాలో వింత వైద్యం

8. చైనాలో వింత వైద్యం

మన దేశంలో తలనొప్పి వస్తే డాక్టర్ వద్దకు వెళ్తే.. ఓ ట్యాబ్లెట్ ఇస్తారు. కానీ చైనాలో మాత్రం తలనొప్పిగా ఉంటే.. నుదుటపై పొడిచి రక్తాన్ని బయటికి తీస్తారు. సూదితో గుచ్చి రక్తాన్ని ఓ టబ్‌లో పడుతున్నారు. అలా రక్తం పోతే తలనొప్పి పోతుందని వారి నమ్మకం. ఇలా తలనొప్పికి చైనా వైద్యులు చేసే ట్రీట్మెంట్‌ హల్ చల్ చేస్తోంది. ఇలాంటి వైద్య పద్ధతిని దాదాపు 3వేల సంవత్సరాల క్రితం ఈజిప్టులో పాటించేవారని.. 19శతాబ్ధానికి తర్వాత ఈ విధానం కనుమరుగైందని చైనా వైద్యులు చెప్తున్నారు. అయితే ఇది చాలా ప్రమాదకరమైన చికిత్స. అయితే ఆ పద్ధతిని చైనీయులు ఇప్పటికీ పాటిస్తున్నారని.. తలనొప్పికి నుదుటిన గల రక్తకణాల్లోని కొద్ది రక్తం బయటికి వచ్చేస్తే.. తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందన్నారు. అధిక రక్త కణాలు, రక్త కణాల్లో ఐరన్ శాతం ఎక్కువగా ఉండేవారికి ఇలాంటి వైద్య విధానం మంచి ఫలితాన్ని ఇస్తుందని వైద్యులు చెప్తున్నారు. ఈ వైద్యానికి ముందు పేషెంట్ మెడను టవల్‌తో కట్టేస్తారు.

9. పాములతో మసాజ్ చేయడం

9. పాములతో మసాజ్ చేయడం

ఒత్తిడి తగ్గించడానికి,పనిఒత్తిడి ఉపశమనం పొందడానికి, కండరాల బలహీనతను తగ్గించడానికి ఇలల పాములతో మసాజ్ చేస్తారు. ఇండోనేషియా, థాయిలాండ్లలోని మసాజ్ సెంటర్లలో ప్రజలు వారి కస్టమర్లకు నూతన ఉత్తేజాన్ని ఇవ్వడానికి పాములను, కొండచిలువలను ఉపయోగిస్తున్నారు. పాముల్లో విషాన్ని పూర్తిగా తీసివేసిన తర్వాతే వాటిని మసాజుకు ఉపయోగిస్తారు. ఈ పాములు కస్టమర్ల శరీరాలపై ప్రాకడం ద్వారా మర్దనను చేస్తాయి.

10. గర్భంతో ఉన్న గుర్రం యూరిన్ తో చికిత్స

10. గర్భంతో ఉన్న గుర్రం యూరిన్ తో చికిత్స

ప్రేమారిన్ హార్మోన్ ను పెంపొందించేందుకు గర్భంతో ఉన్న గుర్రం యూరిన్ బాగా ఉపయోగపడతుంది. దీన్ని ఎక్కువగా ఆడవారు ఉపయోగిస్తుంటారు. శరీరంపై ఎక్కడైన కాలడంలేదా, దురదగా ఉండడం, యోని లేదా దాని చుట్టు ప్రాంతం పొడిగా ఉంటే దీన్ని ఉపయోగిస్తారు. దీని ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. అయితే దీనివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఇక పురుషులు, మహిళల్లో రొమ్ము క్యాన్సర్ నివారణకు దీన్నిచికిత్సగా ఉపయోగించొచ్చు. పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ నివారణకు కూడా దీన్ని ఉపయోగించొచ్చు.

11. తల్లిపాలతో క్యాన్సర్ నయం

11. తల్లిపాలతో క్యాన్సర్ నయం

శిశువుకు తల్లిపాలను మించిన ఆహారం లేదనే విషయం అందరికీ తెలిసిందే. అలాగే వీటిలో క్యాన్సర్ కు కారణమయ్యే సెల్స్ ను కూడా చంపే శక్తి ఉంటుంది. ఒక పేషెంట్ కడుపులో గడ్డలతో బాధపడేవారంట. అయితే తన కూతురు ఆ సమయంలో తల్లి కావడంతో ఆమె నుంచి తీసిన పాలు తాగారంట. దీంతో అతని సమస్య పూర్తిగా పరిష్కారమైందట. ఈ విషయం ఒక అధ్యయనంలో వెల్లడైంది. తల్లిపాలల్లో ప్రోటీన్లు, విటమిన్లు, కార్బోహైడ్రేట్లు, మినరల్స్‌, కాల్షియం, పొటాషి యం తదితరాలు అవసరమైన మేరకు ఉంటాయి. తల్లి పాలలో ఎలాంటి ఇన్‌ఫెక్షన్లు సోకకుండా ఉండేటవంటి లక్షణాలను కలిగి ఉంటాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణాలుంటాయి.

12. మగ్గాట్ థెరపీ

12. మగ్గాట్ థెరపీ

మగ్గాట్ థెరపీ అనేది బాగానే ప్రాచుర్యం పొందింది. ఈగ లార్వాను ఉపయోగించి ఈ థెరపీ చేస్తారు. వీటిని ఎక్కడైతే దెబ్బలు తగిలాయో ఈ ప్రాంతంలో వదులుతారు. దీంతో అవి అక్కడున్న చెడునంతా తొలగించేందుకు సాయం చేస్తాయి. అయితే అన్ని రకాల గాయాలకు ఈ విధానంలో చికిత్స అందించలేము. గాయాలైన ప్రాంతం పొడిగా ఉంటే మగ్గాట్స్ అక్కడ ఉండలేవు. అయితే ఎక్కువ మంది మగ్గోట్ థెరపీని ఇష్టపడరు.

13. షాక్ ఇస్తూ ట్రీట్ మెంట్ చేస్తారు

13. షాక్ ఇస్తూ ట్రీట్ మెంట్ చేస్తారు

ఒత్తిడిని నుంచి బయటపడటానికి ఈ ట్రీట్ మెంట్ ను ఉపయోగిస్తారు. అలాగే బైపోలార్ దిజార్డర్, కాటటోనియా వంటి వ్యాధులు నయం కావడానికి దీన్ని వాడతారు.1930లో మొదలైన ఈ వైద్యాన్ని ప్రతి సంవత్సరం 10 లక్షలకు పైగా ఇలా ఈ వైద్యాన్ని చేయించుకుంటున్నారు.

English summary

13 weird medical treatments that will shock you!

Have you ever heard of frog smoothie? Yes, pulverized frog smoothie is a popular drink to combat sexual problems (without any science backup). how about swallowing live fish to get rid of asthma? Yes, these bizarre medical treatments from around the world are a reality.Read this one for more such disgusting yet popular medical treatments like leech therapy,maggot therapy (and diseases that aid in getting treated).