ఈ యాంటీ బయోటిక్స్ మీ దగ్గర ఉంటే రోగాలు బలాదూర్

Written By: Bharath
Subscribe to Boldsky

కొన్ని రకాల బ్యాక్టీరియాల నుంచి తట్టుకునే శక్తి మన బాడీకి ఉంటుంది. కొన్నింటి తట్టుకునే కెపాసిటీ ఉండదు. అయితే మనం రెగ్యులర్ గా ఉపయోగించే కొన్ని యాంటీ బయోటిక్ లక్షణాలు కలగి ఉంటాయి. కొన్ని ఆహారాలు, మూలికలు, ద్రావణాలు వంటి వాటిలో యాంటీ బయోటిక్ గుణాలు ఉంటాయి. యాంటీ బయోటిక్ మందులను ఉపయోగించే బదులు వీటిని వాడితే చాలా ప్రయోజనాలుంటాయి.

సహజ సిద్ధ యాంటీ బయోటిక్‌ ల గురించి తెలుసుకుని వాటిని ఉపయోగిస్తే చాలా ప్రయోజనాలుంటాయి. వీటి వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు రావు. మన ఇళ్లలో లభించే కొన్ని యాంటీ బయోటిక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే ఇక్కడ ఇచ్చిన కొన్ని మీకు కొత్తగా అనిపించవచ్చు. అవన్నీ మార్కెట్లో లభిస్తాయి. మీరు వాటి గురించి ఆరా తీస్తే కచ్చితంగా అవి మీకు దొరుకుతాయి. మరి ఆ సహజ యాంటీ బయోటిక్స్ ఏమిటో మీరూ తెలుసుకోండి.

1. వెల్లుల్లి

1. వెల్లుల్లి

వెల్లుల్లి నేచురల్ యాంటీ బయోటిక్ గా చాలా బాగా పని చేస్తుంది. ఇందులో యాంటీబయాటిక్స్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే యాంటిబయోటిక్, యాంటివైరల్, యాంటీ ఫంగల్, యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వెల్లుల్లిని రెగ్యులర్ గా తీసుకుంటే చాలా ప్రయోజనాలుంటాయి.

శరీరంలో రోగనిరోధక శక్తి పెంచడానికి వెల్లుల్లి బాగా ఉపయోగపడుతుంది. మినరల్స్, విటమిన్లు, పోషకాలు కూడా ఇందులో ఉంటాయి.

అందువల్ల బ్యాక్టీరియాతో వెల్లుల్లి బాగా పోరాడగలదు. ఉదయాన్నే పరగడుపున రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని తింటే చాలా మంచిది. మీ ఆహారంలో భాగంగా రోజూ వెల్లుల్లిని తింటూ ఉండండి. కొన్ని వెల్లులి రెబ్బలను తీసుకుని బాగా మెత్తగా చేసి వాటిని టీలో కలుపుకుని తాగుతూ ఉండాలి. మీకు ఎప్పుడైనా జలుబు చేసినట్లయితే పచ్చి వెల్లులి తింటే చాలు.

2. ఒరెగానో ఆయిల్

2. ఒరెగానో ఆయిల్

ఒరేగానో నూనె తీసుకోవడం వల్ల శరీరంలోని పాతోజినిక్ బ్యాక్టీరియాను తరిమేయొచ్చు. ఇది కూడా యాంటీ బయోటిక్ గా బాగా పని చేస్తుంది. ఇందులోని గుణాలు శరీరంలోని బ్యాక్టీరియాను చంపగలవు. అందువల్ల దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండాలి.

3. మనుక హనీ

3. మనుక హనీ

తేనె యాంటీబయాటిక్ గా బాగా పని చేస్తుంది. మనం నిత్యం ఉపయోగించే తేనె కాకుండా మరికొన్ని రకాల తేనెలు కూడా ఉన్నాయి. వాటిలో ఒకటి మనుక తేనె. ఇది చాలా పవర్ ఫుల్ గా పని చేస్తుంది. బ్యాక్టీరియాకు వ్యతిరేకండా పోరాడే గుణాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఈ తేనెను ఎక్కువగా వైద్యానికి ఉపయోగిస్తుంటారు. ఇన్ఫెక్షన్ సోకకుండా, గాయాలు నయంకావడానికి దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. మీరు చక్కెరకు బదులుగా ఈ తేనెను ఉపయోగించొచ్చు. ఇది చాలా రోగాలకు చెక్ పెట్టేందుకు బాగా ఉపయోగపడుతుంది.

4. ఎచినాసియా

4. ఎచినాసియా

ఎచినాసియా టీ చాలా పవర్ ఫుల్ గా పని చేస్తుంది. మీరు ఒక కప్పు ఎచినాసియా టీ తాగితే వెంటనే జలుబు, ఫ్లూ వంటి వాటి నుంచి వెంటనే ఉపశమనం పొందొచ్చు. ఎచినాసియా కూడా మంచి యాంటీబయాటిక్. స్టాఫిలోకోకస్ ఆరియస్ వంటి బ్యాక్టీరియాలను ఎదుర్కోవడంలో ఇది సమర్థవంతంగా పని చేస్తుంది. గాయాలను నయం చేయడానికి, డిఫెట్రియా, బ్లడ్ పాయిజినింగ్ వంటి వాటి నివారణకు ఎచినాసియా బాగా పని చేస్తుంది. ఎచినాసియా టీని రెగ్యులర్ గా తాగితే చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయి.

5. క్యానీ పెప్పర్

5. క్యానీ పెప్పర్

క్యానీ పెప్పర్ కూడా న్యాచురల్ యాంటీబయాటిక్ గా పని చేస్తుంది. ఇది యాంటీ ఫంగల్ గా కూడా పని చేస్తుంది. దీన్ని వంటకాల్లో ఉపయోగిస్తే చాలా మంచిది. ఎక్కువమంది దీన్ని ఉపయోగిస్తుంటారు. గొంతులో గరగరా వంటికి వాటిని నివారించడానికి క్యానీ పెప్పర్ బాగా పని చేస్తుంది.

6. గ్రేప్ ఫ్రూట్ సీడ్స్ రసం

6. గ్రేప్ ఫ్రూట్ సీడ్స్ రసం

గ్రేప్ ఫ్రూట్ సీడ్స్ రసం కూడా మంచి యాంటీబయాటిక్ గా పని చేస్తుంది. గ్రేప్ ఫ్రూట్ విత్తానాల నుంచి తయ్యారయ్యే దీన్ని (జీఎస్ ఈ) అని కూడా పిలుస్తుంటారు. ఇది బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పోరాడగలుగుతుంది. మార్కెట్లో విరివిగా లభిస్తూ ఉంటుంది. దీన్ని కూడా మీరు యాంటీబయాటిక్ గా ఉపయోగించొచ్చు.

7. అల్లం

7. అల్లం

అల్లంలో యాంటీబయోటిక్‌ గుణాలు ఎక్కువగా ఉంటాయి. బ్యాక్టీరియా వల్ల కలిగే పలు రకాల ఆరోగ్య సమస్యల నుంచి అల్లం మన శరీరాన్ని కాపాడుతుంది. శ్వాసకోశ సంబంధిత సమస్యలు, చిగుళ్ల ఇనెఫెక్షన్లను తగ్గించడంలో అల్లం బాగా ఉపయోగపడుతుంది.. రోజువారీ ఆహారంలో అల్లాన్ని భాగం చేసుకోవడం ఆరోగ్యానికి మంచిది. పచ్చి అల్లాన్ని నమిలి తింటే మంచి ప్రయోజనాలుంటాయి.

8. పసుపు

8. పసుపు

పసుపులో చాలా ఔషధ గుణాలున్నాయి. వివిధ రకాల మందుల తయారీలోనూ దీన్ని ఉపయోగిస్తుంటారు. ఇందులోని యాంటీబయోటిక్‌ గుణాలు శరీరాన్ని బ్యాక్టీరియా నుంచి కాపాడుతాయి. పసుపులో కుర్కుమిన్‌ అనే పదార్థం ఉంటుంది. ఇది వివిధ రకాల అనారోగ్యాల నుంచి కాపాడుతుంది. పసుపును రోజూ ఆహారంలో భాగంగా తీసుకుంటే చాలా మంచిది. రోజూ పసుపు, తేనె మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో బ్యాక్టీరియా మొత్తం బయటకు వెళ్లి పోతుంది.

9. టీ ట్రీ ఆయిల్

9. టీ ట్రీ ఆయిల్

టీ ట్రీ ఆయిల్ కూడా యాంటీబయోటిక్ గా పని చేస్తుంది. బ్యాక్టీరియాన్ని అరికట్టడంలో ఇది చాలా బాగా పని చేస్తుంది. అది తినే పదార్థం కాదు. అలర్జీలాంటి వాటికి ఇది బాగా పని చేస్తుంది. అయితే దీన్ని ముఖంపై పూసుకునేటప్పుడు మాత్రం కళ్లకు ఎలాంటి పరిస్థితుల్లో తాకనివ్వకూడదు.

10. కలబంద

10. కలబంద

కలబంద మంచి యాంటీ బయోటిక్ గా పని చేస్తుంది. ఇది మంచి హ్కెడ్రేటింగ్‌ ఏజెంట్‌గా పనిచేస్తుంది. అలోవేరాలో అనామ్లజనకాలు అధికంగా ఉంటాయి. ఇవి సహజ రోగనిరోధక బూస్టర్లగా పని చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడానికి కడా కలబంద పని చేస్తుంది. కలబంద రసం తాగడం వల్ల చాలా రకాల వ్యాధులను నివారించొచ్చు. గాయాలు, మంటలు కారణంగా వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కలబంద రసం తాగటం ద్వారా జీర్ణ సమస్యలు, పేలవమైన ఆకలి, దీర్ఘకాలిక మలబద్ధకంను వదిలించుకోవచ్చు.

11. గోల్డెన్ సీల్

11. గోల్డెన్ సీల్

దీన్ని మీరు కచ్చితంగా మీ ఇంట్లో ఉంచుకోవాలి. ఇది కూడా సహజ యాంటీ బయాటిక్. ఇది రోగనిరోధక శక్తి పెంచడంలో బాగా పని చేస్తుంది. శ్వాసకోశ, జీర్ణ సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో గోల్డెన్ సీల్ బాగా పని చేస్తుంది. గోల్డెన్ సీల్ తో తయారు చేసిన మిశ్రమాన్ని నోట్లో వేసుకుని పుక్కలించి ఉమ్మి వేసే మీరు ఎలాంటి రోగాల బారిన పడకుండా ఉంటారు. గొంతుకు సంబంధించిన సమస్యలు, సైనసిటిస్ వంటి వాటి నివారణకు గోల్డెన్ సీల్ బాగా ఉపయోగపడుతుంది.

12. క్యాబేజీ

12. క్యాబేజీ

క్యాబేజీల సల్ఫర్‌ సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి. ఇది యాంటీ బయోటిక్ గా పని చేస్తుంది. అలాగే క్యాన్సర్‌ కారకాలకు వ్యతిరేకంగా పోరాడే గుణాలు కూడా క్యాబేజీలో ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ త్వరగా తగ్గించే గుణాలు క్యాబేజీలో ఉంటాయి. బ్యాక్టీరియాపై పోరాడడంలో ఇది బాగా పని చేస్తుంది. ఒక కప్పు క్యాబేజీలో 75 శాతం డీవీ, విటమిన్ సి అధికంగా ఉంటుంది.

13. ఆపిల్ సైడర్ వెనిగర్

13. ఆపిల్ సైడర్ వెనిగర్

శరీరంలో ఉండే హానికర పదార్థాలను బయటకు పంపడంలో ఆపిల్ సైడర్ వెనిగర్ బాగా పని చేస్తుంది. ఇది మంచి యాంటీ బయోటిక్. అన్ని రకాల ఇన్ఫెక్షన్లను ఇది నివారిస్తుంది. ఉదయం పరగడుపున కాస్త గోరు వెచ్చని నీటిలో ఆపిల్ సైడర్ వెనిగర్ ను కలుపుకుని తాగితే చాలా మంచిది. గొంతు గరగరగా ఉంటే ఆ మిశ్రమాన్ని నోట్లో పోసుకుని పుక్కలించి ఉమ్మి వేయాలి. అలాగే తేనేలో ఆపిల్ సైడర్ వెనిగర్ ను కలుపుకుని తాగితే దగ్గు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. గాయాల మాన్పడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది.

14. కొబ్బరి నూనె

14. కొబ్బరి నూనె

కొబ్బరి నూనెలో కూడా సహజ యాంటీబయాటిక్స్ గుణాలుంటాయి.ఇది నోటిలోని బ్యాక్టీరియాను చంపగలదు. దంతాలకు సంబంధించిన ఇన్ఫెక్షలను కూడా కొబ్బరి నూనె తగ్గించగలదు. అయితే మనం తలకు ఉపయోగించే కొబ్బరి నూనెను ఇందుకోసం ఉపయోగించకూడదు. ఒరిజినల్ కొబ్బరి నూనెను మాత్రమే ఉపయోగించాలి. కొబ్బరి నూనెతో ఆయిల్ పుల్లింగ్ చేసుకుంటే నోటిలోని బ్యాక్టీరియా మొత్తం చనిపోతుంది.

15. దాల్చిన చెక్క

15. దాల్చిన చెక్క

దాల్చిన చెక్కతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది మంచి యాంటీ బయోటిక్. దాల్చిన చెక్కను నీళ్లు చిలకరిస్తూ మెత్తగా నూరి నుదురుకు కట్టులాగా వేస్తే జలుబువల్ల వచ్చే తలనొప్పి వెంటనే తగ్గుతుంది. కాస్తంత తేనెను వేడిచేసి అందులో ఒక టీస్పూన్‌ దాల్చిన చెక్క పొడిని కలిపి రోజుకు మూడు పూటలా తీసుకున్నా లేదా ఇదే మిశ్రమాన్ని శరీరానికి పూసినా దురదలు, ఎగ్జిమా, పొక్కులు లాంటి దీర్ఘకాలిక చర్మ వ్యాధులను అరికట్టవచ్చు. కాండిడా వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా ఇది పోరాడగలదు. కోలి బాక్టీరియాకు వ్యతిరేకంగా ఇది పని చేస్తుంది.

English summary

15 Natural Antibiotics to Always Keep in Your Home

Here 15 Natural Antibiotics to Always Keep in Your Home
Story first published: Wednesday, November 29, 2017, 16:19 [IST]
Subscribe Newsletter