బ్లాక్ టీ తో 18 రకాల ఆరోగ్య ప్రయోజనాలు

By: Y. Bharath Kumar Reddy
Subscribe to Boldsky

బ్లాక్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది కామెల్లియా సినెసిస్ అనే మొక్క ఆకుల పొడి ద్వారా తయారవుతుంది. ఇది పలు రంగుల్లో ఉంటుంది. ఈ టీ ఇతర టీల కంటే చాలా మేలైనది. ఈ టీ చిక్కటి ముదురు రంగులో ఉంటుంది కాబట్టి దీనికి బ్లాక్ టీ అనే పేరు వచ్చింది. కాఫీతో పోల్చుకుంటే ఇందులో చాలా తక్కువ మోతాదుతులో కెఫిన్ ఉంటుంది. బ్లాక్ టీని తాగితే మ‌న‌కు చాలా ప్రయోజనాలు కలుగుతాయి. బ్లాక్ టీ వల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటో ఒకసారి మీరూ తెలుసుకోండి.

1. వెయిట్ లాస్

1. వెయిట్ లాస్

మధుమేహం, గుండె జబ్బులు, పీసీఓడీ వంటి వాటికి మూలకారణం వెయిట్ లాస్. అయితే రోజుకు ఓ కప్పు బ్లాక్‌ టీ తాగితే బరువు తగ్గడం ఈజీ అవుతుంది. జీర్ణక్రియను వేగవంతం చేసే బ్యాక్టీరియా పెరగడానికి బ్లాక్‌ టీ దోహదం చేస్తుంది. బ్లాక్‌ టీ రెండు పేగుల్లోని బ్యాక్టీరియాను వృద్ధి చేస్తుంది. ఆ బ్యాక్టీరియా కారణంగా జీర్ణక్రియ రేటు పెరుగుతోంది. తద్వారా ఆరోగ్యకరంగా బరువు తగ్గే వీలుంటుంది. బ్లాక్‌ టీలోని పాలీఫినోల్స్‌ మెటబాలిజమ్‌ పెరగడానికి అవసరమయ్యే బ్యాక్టీరియా వృద్ధికి కారణమవుతుంది. బ్లాక్ టీలో కొవ్వు, కేలరీలు, సోడియం తక్కువగా ఉంటాయి. అందువల్ల శరీరంలోని అదనపు కేలరీలు ఈజీగా తగ్గుతాయి.

2. బ్రెస్ట్ క్యాన్సర్ ను నయం చేస్తుంది

2. బ్రెస్ట్ క్యాన్సర్ ను నయం చేస్తుంది

బ్లాక్ టీలో కేంప్‌ఫెరాల్‌ అనే యాంటాక్సిడెంట్‌ ఉంటుంది. ఇది రొమ్ము కేన్సర్‌ ని అడ్డుకోవడంలో బాగా పనిచేస్తుంది. అలాగే బ్లాక్ టీలో పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దీంతో వివిధ రకాల క్యాన్సర్ లు రావు. ఉదరం, పెద్దపేగు, ఉపిరితిత్తుల, రొమ్ము క్యాన్సర్ కారక కణాల పెరుగుదలను నిలిపివేసే శక్తి బ్లాక్ టీకి ఉంటుంది.

3. డయేరియా నుంచి ఉపశమనం కలిగిస్తుంది

3. డయేరియా నుంచి ఉపశమనం కలిగిస్తుంది

బ్లాక్ టీ లో టానిన్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో పేగులకు సంబంధించిన సమస్యలను ఇది పరిష్కరించగలదు. డయేరియా వ్యాధి గ్రస్తులు బ్లాక్ టీ తాగితే వెంటనే ఉపశమనం పొందుతారు.

4. బ్యాడ్ కొలెస్ట్రాల్స్ ను తగ్గిస్తుంది

4. బ్యాడ్ కొలెస్ట్రాల్స్ ను తగ్గిస్తుంది

చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే గుణాలు బ్లాక్ టీలో ఉన్నాయి. బ్లాక్ టీ, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గించటంలో.సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ లేదా ఎల్ డీఎల్ స్థాయిలను తగ్గించి గుండె వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ధమనుల పనితీరును కూడా ఇది మెరుగుపరుస్తుంది.

5. ఆస్తమా

5. ఆస్తమా

వేడివేడిగా ఉండే ద్రవాలను తాగటం వల్ల ఆస్తమా నుంచి కొంచెం ఉపశమనం కలుగుతుంది. అయితే బ్లాక్ టీ శరీరంలోకి ఎక్కువను గాలిని పంపించి, సులభంగా ఉపిరి తీసుకునే వీలును కల్పిస్తుంది. అందువల్ల బ్లాక్ టీని తాగితే చాలా మంచిది.

6. నోటి ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది

6. నోటి ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది

బ్లాక్ టీ నోటి ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. ఇందులో ఉండే కేట్చిన్ నోటి క్యాన్సర్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో ఉండే టానిన్, పాలిఫేనోల్స్ దంతాలను పరిరక్షిస్తాయి. బ్లాక్ టీ తాగితే నోటి దుర్వాసన కూడా రాదు.

7. గుండెకు ఎంతో మంచిది

7. గుండెకు ఎంతో మంచిది

గుండె జబ్బులతో బాధపడుతున్న వారు రోజు ఒక కప్పు బ్లాక్ టీ తాగటం చాలా మంచిది. దీంతో వారిలో కరోనరీ ఆర్టేరీ డిస్-ఫంక్షన్స్ తగ్గిపోతాయి. బ్లాక్ టీ వారికి గుండె సంబంధిత వ్యాధులకు తక్కువగా వస్తుంటాయి. ఆరోగ్యంగా ఉన్న వారు బ్లాక్ టీ తాగినా గుండె జ‌బ్బులు రావు.

8. ఆందోళన ఒత్తిడి తగ్గుతుంది

8. ఆందోళన ఒత్తిడి తగ్గుతుంది

బ్లాక్ టీని నిత్యం తాగ‌డం వ‌ల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు. యాక్టివ్‌గా ప‌నిచేస్తారు. ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. బ్లాక్ టీలో ఉన్న ఎమైనో యాసిడ్ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇందులో ఉండే కార్టిసాల్ హార్మోన్ కూడా ఒత్తిడిని తగ్గిస్తుంది.

9. ఎముకలకు బలాన్ని ఇస్తుంది

9. ఎముకలకు బలాన్ని ఇస్తుంది

బ్లాక్ టీలో ఫైటోకెమికల్స్ ఉంటుంది. ఎముకలు గట్టిపడడానికి ఇది దోహదం చేస్తుంది. బ్లాక్ టీ తాగేవారిలో ఆరోగ్యకరమైన ఎముకలుంటాయి. ఎముకలు గట్టిపడాలంటే మీరు కూడా బ్లాక్ టీ తాగుతూ ఉండండి.

10. యాంటీ ఆక్సిడెంట్స్ అధికం

10. యాంటీ ఆక్సిడెంట్స్ అధికం

బ్లాక్ టీ యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి చాలా వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. అంతేకాకుండా వ్యాధుల కారణమయ్యే వైరస్ లతో ఇవి సమర్థతంగా పోరాడతాయి.

11. వెంటనే శక్తి వస్తుంది

11. వెంటనే శక్తి వస్తుంది

ఏ సమయంలోనైన బ్లాక్ టీ తాగిన వెంటనే శక్తిని పొందుతారు. ఒక కప్పు బ్లాక్ టీ తాగారనుకో వెంటనే మీలో ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. ఆరోగ్యానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. బ్లాక్ టీలో ఉన్న కెఫిన్, కాఫీ లేదా కోల వంటి పానీయాలలో ఉన్న కెఫిన్ కంటెంట్ కంటే ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది.

12. జీర్ణ ప్రక్రియ వేగవంతం కావడానికి ఉపయోగపడుతుంది

12. జీర్ణ ప్రక్రియ వేగవంతం కావడానికి ఉపయోగపడుతుంది

జీర్ణక్రియ సమస్యలకు బ్లాక్ టీ సమర్థంగా పని చేస్తుంది. వీటిలో టానిన్స్ ఎక్కువగా ఉంటాయి. జీర్ణక్రియకు ఉపయోగపడే రసాయనాలు బ్లాక్ టీ ఎక్కువగా ఉంటాయి. అలాగే బ్లాక్ టీలో ఎక్కువగా యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇందులో టానిన్ ఎక్కువగా ఉంటుంది. దీంతో జీర్ణక్రియ వ్యవస్థ వేగంగా సాగుతుంది.

13. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది

13. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది

బ్లాక్ టీ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. బ్లాక్ టీలో ఉన్న టానిన్ శరీరంపై దాడి చేసే పలు వైరస్ లను సమర్థంగా ఎదుర్కొంటుంది. ఇందులో ఉండే కేట్చిన్ కూడా ఇమ్యూనిటీ శక్తిని పెంచుతుంది. అందువల్ల రోజూ బ్లాక్ టీ తాగడం చాలా మంచిది.

14. బ్రెయిన్, నాడీ కణాల వ్యవస్థ పని తీరును మెరుగుపరుస్తుంది

14. బ్రెయిన్, నాడీ కణాల వ్యవస్థ పని తీరును మెరుగుపరుస్తుంది

బ్లాక్ టీ మెదడుకు సాఫీగా రక్తసరఫరా అయ్యేలా చేస్తుంది. ఇందులో కెఫిన్ తక్కువగా ఉండడమే ఇందుకు కారణం. అలాగే నాడీ కణాల వ్యవస్థ సక్రమంగా పని చేసేందుకు బ్లాక్ టీ బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల రోజూ బ్లాక్ టీ తాగడం చాలా మంచిది.

15. ఫ్రీ రాడికల్స్ వ్యతిరేకంగా పోరాడుతుంది

15. ఫ్రీ రాడికల్స్ వ్యతిరేకంగా పోరాడుతుంది

ఫ్రీ రాడికల్స్ వల్ల క్యాన్సర్, ఎథెరోస్క్లెరోసిస్, రక్తం క్లాట్ కావడం వంటి సమస్యలు ఏర్పడుతాయి. అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవటం వలన శరీరంలో ఎక్కువగా ఫ్రీ రాడికల్స్ ఏర్పడుతాయి. బ్లాక్ టీలో ఉండే యాంటీ ఆక్సైడ్స్ ఫ్రీ రాడికల్స్ కు వ్యతిరేకంగా పోరాడతాయి. వివిధ వ్యాధుల బారిన పడకుండా బ్లాక్ టీ కాపాడుతుంది.

16. హృదయనాళ వ్యవస్థకు చాలా ప్రయోజనాలున్నాయి

16. హృదయనాళ వ్యవస్థకు చాలా ప్రయోజనాలున్నాయి

బ్లాక్ టీ వినియోగించటం వల్ల హృదయనాళ వ్యవస్థకు చాలా ప్రయోజనాలు కలుగుతాయి. దీనిలో ఎల్ డీఎల్ కొలెస్ట్రాల్ ఆక్సీకరణ కాకుండా నిరోధించే ఫ్లేవనాయిడ్స్ ఆమ్లజనకాలు ఉంటాయి. రక్తప్రసరణలో కలిగే అడ్డంకులను బ్లాక్ టీ తగ్గిస్తుంది. బ్లాక్ టీ వల్ల ఎండోథెలియల్ వాసోమోటార్ పనిచేయకపోవటం వలన వొచ్చే కొరోనరీ ఆర్టరీ వ్యాధులు కూడా రావు. ఫ్లేవనాయిడ్స్ రక్తం గడ్డలు ఏర్పడకుండా ఉంచడంలో సాయపడుతుంది.

17. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది

17. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది

ఒంట్లో నీటి శాతం తగ్గటాన్ని డీహ్రైడేషన్‌ అంటారు. నీరు తగ్గిపోతే కిడ్నీలు వ్యర్థాలను సరిగా బయటకు పంపలేవు. ఈ క్రమంలో అవి దెబ్బతింటాయి. కాబట్టి బాడీని ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. ఇందుకు బాగా నీరు తాగాలి. అలాగే బ్లాక్ టీ కూడా బాడీనీ హైడ్రెటెడ్ గా ఉంచడానికి బాగా ఉపయోగపడుతుంది.

18. పార్కిన్స‌న్‌ తగ్గిస్తుంది

18. పార్కిన్స‌న్‌ తగ్గిస్తుంది

పొగ తాగేవారిలో వ‌చ్చే పార్కిన్స‌న్‌ వ్యాధి నుంచి బ్లాక్ టీ ర‌క్షిస్తుంది. నిత్యం బ్లాక్ టీ తాగుతుంటే ఈ వ్యాధి వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గుతాయ‌ట‌. ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే సరైన మోతాదులో కెఫెన్ బాడీకి అందాలి. ఇన్ని ఉపయోగాలున్న బ్లాక్ టీని రోజూ తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

English summary

Black Tea: Losing Weight & Other Health Benefits

Black tea health benefits include beneficial impact on boosting heart health, diarrhea, digestive problems, high blood pressure, lowering the risk of Type 2 diabetes and asthma. Here 18 Health Benefits of Having Black Tea.
Story first published: Friday, November 17, 2017, 9:32 [IST]
Subscribe Newsletter