ఈ 6 లక్షణాలు గనుక ఉంటే మీ వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉన్నట్లు లెక్క..

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

మీ వీర్య కణాల యొక్క సంఖ్య, శృంగారంలో మీ యొక్క ప్రదర్శనను మరియు మీ శృంగార కోరికల పై ఎటువంటి ప్రభావం చూపించదు అని గుర్తుపెట్టుకోండి.

పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గించే సైలెంట్ కిల్లర్స్..?

అయితే పురుషుల్లో కనపడే కొన్ని లక్షణాలు, వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉన్నాయి అనే విషయాన్ని సూచిస్తాయి. అవేంటో తెలుసుకోవాలనే ఆతురత మీలో ఉందా ? అయితే ఇప్పుడు తెలుసుకోండి.

1. ముఖంపై వెంట్రుకలు తక్కువగా ఉండటం :

1. ముఖంపై వెంట్రుకలు తక్కువగా ఉండటం :

హార్మోన్ల సమతుల్యత దెబ్బతినటడం వల్ల వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉంటుంది. అవే హార్మోన్ల సమతుల్యత దెబ్బతినటం వల్ల ముఖం పై వెంట్రుకలు తగ్గడం మొదలవుతుంది. కాబట్టి ముఖం పై వెంట్రుకలు తక్కువగా ఉన్నా అస్సలు లేకపోయినా, ఆ వ్యక్తుల్లో వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉంది అనే విషయాన్ని సూచిస్తుంది.

2. లోతైన స్వరం :

2. లోతైన స్వరం :

ఆస్ట్రేలియా కు చెందిన ఒక యూనివర్సిటీ అధ్యయనాల్లో ఏ పురుషులకైతే లోతైన స్వరం ఉంటుందో అటువంటి వ్యక్తులకు వీర్యకణాల సాంద్రత తక్కువగా ఉంటుందని గుర్తించారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే, వృషణముల స్రావము (టెస్టోస్టెరాన్) పురుషుడి యొక్క స్వరం లోతుగా మారడానికి కారణం అవుతుంది మరియు వీర్యకణాల యొక్క ఉత్పత్తి పై కూడా ప్రభావం చూపుతుంది.

లైంగిక సామర్థ్యంను పెంచే 15 ఇండియన్ సూపర్ ఫుడ్స్

3. కండరాలు దృఢంగా లేకపోవడం :

3. కండరాలు దృఢంగా లేకపోవడం :

వ్యక్తి యొక్క కండరాలు సమృద్ధిగా గనుక వృద్ధి చెందక పొతే అటువంటి వారిలో వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉంటుంది. సాధారణంగా పీయూష గ్రంధి (పిట్యూటరీ గ్రంధి) కి జన్యుసంబంధమైన సమస్యలు గనుక ఎదురైతే ఇలా జరిగే ఆస్కారం ఉంది. అయితే, ఇలా చాలా అరుదుగా మాత్రమే జరుగుతూ ఉంటుంది.

4. వీర్య ఘానా పరిమాణం తక్కువగా ఉండటం :

4. వీర్య ఘానా పరిమాణం తక్కువగా ఉండటం :

వీర్యం అనేది తెల్ల పాలవంటి ద్రవం. ఈ లక్షణం వల్ల వీర్యం అనేది సులువుగా చలిస్తుంది. ఎవరికైతే వృషణముల స్రావము (టెస్టోస్టెరాన్) స్థాయిలు తక్కువగా ఉంటాయో, అటువంటి వారిలో వీర్యకణాల సంఖ్య కూడా తక్కువగా ఉంటుంది. అది మీ వీర్యం లో స్పష్టంగా కనపడుతుంది. మీరు స్ఖలించేటప్పుడు మీ వీర్యం చాలా తక్కువ ఘణ పరిమాణంలో బయటకు వస్తుంది. ఈ లక్షణాన్ని మీరు కూడా గుర్తించవచ్చు.

స్పెర్మ్ క్వాలిటీపై ప్రభావం చూపే అంశాలు

5. విపరీతమైన అలసట :

5. విపరీతమైన అలసట :

కొంతమంది విపరీతంగా అలసిపోతారు మరియు శక్తి కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎవరిలో అయితే వృషణముల స్రావము (టెస్టోస్టెరాన్) స్థాయిలు తక్కువగా ఉంటాయో అటువంటి వారిలో ఈ లక్షణాలు కనపడతాయి. సరిపడినంత సేపు నిద్రపోయినా కూడా త్వరగా లేవాలని మరియు వ్యాయామం చేయాలని కొంతమందికి అనిపించదు. ఇలాంటి లక్షణాలు గనుక ఉంటే వీర్య కణాల సంఖ్య తక్కువ ఉన్నట్లు అర్ధం.

6. భాగస్వామిని గర్భవతి చేయలేకపోవడం :

6. భాగస్వామిని గర్భవతి చేయలేకపోవడం :

ఇక చివరిగా మీరు గనుక ఒకటి రెండు సంవత్సరాల నుండి మీ భాగస్వామిని గర్భవతిని చేయాలని ప్రయత్నిస్తున్నా, అలా గనుక చేయలేకపోతే మీ వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉందని అర్ధం. అయితే మీ భాగస్వామిలో కూడా సమస్యలు ఉండి ఉండొచ్చు. కానీ, మీ వీర్య కణాల సంఖ్య కూడా ఒక లోపం అయి ఉండొచ్చు.

English summary

6 signs and symptoms your sperm count is low!

Remember that a reduced sperm count has nothing to do with poor performance or sexual anxiety. However, there are a few signs that can indicate if your sperm count is low. Curious to know what they are? Learn from sexologist Dr Chetan Sawale.
Subscribe Newsletter