For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్ట్ : హార్ట్ ఫెయిల్యూర్ కు 7 వార్నింగ్ లక్షణాలు..!!

హార్ట్ ఫెయిల్యూర్ అయినప్పుడు కొన్ని లక్షణాలు కనబడుతాయి. ఈ లక్షణాలను బట్టి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే మంచింది. సరైన సమయంలో ట్రీట్మెంట్ కనుక తీసుకోకపోతే హార్ట్ అటాక్ కు దారితీస్తుంది.

|

శరీరంలో ప్రతీ అవయవం పనిచేయాలంటే వాటి అవసరాలకు అనుగుణంగా గుండె రక్తం సరఫరా చేస్తుండాలి. అయితే కొన్ని కారణాల వల్ల గుండె రక్తాన్ని పంపింగ్‌ చేసే సామర్థ్యాన్ని కోల్పోతుంది. గుండె కండరం వీక్‌ అయినపుడు ఈ సమస్య తలెత్తుతుంది. ఈ పరిస్థితిని హార్ట్‌ ఫెయిల్యూర్‌ అంటారు. దీనికి అనేక కారణాలుంటాయి. గుండెలోకి 100 మి.లీల రక్తం లోపలికి వెళితే కనీసం 60 మి.లీల రక్తం బయటకు పంప్‌ చేయబడాలి. 35 మి.లీల కన్నా తక్కువ రక్తం పంప్‌ అవుతున్నప్పుడు హార్ట్‌ ఫెయిల్యూర్‌గా భావించాలి. ఈ స్థితిలో రక్తం గుండెలోనే నిలిచిపోతుంటుంది. ఫలితంగా గుండె ఎన్‌లార్జ్‌ అవుతుంది.

హార్ట్ ఫెయిల్యూర్ కు కారణాలు:
గుండెకు వచ్చే అన్ని జబ్బులు హార్ట్‌ ఫెయిల్యూర్‌కు దారితీస్తాయి. అంటే రక్తనాళాల్లో బ్లాక్స్‌ ఏర్పడటం, కవాటాలు దెబ్బతినడం, హార్ట్‌ బీటింగ్‌లో మార్పులు వంటి జబ్బులన్నీ హార్ట్‌ ఫెయిల్యూర్‌కు కారణమవుతాయి. పుట్టుకతో వచ్చే గుండె జబ్బుల వల్ల కూడా హార్ట్‌ ఫెయిల్యూర్‌ కావచ్చు. గుండె పోటు కారణం కావచ్చు. గుండెకు మూడు రక్తనాళాల ద్వారా రక్తం సరఫరా అవుతుంటుంది. ఈ నాళాలలో ఏదైనా రక్తనాళంలో బ్లాక్‌ ఏర్పడినపుడు రక్తసరఫరా నిలిచి గుండెలో ఆ భాగం చచ్చుబడిపోయి, కండరాలు క్షీణిస్తాయి. ఫలితంగా పంప్‌ చేసే శక్తి తగ్గిపోతుంది.

హార్ట్ ఫెయిల్యూర్ అయినప్పుడు కొన్ని లక్షణాలు కనబడుతాయి. ఈ లక్షణాలను బట్టి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే మంచింది. సరైన సమయంలో ట్రీట్మెంట్ కనుక తీసుకోకపోతే హార్ట్ అటాక్ కు దారితీస్తుంది. కాబట్టి, లక్షణాల బట్టి వెంటనే చికిత్స తీసుకోవడం మంచిది. హార్ట్ ఫెయిల్యూర్ కు కొన్ని లక్షణాలు ఈ క్రింది విధంగా..

శ్వాసలో అంతరాయాలు ('డిస్ప్నియా')

శ్వాసలో అంతరాయాలు ('డిస్ప్నియా')

గుండె వైఫల్యానికి గురైన వ్యక్తిలో మొదటగా బహిర్గతం అయ్యే లక్షణం 'శ్వాసలో తగ్గుదల లేదా అంతరాయాలు' ఏర్పడటం. శ్వాసలో అంతరాయాలు మెట్లు ఎక్కుతున్నపుడు లేదా నడుస్తూ ఉన్నపుడు ఏర్పడతాయి. ఆ సమయంలో వారి చాతిలో విపరీతమైన నొప్పి లేదా చాతిలో అధికంగా బరువు ఉన్నట్లు భావిస్తూ ఉంటారు.

రాత్రి సమయంలో పడుకున్న తరువాత శ్వాసలో హెచ్చు తగ్గులు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి ఈ పరిస్థితిని 'ఆర్థోప్నియా' అంటారు. ఇలాంటి సమయంలో వారు ఎక్కువగా దిండు సహాయం తీసుకుంటారు, పడుకోటానికి తల క్రింద దిండు తప్పకుండా ఉండాలి.

దగ్గు లేదా గురక

దగ్గు లేదా గురక

ఊపిరితిత్తుల్లో నీరు చేరినప్పుడు రక్తప్రసరణలో అంతరాయం కలుగుతుంది. దాంతో ఎడతెరపకుండా దగ్గు ఇబ్బంది పెడుతుంది. ఇందులో ఎక్కువగా రోగి పడుకున్న కొన్ని గంటల తరువాత పొడి దగ్గు మరియు గురకలు వస్తాయి. ఇవి కూడా గుండె వైఫల్యానికి సూచికలు. హార్ట్ ఫెయిల్యూర్ కు ఇది కూడా ఒక ముఖ్య లక్షణం..గుండె వైఫల్యానికి గురైనపుడు బహిర్గతం అయ్యే మరొక లక్షణం 'ప్రాక్సిమల్ నాక్టుర్నాల్ దిస్ప్నియా' (PND) అంటారు. ఇది హటాత్తుగా నిద్రలో నుండి ఉలిక్కిపడేలా చేస్తుంది. ఇందులో కూడా శ్వాసలో అవాంతరాలు, దగ్గు మరియు గురక. ఇవన్ని నిద్రపోయిన తరువాత 1-3 గంటల మధ్యలో ఏర్పడతాయి.

నీరు చేరటం (ఎడిమా) మరియు బరువు పెరగటం

నీరు చేరటం (ఎడిమా) మరియు బరువు పెరగటం

రక్తనాళాల్లో రక్త ప్రసరణకు అంతరాయం కలగడమే కాకుండా, వాటిలో నీరు చేరడం వల్ల పాదాలు, మడమలు, కాళ్ళు ఉబ్బటం లాంటివి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఇలా శరీరంలో నీరు చేరటం వలన బరువు పెరుగుతారు మరియు తరచుగా మూత్రానికి ఎక్కువగా వెళ్తుంటారు ఇలాంటి లక్షణాలు చాలా సాధారణం. కొన్ని సమయాల్లో మెడ పైన ఉండే నరాలు కూడా ఉబ్బుతాయి.

కండరాల ద్రవ్యరాశి లేదా బరువు తగ్గటం

కండరాల ద్రవ్యరాశి లేదా బరువు తగ్గటం

హార్ట్ ఫెయిల్యూర్ అయినప్పుడు సెడన్ గా బరువు పెరుగుతారు. శారీరక పనులు తగ్గిపోవటం వలన కార్డియాక్ అవుట్ పుట్ తగ్గిపోతుంది, కావున రోగి కండరాల ద్రవ్యరాశి తగ్గిపోయి గుండెపోటుకి లోనయ్యే అవకాశం ఉంది. శరీరంలో నీరు చేరడం వల్ల ఎక్సెస్ వెయిట్ పెరుగుతారు.

ఆకలి లేకపోవడం:

ఆకలి లేకపోవడం:

హార్ట్ ఫెయిల్యూర్ అయినప్పుడు, జీర్ణవ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. పొట్ట ఫుల్ గా ఉన్న అనుభూతి కలుగుతుంది. దాంతో ఆకలి తగ్గుతుంది. రోగి ఆకలిని కోల్పోతాడు, అనగా చాలా తక్కువ ఆహరం సేకరించినను కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. అంతేకాకుండా ఉదరభాగంలో నొప్పి కూడా కలుగవచ్చు.

అలసట మరియు టయర్డ్ నెస్ :

అలసట మరియు టయర్డ్ నెస్ :

గుండెకు రక్తం సరిగా సరఫరా కాకపోతే, ఎక్కువ నీరసం, అలసటకు గురి అవుతుంది. హార్ట్ ఫెయిల్యూర్ కు ఇది ఒక ముఖ్యమైన లక్షణం.

హార్ట్ బీట్ పెరుగుతుంది:

హార్ట్ బీట్ పెరుగుతుంది:

గుండెకు రక్త ప్రసరణ సరిగా జరగకపోతే, హార్ట్ బీట్ పెరుగుతుంది. ఇది హార్ట్ ఫెయిల్యూర్ కు ఇది ఒక కారణం.

English summary

7 Warning Signs Of Heart Failure

7 Warning Signs Of Heart Failure,There are certain signs that indicate your heart is failing. A few of these signs are explained in this article.
Desktop Bottom Promotion