హైపో టెన్షన్ (అల్ప రక్తపోటు)ను నివారించే 8 ఉత్తమ ఆహారాలు

By: Mallikarjuna
Subscribe to Boldsky

రక్తపీడనం లేదా రక్తపోటును మన శరీరం నియంత్రించలేని కారకాల లేదా పరిస్థితుల వలన 'హైపోటెన్షన్' లేదా 'అల్పరక్తపోటు' కలుగుతుంది. అల్పరక్తపోటులో చాలా రకాలు మరియు వాటిని కలుగచేసే కారకాలు కూడా వివిధ రకాలుగా ఉన్నాయి. నార్మల్ బ్లడ్ ప్రెజర్ కంటే తక్కువగా సూచిస్తే దాన్ని లోబ్లడ్ ప్రెజర్ లేదా అల్ప రక్తపోటు అని సూచిస్తుంటారు. ఇది వర్టిగో, తలతిరగడం, నీరసం, తలనొప్పి, బలహీనత వల్ల ఈ సమస్య రావచ్చు.

అధిక మరియు అల్ప రక్తపీడనాలు ఎలాంటి లక్షణాలను బహిర్గతపరచకుండా కలుగుతాయి. ప్రపంచ వ్యాప్తంగా, చాలా మంది దీనితో భాదపడుతున్నారు. కారణం లేకుండా తరచుగా జ్వరం లేదా బలహీనంగా అనిపిస్తే, వీటి వలన అని చెప్పవచ్చు.

8 Foods You Should Eat to Manage Your Hypotension,

అల్ప రక్తపోటు చాలా ప్రమాదకర పరిస్థితిగా పేర్కొనవచ్చు, ఎందుకంటే దీని వలన మెదడుకు, శరీర అవయవాలకు ఆక్సిజన్ మరియు అవసరమైన పోషకాల సరఫరా ఆగిపోయి, చాలా ప్రాణాంతకర పరిస్థితులను ఏర్పరుస్తుంది. ఈ సమయంలో వారిలో బ్లడ్ ప్రెజర్ 60 ఎంఎం హెచ్ జి మరియు 100 ఎంఎం హెచ్ జి కంటే తక్కువగా ఉంటుంది. అల్పరక్తపోటు కొన్ని సెకెండ్లు లేదా నిముషాలు మాత్రమే ఉంటుంది. కావున పరిస్థితిని విస్మరించకుండా, తగిన జాగ్రత్తలను తీసుకోవాలి. కొన్ని రకాల ఇంట్లో ఉండే ఔషదాలు మరియు ఆహార పదార్థాలను క్రమంగా తినటం వలన అల్ప రక్తపోటు నుండి కోలుకోవచ్చు. వాటి గురించిన వివరాలు కింద పేర్కొనబడ్డాయి.

1. డార్క్ చాక్లెట్ :

1. డార్క్ చాక్లెట్ :

హైపోటెన్షన్ తో బాధపడే వారు మితంగా అప్పుడప్పుడు డార్క్ చాక్లెట్ తినాలి. ఇందులో థియోబ్రోమైన్ అనే కంటెంట్ ను కనుగొనబడినది. ఇంకా ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్, యాంటీఇక్సిడెంట్స్, శరీరంలోని ధమనులకు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. బ్లడ్ ప్రెజర్ ను తిరిగి నార్మల్ కండీషన్ కు తీసుకొస్తుంది. .

2. కోకనట్ వాటర్ :

2. కోకనట్ వాటర్ :

కొబ్బరి నీళ్ళు ఒక న్యాచురల్ డ్రింక్. ఇందులో ఎలక్ట్రోలైట్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల లోబ్లడ్ ప్రెజర్ కు సహాయపడుతుంది. కొంత మంది స్పోర్ట్ డ్రింక్ కు ప్రత్యామ్నాయంగా హెల్తీ డ్రింక్ గా కోకనట్ వాటర్ తీసుకుంటారు. వీటిలో క్యాలరీలు తక్కువ. ఇందులో ఉండే ఎలక్ట్రోలైట్స్ శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుతుంది. అదనంగా, కణాలకు ఆక్సిజన్ మెరుగుపరుస్తుంది. దాంతో హైపో టెన్షన్ లక్షణాలతో పోరాడుతుంది.

3. చీజ్ :

3. చీజ్ :

చీజ్ సోడియంకు ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. ఇది హైపోటెన్షన్ మ్యానేజ్ చేయడానికి చాలా మంచిదని చెప్పవచ్చు. (హైపర్ టెన్షన్ వారికి హానికరం). ఒక చిన్న పీస్ చీజ్ తింటే చాలు, ధమనుల్లో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది, రక్తపోటుకు సంబంధించిన వ్యాధులను నివారిస్తుంది. అయితే చీజ్ ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు, ఇది బ్లడ్ ప్రెజర్ ఎక్కువగా పెంచుతుంది.

4. నట్స్:

4. నట్స్:

హైబ్లడ్ ప్రెజర్ ఉన్నా, లోబ్లడ్ ప్రెజర్ ఉన్నా నట్స్ తినడం ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే నట్స్ లో విటమిన్ బి మరియు హెల్తీ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండటం వల్ల ఇవి రక్తప్రసరణను నార్మల్ కండీషన్ లో ఉంచుతాయి. అలాగే శరీరానికి కావల్సిన ఎనర్జీని అందిస్తాయి. నీరసాన్ని తగ్గిస్తాయి. అల్పరక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది.

5. గుడ్డు:

5. గుడ్డు:

గుడ్డు శరీరానికి కావల్సిన విటమిన్ బి మరియు ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ను అందించి హైపోటెన్షన్ ను తగ్గిస్తుంది. ఇది శరీరంలో ఎనర్జీ లెవల్స్ ను పెంచుతుంది,. అలాగే మానసిక, శారీరక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది.

6. సిట్రస్ పండ్లు:

6. సిట్రస్ పండ్లు:

అన్ని రకాల సిట్రస్ పండ్లలో విటమిన్ సి అండ్ వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇవి రెండూ శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరచడంలో అద్భుతంగా సహాయపడుతాయి. ఫ్రెష్ సిట్రస్ ఫ్రూట్ జ్యూస్ తీసుకోవడం లేదా ఫ్రెష్ ఆరెంజ్ ఫ్రూట్స్ తినడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ చేయడానికి సహాయపడుతాయి. ఇది బ్లడ్ ప్రెజర్ ను స్థిరంగా ఉంచుతుంది. అందుకోసం మ్యాండరిన్ ఆరెంజెస్, ఆరెంజ్, లెమన్, లైమ్, గ్రేప్ ఫ్రూట్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

7. లీన్ మీట్ :

7. లీన్ మీట్ :

అల్ప రక్తపోటును తగ్గించుకోవాలంటే ఇన్ స్టాంట్ గా లీన్ మీట్ తిన్నాకూడా వెంటనే ఎనర్జీ పొందుతారు. ఇందులో హెల్తీ ప్రోటీన్స్, న్యూట్రీషియన్స్ అధికంగా ఉండే శరీరంలో ఎనర్జీ లెవల్స్ ను పెంచుతుంది. కళ్ళు తిరగడం, వీక్ నెస్ వంటి లక్షణాలను నివారిస్తుంది.

8. వాటర్ :

8. వాటర్ :

శరీరంలో జీవక్రియలు చురుకుగా పనిచేయాలంటే నీళ్ళు ఎక్కువగా తాగాలి. అంతే కాదు ఇది ఎనర్జీ లెవల్స్ ను పెంచుతుంది, హైపోటెన్షన్ తగ్గిస్తుంది,. నీళ్ళు ఎక్కువగా తాగడం వల్ల డీహైడ్రేషన్ లేదా బాడీ హీట్ తగ్గుతుంది. ఈ మినిరల్ వాటర్ వల్ల సెల్ యాక్టివిటి మెరుగుపడుతుంది. దాంతో శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఆక్సిజన్ ప్రొసెస్ మెరుగ్గా ఉంటుంది.

English summary

8 Foods You Should Eat to Manage Your Hypotension

Hypotension is a medical condition that consists of lower than normal blood pressure. It often causes vertigo and dizziness, and sometimes produces fainting, headaches, and weakness. That’s because low blood pressure interferes with the proper distribution of oxygen and nutrients throughout your body, directly affecting cellular activity.
Story first published: Wednesday, November 15, 2017, 19:00 [IST]
Subscribe Newsletter