Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
అలర్ట్ : మీరు సరిగా నీళ్లు తాగట్లేదని తెలిపే డేంజరస్ సిగ్నల్స్
శరీరంలోని ప్రతి భాగం, ప్రతి చిన్న అవయవం, టిష్యూ, కణం అన్నీ కూడా నీటిపై ఆధారపడి ఉంటాయి. శరీరానికి సరిపడా నీళ్లు తాగడం వల్ల శరీరంలో ఫ్లూయిడ్స్ స్థాయి బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. బాడీ టెంపరేచర్ రెగ్యులేట్ అ
రోజూ నీళ్లు తాగుతున్నారా ? అంటే బాగా తాగున్నాను అన్న సమాధానమే చాలా మంది చెబుతారు. కానీ.. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక బాటిల్ లేదా ఒక లీటర్ కూడా నీళ్లు తాగి ఉండరు. ఇది ఒకరు, ఇద్దరి సమస్య కాదు. చాలా మంది నీళ్లు తాగాలంటే చాలా బద్దకంగా ఫీలవుతారు. అలాగే నీళ్లు తాగడం అంటే.. ఏదో మెడిసిన్ తాగినట్టు ఫీలవుతుంటారు. కానీ.. నీళ్లు తాగడం చాలా అవసరం. ఎందుకంటే.. మనుషుల శరీరం మూడోవంతు నీటితోనే నిర్మాణమై ఉంటుంది. కాబట్టి నీళ్లు సరిగా అందకపోతే.. శరీరంలో అనేక సమస్యలు ఎదురవుతాయి.

శరీరంలోని ప్రతి భాగం, ప్రతి చిన్న అవయవం, టిష్యూ, కణం అన్నీ కూడా నీటిపై ఆధారపడి ఉంటాయి. శరీరానికి సరిపడా నీళ్లు తాగడం వల్ల శరీరంలో ఫ్లూయిడ్స్ స్థాయి బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. బాడీ టెంపరేచర్ రెగ్యులేట్ అవుతుంది. మలినాలు బయటకు వెళ్లడానికి సహాయపడుతుంది. జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. అంతే చర్మం ప్రకాశవంతంగా కనిపించడానికి కూడా నీళ్లు తాగడం తప్పనిసరి.
అయితే శరీరానికి కావాల్సిన స్థాయిలో నీళ్లు అందకపోతే.. శరీరంలో అనేక మార్పులు కనిపిస్తాయి. బాడీ డీహైడ్రేట్ అవడమే కాకుండా.. ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. మీరు సరిగ్గా నీళ్లు తాగడం లేదని తెలిపే.. కొన్ని సంకేతాలు ఇప్పుడు చూద్దాం. మీరు సరిపడా నీళ్లు తీసుకోవడం లేదని మీ బాడీ మీకు డేంజర్ సిగ్నల్స్ ఇస్తుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..

1. యూరిన్ కలర్లో మార్పులు
సాధారణంగా కంటే డార్క్ గా మరియు థిక్ గా యూరిన్ వస్తుంటే, ఖచ్చితంగా మీరు డీహైడ్రేషన్ కు గురయ్యారనే సంకేతం తెలుపుతుంది.

2. తలనొప్పి
తరచూ తలనొప్పికి గురౌతుంటే , అది డీహైడ్రేషన్ కు ఒక కారణం కావచ్చు. డీహైడ్రేషన్ కారణంగా తలకు సరిగా రక్తప్రసరణ కాకపోవడం వల్ల తలనొప్పికి దారితీస్తుంది.

3. స్కిన్ ఎలాసిటి కోల్పోతారు
సాధారణంగా మన చర్మం 30 శాతం నీటితో తయారై ఉంటుంది. ఎప్పుడైతే సరిగా నీళ్ళు తాగకుండా డీహైడ్రేషన్ కు గురి అవుతామో, అప్పుడు స్కిన్ ఎలాసిటి కోల్పోతాము. చర్మం సాగినట్లు, డ్రైగా కనబడుతుంది. డీహైడ్రేషన్ కు ఇది కూడా ఒక ముఖ్యమైన కారణం.

4. మజిల్ క్రాంప్స్
శరీరంలో వివిధ బాగాల్లో మజిల్ క్రాంప్స్ వస్తుంటే, ఇది డీహైడ్రేషన్ కు సంకేతంగా సూచిస్తుంది. శరీరంలో నీరు తగ్గిపోవడం వల్ల రక్త ప్రసరణ తగ్గుతుంది. దాంతో కండరాల్లో తిమ్మెర్లు మొదలవుతాయి.

5. లోబిపి
లోబ్లడ్ ప్రెజర్ తో బాధపడుతుంటే కనుక, అది కూడా డీహైడ్రేషన్ కు ఒక సంకేతంగా సూచిస్తుంది. డీహైడ్రేషన్ కారణంగా బీపి తగ్గుతుంది.

6. హార్ట్ బీట్ లో హెచ్చుతగ్గులు
తరచూ హార్ట్ బీట్ లో హెచ్చుతగ్గులు వస్తుంటే, డీహైడ్రేషన్ కు సంకేతం. శరీరంలో నీరు తగ్గడం వల్ల హార్ట్ కు రక్తప్రసరణ సరిగా జరగకపోవడం అనేది డీహైడ్రేషన్ కు ఒక సంకేతం.

7. మలబద్దకం
అప్పుడప్పుడు మలబద్దక సమస్య బాధిస్తుంటే డీహైడ్రేషన్ కు సంకేతంగా సూచిస్తుంది. శరీరంలో నీరు తగ్గడం వల్ల జీర్ణ వ్యవస్థ మీద కూడా ప్రభావం చూపి, మలబద్దకానికి కారణమవుతుంది

8. జాయింట్ పెయిన్
డీహైడ్రేషన్ కారణంగా కీళ్ళనొప్పులు కూడా వస్తాయి. కండరాలకు రక్తప్రసరణ తగ్గడం వల్ల కీళ్ళు, జాయింట్ పెయిన్స్ పెరుగుతాయి. మరి ఇన్ని విషయాలను తెలుసుకున్నాక కూడా ఇప్పటికీ మీరు నీళ్ళు తాగకపోతే ఎట్లా...?వెంటనే నీళ్ళు తాగడం ఒక మంచి అలవాటుగా చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోండి.



Click it and Unblock the Notifications