సమ్మర్ హీట్ ను బీట్ చేయాలంటే 9 బెస్ట్ ఇండియన్ సమ్మర్ డ్రీంక్స్ తాగాల్సిందే..!

Posted By:
Subscribe to Boldsky

వేసవి వచ్చేసింది, ఎండలు చంపేస్తున్నాయి. ఒక్క తమిళనాడు, ఆంధ్రనే కాదు, ఇండియా మొత్తంగా ఎండలు మండుతున్నాయి. ? మరి ఈ ఎండలు, వేడి వాతావరణం నుండి రక్షణ పొందడం ఎలా?

ఎండలు ఎక్కువైతే చెమట రూపంలో ఒంట్లో ఉండే నీరు అంతా ఆవిరైపోతుంది. దాంతో త్వరగా డీహైడ్రేషన్ కు చేరుకుంటారు. డీహైడ్రేషన్ కారణంగా తర్వగా నీరసానికి గురి అవుతారు. సమ్మర్ హీట్ ను బీట్ చేయాలంటే ఆహారాల కంటే పానీయాలే ఎక్కువగా తీసుకోవాలి.

సేదతీరడానికి...ఆరోగ్య ప్రయోజనాలు పొందడానికి టండా..టండా..కోకనట్ వాటర్

ముఖ్యంగా సమ్మర్లో డీహైడ్రేషన్ నుండి బయట పడటానికి ఫ్రూట్స్ జ్యూసులు, షర్బత్స్ మరియు ఇంకా కొన్ని శీతలపానీయాలు ఎక్కువగా సహాయపడుతాయి. మరి ఈ సమ్మర్ల్ హీట్ ను బీట్ చేయడానికి ఇండియన్ సమ్మర్ డ్రింక్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి. ట్రావెల్ చేసే సమయంలో, వెకేషన్స్, ఫన్ మరియు అడ్వెంచర్స్ సమయంలో వీటిని తప్పకుండా తీసుకోవాలి..

ఆమ్ కా పన్నా:

ఆమ్ కా పన్నా:

ఆమ్ పన్నా చాలా పాపులర్ అయిన నార్త్ ఇండియన్ సమ్మర్ డ్రింక్ . ఈ ఆమ్ పన్నా డ్రింక్ ను పచ్చిమామిడికాయలతో తయారుచేస్తారు. కలర్ లైట్ గ్రీన్ గా ఉంటుంది. ఇది చాలా టేస్టీగా ఎఫెక్టివ్ గా ఉండే శీతల పానియం. సమ్మర్ హీట్ ను బీట్ చేయడంలో ది బెస్ట్ సమ్మర్ డ్రింక్ ఇది.

థాండై :

థాండై :

వేసవి సీజన్ లో థాండై రిఫ్రెషింగ్ డ్రింక్ . ఈ డ్రింక్ ను బాదం పౌడర్, రోజ్ వాటర్, ఇతర ఆరోమా వాసనను ఇచ్చే మసాలాలతో తయారుచేస్తారు .

బట్టర్ మిల్క్ :

బట్టర్ మిల్క్ :

స్పైసీ బట్టర్ మిల్క్ . సమ్మర్లో తప్పకుండా తీసుకోవల్సి హెల్తీ డ్రింక్. ఇది దప్పికను తీర్చుతుంది. ఇది లోఫ్యాట్ హెల్త్ డ్రింక్. రెగ్యులర్ మిల్క్ కంటే మూడు రెట్లు ఫాస్ట్ గా డైజెస్ట్ అవుతుంది. ఈ కూల్ అండ్ రిఫ్రెషింగ్ డ్రింక్ వేసవిలో శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుతుంది. జీర్ణశక్తిని పెంచుతుంది.

జల్ జీర:

జల్ జీర:

జల్ జీర పాలపుర్ రిఫ్రెషింగ్ సమ్మర్ డ్రింక్ . ఈ శీతల పానీయాన్ని నిమ్మరసం, జల్జీరా పౌడర్ మరియు పుదీనాతో తయారుచేస్తారు. ఇది పొట్టను చల్లబర్చడం మాత్రమే కాదు, పొట్ట షేప్ ను కూడా మార్చేస్తుంది.

నింబు పానీ:

నింబు పానీ:

మన ఫేవరెంట్ సమ్మర్ డ్రింక్ నిమ్మరసం. ఈ డ్రింక్ ను ఫ్రెష్ గా ఉండే నిమ్మ పండ్లు, చిటికెడు ఉప్పు, పంచదారతో తయారుచేస్తారు. కొద్దిగా సాల్ట్ చేర్చడం వల్ల ఇన్ స్టాంట్ ఎనర్జీని పొందుతారు.

షుగర్ కేన్ జ్యూస్

షుగర్ కేన్ జ్యూస్

షుగర్ కేన్ జ్యూస్ వేసవి వేడి, చెమటల నుండి విముక్తి కలిగించడం మాత్రమే కాదు, వ్యాధులను కూడా దూరం చేస్తుంది. చెఱకు రసం ఎనర్జీ బూస్టర్ , వాతావరణం చాలా వేడిగా ఉన్నప్పుడు ఈ డ్రింక్ బాడీని కూల్ గా ఉంచుతుంది.

 మింట్ షర్బత్ :

మింట్ షర్బత్ :

మరో బెస్ట్ సమ్మర్ డ్రింక్ మింట్ షర్బత్. వేసవి వేడిని బీట్ చేయడానికి ఫ్రెష్ గా ఉండే పుదీనా ఆకులతో షర్బత్ ను తయారుచేస్తారు. ఈ రిఫ్రెషింగ్ బెవరేజ్ నిమ్మ మరియు పుదీనా ఆకుల కాంబినేషన్లో తయారుచేస్తారు. ఇది కేవలం దప్పక తీర్చడం మాత్రమే కాదు రిఫ్రెష్ చేస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది.

సట్టు షర్బత్:

సట్టు షర్బత్:

ఉత్తర్ ప్రదేశ్ మరియు బీహార్ లో పాపులర్ అయినటువంటి పిండి పదార్థం, ఈ పిండిని త్రుణధాన్యాలతో తయారుచేస్తారు. త్రుణ ధాన్యాలను రోస్ట్ చేసి, పౌడర్ చేస్తారు. ఈ పౌడర్ తో తయారుచేసే సమ్మర్ డ్రింక్ టేస్టీ మాత్రమే కాదు, హెల్తీ కూడా...సట్టు షర్బత్ లో కూలింగ్ లక్షణాలు అధికంగా ఉంటాయి. అలాగే జీర్ణశక్తిని కూడా పెంచుతుంది.

కోకనట్ వాటర్ :

కోకనట్ వాటర్ :

కోకనట్ వాటర్ బెస్ట్ ఇండియన్ సమస్యర్ డ్రింక్. సమ్మర్ హీట్ ను బీట్ చేస్తే హెల్తీ డ్రింక్. కోకనట్ వాటర్ తాగడం వల్ల రిఫ్రెషింగ్ ఫీలవుతారు.డీహైడ్రేషన్ సమస్య నుండి ఉపశమనం పొందుతారు. కోకనట్ వాటర్ లో ఎలక్ట్రోలైట్స్, న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి, ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతుంది. మరి ఆలస్యం చేయకుండా సమ్మర్ డ్రింక్స్ కు ఆర్డర్ చేసేయండి, ఆహ్లాదంగా ఎంజాయ్ చేసేయండి...

English summary

9 best Indian summer drinks to beat the heat naturally..

The Best Indian Summer Drinks that all you need to know to beat the heat