Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
జలుబు దగ్గునా? ఐతే మీ ఇంట్లో వాము, పసుపు ఉన్నాయా?
జలుబు, దగ్గు, గొంతు ఇన్‌ఫెక్షన్ సమస్యల నుంచి పెద్దలు, పిన్నలు ఉపశమనం పొందాలంటే.. హోం మేడ్ టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు.
వర్షాకాలంలోనూ, చలికాలంలోనూ బాగా వేధించే సమస్యలు జలుబు, దగ్గు. వర్షాకాలం వస్తే చాలు అప్పటివరకూ ఎక్కడ వుంటుందో తెలియదు కాని ఒక్కసారిగా వచ్చి పట్టేస్తుంది జలుబు. పిల్లలు స్కూలుకు వెళ్లెవరకూ బాగానే వుంటారు కాని తిరిగి ఇంటికి వచ్చేటప్పటికీ నీరసంగా వస్తారు. జలుబు అంటుకోగానే ఒకటే ఒళ్లు నొప్పులు, గొంతు, తలనొప్పి, జలుబు, జ్వరం... ఈ లక్షణాలన్నీ ఒకేసారి కనిపిస్తాయి.

కొందరికి ఒకటే తుమ్ములు, మరికొందరికి దగ్గు కనిపిస్తుంది. పెద్దవాళ్లయితే ఏదో ఒక విధంగా తట్టుకుంటారు కానీ పిల్లలు నీరసించిపోతారు. ఒకరి నుంచి ఒకరికి వెంటనే వ్యాపించే ఈ జలుబు, దగ్గు, గొంతు ఇన్‌ఫెక్షన్ సమస్యల నుంచి పెద్దలు, పిన్నలు ఉపశమనం పొందాలంటే.. హోం మేడ్ టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు. అదెలాగంటే...

వాము:
పొడి దగ్గు పగటి కంటే.. రాత్రి సమయంలో ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. నిద్రపట్టనివ్వకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. నిద్రించడానికి ముందు చిటికెడు వామును నలిపి దవడన పెట్టుకుని చప్పరించాలి. ఇలా చేయడం వల్ల దగ్గు అదుపులోకి వస్తుంది.

తులసి:
జలుబు, దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు ఉదయం పూట తులసి ఆకుల్ని నమలాలి. వీలైతే నీళ్లలో వేసి మరిగించి.. కషాయంగానూ తీసుకోవచ్చు. తులసి కషాయం కఫాన్ని నివారించి ఉపశమనం కలిగిస్తుంది.

దాల్చిన చెక్క:
ఇందులో వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్‌లను ఎదుర్కొనే గుణాలు అధికం. జలుబునుంచి ఉపశమనం లభిస్తుంది. దాల్చిన చెక్క పొడిలో తేనె కలిపి చప్పరించాలి. ఇలా రోజుకు రెండుమూడు సార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

అల్లం:
దీనిలో యాంటీవైరల్, ఫంగల్ గుణాలు అధికం. దగ్గు, గొంతునొప్పి.. వంటి వాటిని అదుపు చేస్తుంది. అల్లం సన్నగా తరిగి నమలడం లేదంటే...అల్లం టీ తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది.

తేనె:
వంటింటి ఔషధాల్లో తేనె ఒకటి. అల్లం, లేదంటే నిమ్మరసంలో తేనె కలిపి తీసుకోవాలి. అతిగా కాకుండా పరిమితంగా తీసుకోవడానికి ప్రాధాన్యమివ్వాలి. తేనె, నిమ్మరసం రోగనిరోధకశక్తిని పెంచుతాయి.

మిరియాలు:
చిటికెడు మిరియాల పొడికి చెంచా తేనె చేర్చి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దగ్గు తీవ్రత తగ్గుముఖం పడుతుంది. ఇలా ఉదయం పూట మాత్రమే తీసుకుంటే రోజంతా దాని ప్రభావం ఉంటుంది.

పసుపు:
యాంటీ సెప్టిక్ గుణాలున్న పసుపు పలు వ్యాధుల్ని నయం చేస్తుంది. జలుబు, దగ్గు విపరీతంగా బాధిస్తున్నప్పుడు గ్లాసు గోరువెచ్చటి పాలలో చిటికెడు పసుపు వేసుకుని తీసుకుంటే త్వరగా ఉపశమనం కలుగుతుంది.

నిమ్మరసం :
నిమ్మపండు ఈ సీజన్‌లో వచ్చే జలుబు లక్షణాలను త్వరగా తగ్గిస్తుంది. వేడి నీళ్లలో నిమ్మరసం, కాస్త తేనె కలుపుకొని రోజుకు రెండు సార్లు తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జబ్బు నుంచి త్వరగా ఉపసమనం పొందుతారు. ఇలా మన ఇంట్లో దొరికే వస్తువులతో మొదట జలుబు, దగ్గు నివారణ పొందె ప్రయత్నం చేసుకోవాలి.

వేడి నీటి ఆవిరి
వేడి నీటి ఆవిరి పట్టినా ఉపశమనం కలుగుతుంది. 10-15 నిమిషాల పాటు ఇలా ఆవిరి పట్టాలి. ఆ నీటిలో యూకలిప్టస్ ఆయిల్ కలిపితే మరీ మంచిది. శ్వాస సాఫీగా సాగేందుకు ఇది ఎంతో సహాయకారిగా పనిచేస్తుంది.



Click it and Unblock the Notifications