అలర్ట్ : అధిక బరువుతో డయాబెటిస్ మాత్రమే కాదు..ఇతర అనర్థాలెన్నో చూడండి...

Posted By:
Subscribe to Boldsky
కొన్ని వ్యాధులని గుర్తించడం కష్టం కానీ చికిత్స అందించడం తేలిక. ఊబకాయం విషయంలో ఇందుకు వ్యతిరేకంగా ఉంటుంది పరిస్థితి. దాన్నుంచి బయటపడటం అనుకున్నంత సులువు కాదు. పైగా దాంతో ఇతర జబ్బులూ వేధిస్తాయి.. టీనేజీలో ఊబకాయం బారిన పడుతోన్న అమ్మాయిలకయితే.. నెలసరి సమస్యలతోపాటూ మరికొన్ని వేధిస్తాయి.. అవేంటీ.. రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

సరైన పోషకాహారం తీసుకోకపోవడం, వ్యాయామాలు చేయకపోవడం, ఏది పడితే అది తినేయడం వల్ల మనదేశంలో ఏటా మూడు లక్షలమంది టీనేజీ యువత ఊబకాయం బారిన పడి.. చనిపోతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి అంతేనా.. ఆ సమస్యతో తాత్కాలికంగా, దీర్ఘకాలికంగా ఎదురయ్యే సమస్యలూ ఉంటాయి. హార్ట్ సమస్యలు, హైపర్ టెన్షన్ మొదలగు సమస్యలు వెంటాడుతాయి.

అలాగే అండర్ వెయిట్ లో ఉండటం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు, అండ్ వెయిట్ వల్ల మాల్ న్యూట్రీషియన్ సమస్య ఏర్పడుతుంది. దాంతో శరీరంలో అవయవాలు ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువ. కాబట్టి, ఓవర్ వెయిట్ లేదా అండర్ వెయిట్ లో ఉండటం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అధిక బరువు పెరగడం వల్ల శరీరంలో తాత్కాలికంగా, దీర్ఘకాలికంగా ఎదురయ్యే సమస్యలు ఈ క్రింది విధంగా..

ఆర్థ్రైటిస్ :

ఆర్థ్రైటిస్ :

వయస్సైన వారిలో ఆర్థ్రైటిస్ సమస్య ఎదురవుతుంది. కండరాలు, జాయింట్స్ పట్టివేయడం, ఇన్ఫ్లమేషన్ కు గురిచేయడం జరుగుతుంది. హార్మోనుల అసమతుల్యత వల్ల అన్ ఎక్స్ ప్లెయిండ్ వెయిట్ లాస్ కు దారితీస్తుంది.

లూపస్ :

లూపస్ :

అధిక బరువు వల్ల మరో ఆటోమాటిక్ డిసీజ్ లూపస్ వ్యాది. ఇది వ్యాధినిరోధకత మీద ప్రభావం చూస్తుంది. క్రమంగా ఆకలి తగ్గుతుంది.

పోరియోసి:

పోరియోసి:

పోరియోసిస్ అనేది చర్మ సంబంధిత సమస్యలు, స్కిన్ సెల్స్ ఇన్ఫ్లమేషన్ కు దారితీస్తుంది. ఈ పరిస్థితి బరువు పెరగడానికి కారణమవుతుంది. మెటబాలిక్ రేటు తగ్గుతుంది.

పీసీఓఎస్‌(పాలిసిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌):

పీసీఓఎస్‌(పాలిసిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌):

స్థూలకాయం బారిన పడే అమ్మాయిల్లో అరవైశాతం మంది పీసీఓఎస్‌ బారిన పడుతున్నారు. దాంతో అమ్మాయిల్లో పురుష హార్మోన్లు ఎక్కువగా స్రవిస్తాయి. అవాంఛిత రోమాలు మొదలవుతాయి. మొటిమలూ వస్తాయి. జుట్టూ రాలిపోతుంది. ఇలాంటి సంకేతాలు కనిపిస్తున్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి.

హైపో థైరాయిడిజం:

హైపో థైరాయిడిజం:

అధిక బరువు వల్ల మరో హార్మోనల్ డిసీజ్ హైపర్ థైరాయిడిజం. థైరాయిడ్ హార్మోన్స్ అసమతుల్యత కారణంగా ఆకలి తగ్గిపోతుంది మరియు బరువు కూడా కోల్పోతారు.

మధుమేహం:

మధుమేహం:

వూబకాయంతో పొంచి ఉండే సమస్యల్లో మధుమేహం కూడా ఉంటుంది. వీరిలో మొదట్లో రక్తంలో చక్కెరస్థాయులు ఎక్కువగా కనిపిస్తాయి. అంటే ఎప్పుడో ఒకప్పుడు మధుమేహం వస్తుందనడానికి అది సంకేతం అన్నమాట. ఇది వస్తే గనుక.. ఆ ప్రభావం గర్భధారణ సమయంలోనూ పడుతుంది. అంటే బిడ్డ పెద్దగా పెరగడమే కాదు, పుట్టాక కూడా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అందుకే మధుమేహం వచ్చే సంకేతాలు కనిపించగానే రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ముందు బరువు తగ్గేలా చూసుకోవాలి. ఒకవేళ వస్తే గనుక.. వీలైనంతవరకూ దాన్ని నియంత్రణలో ఉంచుకుంటే మంచిది.

నెలసరిలో తేడా:

నెలసరిలో తేడా:

కాస్త లావుగా ఉంటే ఏమవుతుంది అని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతుల్లో తిన్న ఆహారం కొవ్వుగా.. అది శక్తిగా మారుతుంది. దాంతో మన జీవక్రియల పనితీరు కూడా సమతూకంలో ఉంటుంది. అదే బరువు ఎక్కువగా ఉండి వూబకాయంతో బాధపడేవారిలో ఇలా జరగదు. ఆహారం.. కొవ్వు నిల్వలుగా, శక్తిగా మారే క్రమంలో అవరోధాలు ఏర్పడతాయి. దాంతో గర్భాశయం పనితీరుపై ప్రభావం పడి, నెలసరిలోనూ తేడా కనిపిస్తుంది. ఒక్కోసారి రెండునెలలకోసారి రావడం, లేదా అధికరక్తస్రావం కావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటప్పుడూ నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించి.. పరీక్షలు చేయించుకోవాలి.

గుండె జబ్బులు:

గుండె జబ్బులు:

చిన్నప్లిలలకు గుండె జబ్బులా అని ఆశ్చర్యపోకండి. నిజమే! శరీరంలో ఇన్సులిన్‌ స్థాయిలు పెరగడం వల్ల గుండెపై ఆ ప్రభావం పడుతుంది. కొలెస్ట్రాల్‌ పెరగడం, అధిక రక్తపోటు వల్ల ఈ సమస్య వస్తుంది. ఐదు నుంచి 17 యేళ్ల పిల్లల్లో 70 శాతం మంది అధిక బరువు ఉంటే అందులో కనీసం ఒకరికి గుండె జబ్బు వచ్చే ఆస్కారం ఉంది. వూబకాయం, పీసీఓఎస్‌ ఉండేవారిలో ట్రైగ్లిజరాయిడ్లు పెరిగి గుండెజబ్బులు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది.

ఇతర సమస్యలు:

ఇతర సమస్యలు:

వూబకాయం వల్ల ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌ వచ్చే ఆస్కారం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈస్ట్రోజన్‌ హార్మోను ఎక్కువగా విడుదల కావడం, అధికరక్తపోటు ఉండటం, సంతానలేమి వంటివివన్నీ ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌ రావడానికి దారితీస్తాయి. ఇవన్నీ పరోక్షంగా పీసీఓఎస్‌ సమస్యతో ముడిపడి ఉంటాయి. ఈ పరిస్థితిని వూపేక్షిస్తే రొమ్ము, కొలోన్‌ క్యాన్సర్లతోపాటూ మూత్రపిండాలు, పాంక్రియాస్‌, గాల్‌బ్లాడర్‌, అండాశయాలు, ప్రొస్టేట్‌ వంటి భాగాలపైనా ప్రభావం పడుతుంది. థైరాయిడ్‌ గ్రంథి పనితీరు కూడా సరిగ్గా ఉండదు. వూబకాయుల్లో ఎముకలూ, కీళ్ల సంబంధ సమస్యలూ, నిద్రలేమి, గురక వంటివీ కనిపిస్తాయి. ఈ సమస్యల కారణంగా పిల్లలు నలుగురిలోకి రావడానికి బిడియపడి ఒంటరిగా గడిపేందుకు ప్రాధాన్యం ఇస్తారు.

English summary

9 Surprising Diseases That Can Cause Weight Problems

When we experience certain fluctuations in our weight, either weight gain or loss, we usually associate it with our diets, right? Well, did you know that there are certain diseases that can cause weight gain or weight loss, that have nothing to do with your diet and exercise routine?
Story first published: Friday, February 17, 2017, 16:37 [IST]
Subscribe Newsletter