మద్యం తీసుకోవడం వల్ల క్యాన్సర్ అభివృద్ది చేసే ప్రమాదాన్ని పెంచుతుందా?

Posted By: Gandiva Prasad Naraparaju
Subscribe to Boldsky

మీరు వారమంతా గడిపాక, వీకెండ్ దగ్గరపడింది, కాబట్టి మీరంతా మీ స్నేహితులతో బైటికి వెళ్లి, వారం మొత్తం మీరుపడిన వత్తిడిని పోగొట్టుకోవడానికి ఊపిరాడకుండా మందు ఎక్కువ తాగుతారు.

అయితే, మీరు ఎన్నిసార్లు కేవలం ఒకటి లేదా రెండు గ్లాసులతో తాగడం ఆపేసారు? చాలా అరుదు, అవునా? ఎందుకంటే మీరు "పార్టీ మోడ్" లోకి ఒకసారి ప్రవేశించాక, ఒక గ్లాస్ మద్యం తాగి ఆపేసి, ఇంటికి వెళ్ళడం అనేది చాలా కష్టం!

ముఖ్యంగా నేడు, కాస్మోపాలిటిన్ సిటీలలో, చాలామంది పబ్బులకు, క్లబ్బులకు వెళ్ళడానికి ఇష్టపడతారు, నిషిద్ధత ఎక్కువకాలం పరిగణించబడలేదు, ఇది కొన్ని సంవత్సరాల క్రితం ఉండేది!

causes of cancer, side-effects of alcohol

క్యాన్సర్ కి కారణాల

కాబట్టి, వారాంతంలో లేదా సమాజంలో పేరు పొందాలి అనుకునేవారు, ప్రత్యేకంగా ఇప్పుడు యవ్వనంలో ఉండేవారు మద్యం తాగుతున్నారు.

ఇతర ఆహరం లేదా పానీయాలలా కాకుండా, ఎవరైనా మద్యం తాగడం మొదలు పెడితే, దాన్ని అంత త్వరగా మానుకోవడం చాలా కష్టం, ఎందుకంటే ఎంత ఎక్కువ మద్యం మీరు తాగితే, అంత "అధిక సంతోషం" ని పొందుతారు, కాబట్టి చాలామంది వారు చనిపోయేవరకు మందు తాగుతూనే ఉంటారు!

ఇప్పుడు, ఒక వ్యక్తీ అపుడపుడు ఎక్కువ మధ్య౦ తాగితే, అది అతని ఆరోగ్యానికి చాలా ప్రమాదం, కానీ ప్రాణాంతకం కాకపోవచ్చు. అయితే, దీన్ని ప్రతిరోజూ తాగే వ్యక్తి, అతను/ఆమె ఇద్దరి జీవితం, ఆరోగ్యం ప్రమాదంలో పడినట్టే!

మద్యం కేవలం మీ శారీరిక ఆరోగ్యానికి మాత్రమే ప్రమాదం కాదు, గణనీయమైన స్థాయిలో మానసిక ఆరోగ్యానికి కూడా ప్రమాదమేనని మనకు ఇంతకూ ముందే తెలుసు.

మద్యం వ్యసనం అనేది చాలా ప్రమాదకర విషయం, అది మిమ్మల్ని, మీ చుట్టూ ఉండేవారి జీవితాలను, ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది.

మద్యం వాడకం వల్ల అజీర్తి, అసిడిటీ, కాలేయం సరిగా పనిచేయకపోవడం వంటి అనేక ప్రమాదాలు సంభవించవచ్చు.

అయితే, ప్రతిరోజూ మద్యం సేవించే వారికి క్యాన్సర్ కారక ప్రమాదం కూడా ఉందని ఈమధ్య పరిశోధనలో వెల్లడైంది!

మద్యం క్యాన్సర్ కారకాలను ఎలా కారణమవుతుందో, ఈ కారణం వల్ల ఏ రకమైన క్యాన్సర్ వస్తుంది అనే విషయాల గురించి ఈ కింది ఆర్టికిల్ లో ఇవ్వబడింది. ఒకసారి చూడండి.

causes of cancer, side-effects of alcohol

క్యాన్సర్ కి కారణాలు

క్యాన్సర్, మద్యం వాడకం మధ్య సంబంధం

క్యాన్సర్ అనేది ఘోరమైన వ్యాధి, ఇది మనుషులతో పాటు జంతువుల జీవితాలపై ప్రభావం చూపే ప్రమాదకర వ్యాదులలో ఒకటని మనకు ముందే తెలుసు.

క్యాన్సర్ శరీరంలోని కణాలలో అసాధారణంగా సంభవించే వ్యాధి, ఇది కణితి లాగా గణనీయంగా పెరిగి, కణాలను, అవయవాలను నాశనం చేస్తుంది. చాలా కేసులలో, రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, మెదడులో కణితి, బ్లడ్ క్యాన్సర్ వంటి కొన్ని సాధారణ రకాల క్యాన్సర్లు ఉన్నాయి.

క్యాన్సర్ వ్యాధి ఏ వయసు వారికైనా, స్త్రీ/పురుషుల కైనా రావొచ్చు.

దురదృష్టకరమైన అంశం ఏమిటంటే ఎటువంటి క్యాన్సర్ కైనా చికిత్స ఉంది: అయితే, క్యాన్సర్ పునరావృతమై, జీవితాలను కోల్పోయే కేసులు కూడా అనేకం ఉన్నాయి!

చాలా సందర్భాలలో, మనం ప్రతిదీ సరిగా చేసినప్పటికీ, అంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడ౦, రోజూ వ్యాయామం వంటివి చేసినా క్యాన్సర్ ప్రభావం పడే అవకాశాలు ఇప్పటికీ ఉన్నాయి.

causes of cancer, side-effects of alcohol

క్యాన్సర్ కారణాలు

కాబట్టి, ధూమపానం, మద్యపానం వంటి అనరోగ్యకరం జీవనశైలి అలవాట్ల వల్ల కూడా క్యాన్సర్ ప్రమాదాలు పెరుగుతాయి!

సందర్భానుసారం కాకుండా, అధిక మద్యం తాగే, వ్యక్తులకు క్యాన్సర్ అభివృద్ది చెందే ప్రమాదం ఖచ్చితంగా ఉందని ఈమధ్య అమెరికన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ (ASCO) నిర్ధారించింది.

ఏ రకానికి చెందిన మద్యం అయినా ప్రతిరోజూ ఒక గ్లాసు తాగితే క్యాన్సర్ ప్రమాదం దాదాపు 5% పెరిగే అవకాశం ఉందని ఈమధ్య అధ్యయనాలు వెల్లడించాయి!

ఆల్కాహల్ వినియోగంతో అనుసంధానించబడి ఉన్న వివిధ రకాల క్యాన్సర్ లలో రొమ్ము క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఒసోఫగల్ ల్యాన్సర్, హెడ్, నెక్ క్యాన్సర్ మొదలైనవి ఉన్నాయి.

ఆల్కాహాల్ లో ఉన్న టాక్సిన్స్ వల్ల శరీరంలో క్యాన్సర్ ప్రేరిత కణాలు పెరుగుతాయి, వాటి అసాధారణ పెరుగుదల వల్ల, ఈ ప్రమాదకర వ్యాధి పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

కాబట్టి, చివరిగా, మద్యం తాగడం వల్ల క్యాన్సర్ ప్రమాదం ఖచ్చితంగా పెరుగుతుంది!

English summary

Can Alcohol Consumption Increase Cancer Risk

Many people indulge in drinking alcohol occasionally or even on a regular basis. Alcohol has a number of physiological and mental side effects on one's health. However, can alcohol also increase the risk of developing cancer? Find out here.
Story first published: Friday, December 15, 2017, 18:00 [IST]