వెల్లుల్లితో నెల లో 3 కిలోల బరువు తగ్గండి

By: Y. Bharath Kumar Reddy
Subscribe to Boldsky

అధిక బరువుతో అనేకమంది బాధపడుతుంటారు. ఒక్కసారి మీరు ఈ బొమ్మ వేసుకోండి.. మీరు బట్టల షాప్ కు వెళ్లారు.. అక్కడ మీ కంటికి నచ్చినటువంటి.. మీరు కోరిన డ్రెస్ లు చాలా ఉన్నాయి. ఇక మీరేమో ఫుల్ గా షాపింగ్ చేయాలనుకున్నారు. కానీ అందులో ఒక్కటి కూడా మీకు సరిపోదు. అన్నీ మీకు చిన్న సైజ్ అవుతాయి. అప్పడు మీపై మీకే కోసం వస్తుంది. నిరాశతో అక్కడి నుంచి మీరు వెనుతిరాగాల్సి వస్తుంది.

ఇలా చాలామంది విషయాల్లో జరుగుతూ ఉంటుంది. మనలో చాలామందికి అందంగా కనపడాలని ఉంటుంది. బాడీ ఫిట్ గా ఉండాలని మనం ఏ డ్రెస్ వేసినా డ్రెస్ కే అందం వచ్చేలా ఉండాలని అనిపిస్తుంది. అదిరిపోయే అవుట్ లుక్ ఉంటే ఇది సాధ్యమే. కానీ చాలామంది ఎక్కువ ఫ్యాట్ కలగి ఉండి లావుగా ఉండడంతొ వారు ఏ డ్రెస్ వేసుకున్నా సూట్ కాదు. ఊబకాయం వల్ల చాలా మంది అసహనానికి గురవుతూ ఉంటారు.

వెల్లుల్లిని పరగడుపుతోనే ఎందుకు తినాలి? ఆరోగ్య రహస్యాలేంటి...

Raw Garlic Remedy For Weight Loss

మన జీవన విధానం, తీసుకునే ఆహారం, చేసే పని, ఒత్తిడి ఇలాంటి కారణాల వల్ల చాలామంది ఊబకాయానికి గురవుతూ ఉంటారు. ఫలితంగా మనకు తెలియకుండానే శారీరకంగా, మానసికంగా మనలో ఎన్నో మార్పులు వస్తుంటాయి. తీరా తెలుసుకునే లోపు జరగాల్సింది జరిగిపోతోంది.

ప్రస్తుత కాలంలో ఆడ, మగ అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఊబయకాయం ఉన్న వారు ఎక్కువగా నిరాశకు లోనవుతూ ఉంటారు. ఇలాంటి వారు కొన్ని వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. అధిక రక్తపోటు, డయాబెటిస్, కరోనరీ డిజార్డర్స్, జాయింట్ పెయిన్ అధిక కొలెస్ట్రాల్, అజీర్ణం మొదలైన వ్యాధుల బారినపడే అవకాశం ఉంది. అలాగే క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆరోగ్యకరమైన జీవనశైలిని మీరు కొనసాగించడానికి ఫస్ట్ ఊబకాయం నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది.

రోస్ట్ చేసిన 6 వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల పొందే అమేజింగ్ బెన్ఫిట్స్..!

Raw Garlic Remedy For Weight Loss

అయితే మీరు ఒక నెలలో 3 కిలోల వరకు బరువు తగ్గేందుకు ఒక మంచి చిట్కా ఉంది. దీన్నిమీరు ఫాలో అయితే కచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. ఇందుకు ముఖ్యంగా కావాల్సినవి వెల్లుల్లి.

తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు :

పచ్చి వెల్లుల్లి - 2 నుంచి 3 పీసులు

తేనె - 1 టేబుల్ స్పూన్

వెల్లుల్లిని పొట్టు తీసుకుని ముక్కలుగా చేసుకోండి. అందుకు తగినట్లుగా తేనెను ఒక పాత్రలో తీసుకోండి. రెండింటిని కలిపి ఒక పేస్ట్ మాదిరిగా తయారు చేసుకోండి. ఈ పేస్ట్ ను ప్రతి రోజూ ఉదయంపూట పరగడుపున తీసుకోండి. ఇలా నెల రోజుల పాటు చేయండి. దీంతో మీ బరువులో కచ్చితంగా తేడా కనిపిస్తుంది. దీన్ని తీసుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం తీసుకోవాలి.

Raw Garlic Remedy For Weight Loss

అలాగే ప్రతిరోజూ కనీసం ఒక గంట వ్యాయామం చేయాలి. దీంతో మీరు తీసుకునే చిట్కా మరింత సమర్థవంతంగా పని చేస్తుంది. వెల్లుల్లి లో అలిసిన్ ఉంుంది. ఇది మీ కొవ్వును వేగంగా కరిగించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే తేనెలోని రిచ్ అమ్లజనకాలు మీ శరీరంలోని కొవ్వు నిల్వలు తగ్గడానికి ఉపయోగపడతాయి. తద్వారా మీరు వెంటనే బరువు కోల్పొతారు. దీంతో మీరు ఒక నెలలో మూడు కిలోల బరువు తగ్గుతారు.

English summary

Raw Garlic Remedy For Weight Loss

Raw Garlic Remedy For Weight Loss ,Here is an ancient remedy for weight loss which has proven to have great results.
Subscribe Newsletter